हैदराबाद: तेलंगानावादी और पत्रकार आर सत्यनारायण का निधन हो गया है। तेलंगाना आंदोलन के दौरान मेदक संयुक्त जिले के लिए समाचार रिपोर्टर के रूप में काम कर रहे आर सत्यनारायण पूर्व मुख्यमंत्री केसीआर द्वारा गठित बीआरएस पार्टी में शामिल हो गए। तेलंगाना की प्राप्ति के लिए आंदोलनों में सक्रिय रूप से भाग लिया। सत्यनारायण बीआरएस की ओर से स्नातक एमएलसी के रूप में विजयी हुए।
तेलंगाना राज्य के गठन के लिए केसीआर के आह्वान के तहत एमएलसी पद से इस्तीफा दे दिया। जबकि उनका कार्यकाल अभी पांच वर्ष शेष था। तेलंगाना राज्य के गठन के बाद केसीआर ने सत्यनारायण को टीएस पीएससी समिति का सदस्य बनने का अवसर दिया। कई नेताओं और पत्रकारों ने सत्यनारायण के निधन पर शोक व्यक्त किया है। एक वरिष्ठ पत्रकार और नेता के रूप में संयुक्त मेदक जिले में युवा पत्रकारों के लिए एक आदर्श थे।
यह भी पढ़ें-
తెలంగాణ ఉద్యమ కారుడు, జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ మృతి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ మృతి చెందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి మెదక్ జిల్లా వార్త రిపోర్టర్ గా పనిచేస్తున్న ఆర్ సత్యనారాయణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. బీఆర్ఎస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీగా సత్యనారాయణ గెలుపొందారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇంకా ఐదు సంవత్సరాల పదవి కాలం ఉండగానే రాష్ట్ర సాధన కోసం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సత్యనారాయణకు కేసీఆర్ టీఎస్ పీఎస్సీ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించారు. సీనియర్ జర్నలిస్ట్ గా రాజకీయ నాయకుడిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో యువ జర్నలిస్టులకు ఆదర్శప్రాయంగా నిలిచిన సత్యనారాయణ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. (ఏజెన్సీలు)