BRS MLC K Kavitha to Deliver Keynote Address
Hyderabad: In commemoration of the 75th anniversary of the Indian Constitution, the Telangana Jagruthi Student Federation will host a seminar on January 26 at the Telangana Saraswatha Parishath in Hyderabad. BRS MLC K Kavitha will deliver the keynote address, with the event aimed at fostering meaningful dialogue on the Constitution’s implementation, its challenges, and its relevance in the modern era. The gathering will include research scholars, leaders, and students from various fields.
Unveiling the poster of the seminar titled “Ganatantra Bharat, Jaagrutha Bharat” earlier today, the leadership of Telangana Jagruthi emphasized the importance of revisiting the foundational principles of the Constitution. They stressed the need for collective efforts to ensure that its benefits reach all citizens, particularly marginalized communities. The seminar will provide a platform for diverse voices to engage in discussions on key issues such as the challenges in implementing the rights guaranteed by the Constitution, the role of the judiciary in upholding constitutional values, and the ongoing struggles faced by women and minority groups in accessing their rights.
Additionally, the seminar will explore key themes such as strengthening democracy and transparency through necessary reforms, elections and democracy under the Indian Constitution, the approach of contemporary governments towards constitutional values, and caste enumeration and its implications. The Telangana Jagruthi Student Federation invites students, research scholars, and constitutional experts to participate in this landmark event.
Also Read-
రాజ్యాంగంపై 26న తెలంగాణ జాగృతి సెమినార్
కీలకోపన్యాసం చేయనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 26 తేదీన తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో “గణతంత్ర భారత్ – జాగ్రత్త భారత్” పేరిట హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో సెమినార్ నిర్వహించనుంది. ఈ సెమినార్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేయనున్నారు.
రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడం, సవాళ్లు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, మహిళా సాధికారత, మైనారిటీలు, బలహీన వర్గాలు, కులగణన వంటి మొత్తం 16 అంశాలపై ఈ సెమినార్ లో చర్చించనున్నారు. భారత రాజ్యాంగం అమలు జరిగిన నాటి నుంచి నేటి వరకు దాని స్పూర్తిని అనుసరించి ప్రజలకు దక్కవలసిన హక్కులు ఎంత మేరకు దక్కాయన్న చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి అభిప్రాయపడింది. రాజ్యాంగం పట్ల ప్రజలకు సంపూర్ణ అవగాహన ఏర్పడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాజ్యాంగ స్పూర్తిని దృష్టిలో పెట్టుకొని పాలకులు అది ప్రతిపాదించిన హక్కులను పౌరులకు దక్కేలా కృషి చేయాలని కోరింది.
భారత రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టేందుకు, ఫలాలను మరింత విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలకు దక్కేందుకు ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని, కాబట్టి ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సెమినార్ లో ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో నవీన్ ఆచారి , చరణ్ పసుల, శ్రీకాంత్ గౌడ్, లింగం , డాక్టర్ సత్య , వసుమతి, కృష్ణ కిషోర్ , శ్రీనివాస్ గౌడ్ , మాడ హరీష్ రెడ్డి , జన్ము రాజు , అశోక్ యాదవ్ , గాజుల అరుణ్ పాల్గొన్నారు.