10th Hindi Question Paper Leak Case : బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్

హైదరాబాద్ : టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది హన్మకొండ ప్రిన్సిపల్  మెజిస్ట్రేట్ కోర్టు. ఏప్రిల్ 19 వరకు బండి సంజయ్ రిమాండ్ లో ఉండనున్నారు. బండి సంజయ్ ని కాసేపట్లో కరీంనగర్ సబ్  జైలుకి తరలించనున్నారు. బండి సంజయ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను కరీంనగర్ జైలుకి తరలించనున్నారు.  

కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని వాదించారు లాయర్లు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు బండి సంజయ్ కి రెండు వారాల రిమాండ్ విధించింది.   కోర్టు రిమాండ్ పై నిర్ణయం తీసుకోవడంతో బండి సంజయ్ తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

హన్మకొండ కోర్టు దగ్గరకు బీఆర్ఎస్,  బీజేపీ కార్యకర్తలు   భారీగా చేరుకున్నారు.  ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో  కోర్టు దగ్గర  పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

ఫ్లాష్….ఫ్లాష్…

పోలీసుల దురుసు ప్రవర్తనతో తనకు తగిలిన గాయాలను షర్ట్ విప్పి న్యాయవాదులకు చూపించిన బండి సంజయ్. నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్ట్ చేసిన తీరును బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు వివరిస్తున్న బండి సంజయ్.

తెలంగాణలో సంచలనంగా మారిన టెన్త్ పేపర్ లీకేజీ కేసు

తెలంగాణలో సంచలనంగా మారిన టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అగ్గిరాజేస్తుంది. ఈ క్రమంలోనే.. ఆయనను మంగళవారం అర్థరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇవాళ నాటకీయ పరిణామాల మధ్య వరంగల్‌లోని న్యాయస్థానంలో హాజరుపర్చేందుకు తీసుకొచ్చారు. అయితే.. ఈ క్రమంలోనే బండి సంజయ్‌కు సంబంధించిన రిమాండ్ రిపోర్టు బయటకు రాగా.. కీలక అంశాలు వెలుగు చూశాయి. పేపర్ లీకేజీ కేసులో నిన్నటివరకు ఏ-5గా పేర్కొన్న బండి సంజయ్ పేరును.. రిమాండ్ రిపోర్టులో మాత్రం ఏ1గా పేర్కొన్నారు. ఏ2గా బూర ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5 మోతం శివగణేశ్, ఏ6 పోగు సురేశ్, ఏ7గా పోగు శంశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్ , ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా వసంత్‌ను పోలీసులు పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రశాంత్ పేపర్ లీకేజ్ అయినట్లుగా వాట్సాప్‌లో ప్రచారం చేశారు. ప్రశాంత్ 10:41కి హిందీ పేపర్‌ను ఈటల రాజేందర్‌కు పంపించారు. అనంతరం 11:24 నిమిషాలకు బండి సంజయ్‌కి పేపర్‌ని పంపించారు. హిందీ పేపర్ వాట్సాప్‌లో పంపిన తర్వాత ప్రశాంత్ 149 మందితో మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే బండి సంజయ్, ప్రశాంత్ ఇద్దరు కుట్రపన్నినట్లుగా పోలీసులు గుర్తించారు. 9 గంటల 30 నిమిషాలకు పేపర్ లీకేజ్ అయినట్లుగా ప్రశాంత్ వాట్సాప్ గ్రూప్‌లో తప్పుడు ప్రచారం మొదలుపెట్టాడు. ఈ కేసులో మరి కొంతమంది కీలక సాక్షులను విచారించవల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.

ఫ్లాష్….ఫ్లాష్…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వాహనంపై దాడి చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పదో తరగతి పేపర్ల లీకేజీకి కుట్రదారుడిగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు. ఆయన్ను హన్మకొండ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఏప్రిల్ 5వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో పోలీస్ వాహనంలో ఆయన్ను కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో వరంగల్ అధాలత్ సెంటర్ దగ్గర కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ వాహనంపై చెప్పులు, కోడి గుడ్లు విసిరారు. బండి సంజయ్ వెళుతున్న వాహనాన్ని టార్గెట్ చేసి మరీ చెప్పులు, కోడిగుడ్లు విసరటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ ప్రాంతం నుంచి వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లారు పోలీసులు. 

కోర్టు దగ్గరకు వచ్చిన సమయంలోనూ బండి సంజయ్ ఉన్న పోలీస్ వాహనంపై చెప్పులు విసిరారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అప్పటికే అక్కడ ఉన్న వందలాది మందిని చెల్లాచెదురు చేశారు. బండి సంజయ్ కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డగించారు. బండిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీస్ వాహనంపైకి ఎక్కి అడ్డుకున్నారు. పోలీసులు లాఠీఛార్జి చేసి అందర్నీ చెదరగొట్టారు. బండి సంజయ్ పై చెప్పులు, కోడిగుడ్లు విసిరినట్లు వార్తలు రావటంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హన్మకొండ కోర్టు ఎదుట నిరసనకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో కోర్టు చుట్టుపక్కల భారీగా మోహరించిన పోలీసులు అక్కడి నుంచి అందర్నీ పంపించి వేశారు. కోర్టు చుట్టుపక్కలకు ఎవరూ లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు.

ఫ్లాష్….ఫ్లాష్…

• హన్మకొండ కోర్టు మెజిస్ట్రేట్ నివాసం వద్దకు భారీగా చేరుకుని బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు

• బండి సంజయ్ ను చూడగానే జై బీజేపీ, జైజై బండి సంజయ్ అంటూ నినాదాలు

• వ్యూ వాంట్ జస్టిస్ అంటూ నినదించిన కార్యకర్తలు, అభిమానులు

• పోలీస్ వాహనంలోనుండి దిగుతూ నవ్వుతూ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం తెలుపుతూ మెజిస్ట్రేట్ పోలీసులతో కలిసి నివాసంలోకి వెళ్లిన బండి సంజయ్

• కాసేపట్లో బండి సంజయ్ రిమాండ్ పై నిర్ణయం వెలువడనున్న ఉత్తర్వులు

ఫ్లాష్….ఫ్లాష్…

శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేడు తేదీ 5 ఏప్రిల్ 2023న హైదరాబాదులో విడుదల చేసిన ప్రకటన

భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సభ్యులతో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి & తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ తరుణ్ ఛుగ్ వర్చువల్ గా మాట్లాడడం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ కే లక్ష్మణ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణతోపాటు బిజెపి కోర్ కమిటీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు తదితర నేతలు పాల్గొన్నారు

ఈ సందర్భంగా కోర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతూ నియంత ధోరణితో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని అరెస్టు చేశారని దానిని బిజెపి కార్యకర్తలు నాయకులు ఎదుర్కొంటామని ఎలాంటి బెదిరింపులకు దాడులకు భయపడేది లేదని రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, రేపు అన్ని పోలింగ్ బూత్ లలో ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు

ఈరోజు అదే విధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బిజెపి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జులు ఇతర ముఖ్య నాయకులతో మాట్లాడడం జరిగింది. పార్టీ నాయకులందరూ ముక్తకంఠంతో బిఆర్ఎస్ ప్రభుత్వ నియంత ధోరణి, అప్రజాస్వామికి చర్యలను ప్రజల మధ్య తీసుకెళ్తామని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటంలో ఉధృతం చేస్తామని, పరీక్ష పత్రాలు లీక్ కావడంతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిత అంధకారంలోకి నెట్టిందని, పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. బిఆర్ఎస్ ప్రభుత్వం పతనం దిశగా పయనిస్తూ నిస్సహాయ స్థితిలో బిజెపిని కార్యకర్తలను నాయకులను టార్గెట్ చేస్తూ భయాందోళన గురి చేయాలని తద్వారా బిఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందాలన్నా ఆలోచన ఉంది. తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయం.

వరంగల్ సీపీ రంగనాథ్….

టెన్త్ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వరంగల్ సీపీ రంగనాథ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో బండి సంజ‌య్‌ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్ర‌శాంత్, ఏ3గా మ‌హేశ్‌, ఏ4గా మైన‌ర్ బాలుడు, ఏ5గా మోతం శివ‌గ‌ణేశ్‌, ఏ6గా పోగు సురేశ్‌, ఏ7గా పోగు శ‌శాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోత‌బోయిన వ‌సంత్ పేర్ల‌ను చేర్చారు.

నిందితుడు బూర ప్రశాంత్ గతంలో జర్నలిస్టుగా పనిచేశాడని, ప్రస్తుతం అతనికి ఏ మీడియా సంస్థతో సంబంధం లేదని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్  పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్  చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు.

బండి సంజయ్, ప్రశాంత్ మధ్య  పలు కాల్స్, చాట్స్ జరిగినట్లుగా సీపీ  తెలిపారు. బండి సంజయ్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందని సీపీ రంగనాథ్ తెలిపారు. బండి సంజయ్‌ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు వరంగల్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

బండి సంజయ్ పై మహా కుట్రకు పథకం రచించిన బీఆర్ఎస్. టెన్త్ పేపర్ లీక్ కు ప్రధాన కారకుడిగా పేర్కొంటూ బండి సంజయ్ ను ఏ1గా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న పోలీసులు. హన్మకొండ మెజిస్ట్రేట్ నివాసానికి బండి సంజయ్ ను తీసుకెళ్లిన పోలీసులు.

ఫ్లాష్… ఫ్లాష్

ఫ్లాష్….ఫ్లాష్…

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ నాంపల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న బీజేపీ కార్యర్తలు. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ కార్యకర్తల నినాదాలు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ నాంపల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న బీజేపీ కార్యర్తలు. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ కార్యకర్తల నినాదాలు.

ఫ్లాష్….ఫ్లాష్…

• హన్మకొండ అదాలత్ కోర్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు

• బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను 5 గంటలుగా వాహనంలోనే తిప్పుతున్న పోలీసులు.

• బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేసి 13 గంటలైనా ఇప్పటికీ కోర్టు ముందు ప్రవేశపెట్టని పోలీసులు

• వరంగల్ జిల్లాలోని జాఫర్ ఘడ్ పరిసర ప్రాంతాల్లో బండి సంజయ్ వాహనాన్ని తీసుకెళుతున్న పోలీసులు


ఫ్లాష్….ఫ్లాష్

• పోలీసుల అక్రమ అరెస్ట్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

• ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు భోజనం చేసేందుకు కూడా నిరాకరించిన బండి సంజయ్

• బండి సంజయ్ ను హన్మకొండ కోర్టుకు తరలించేందుకు సిద్ధమైన పోలీసులు

• హన్మకొండ అదాలత్ కోర్టు వద్ద బండి సంజయ్ పై దాడి చేసేందుకు వరంగల్ బీఆర్ఎస్ నేతల పన్నాగం

• జాఫర్ ఘడ్ పీఎస్ , జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో భారీగా మోహరించిన బీఆర్ఎస్ నాయకులు..

• బీజేపీ నేతలెవరూ బయటకు రాకుండా ముందస్తుగానే హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు

• కోర్టుకు చేరుకునే సమయంలో బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు

• పోలీసుల డైరెక్షన్లోనే జరుగుతున్న హైడ్రామా

• వందలాది మంది పోలీసులు, పదుల సంఖ్యలో వాహనాలున్నప్పటికీ… బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకుంటున్నా చోద్యం చూస్తున్న పోలీసులు

• బండి సంజయ్ వాహనాన్ని పోలీసుల సమక్షంలో బీఆర్ఎస్ గూండాలు అడ్డుకుంటూ చెప్పులు విసిరే యత్నం చేసినా పట్టించుకోని పోలీసులు

• పోలీసులు, బీఆర్ఎస్ గూండాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న బీజేపీ నేతలు

• పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ గూండాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మండిపడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు

ఫ్లాష్….ఫ్లాష్

• పోలీసుల అక్రమ అరెస్ట్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

• ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు భోజనం చేసేందుకు కూడా నిరాకరించిన బండి సంజయ్

• బండి సంజయ్ ను హన్మకొండ కోర్టుకు తరలించేందుకు సిద్ధమైన పోలీసులు

• హన్మకొండ అదాలత్ కోర్టు వద్ద భారీగా మోహరించిన పోలీసులు
• హన్మకొండ అదాలత్ కోర్టు వద్ద బండి సంజయ్ పై దాడి చేసేందుకు వరంగల్ బీఆర్ఎస్ నేతల పన్నాగం

• జాఫర్ ఘడ్ పీఎస్ , జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో భారీగా మోహరించిన బీఆర్ఎస్ నాయకులు..

• బీజేపీ నేతలెవరూ బయటకు రాకుండా ముందస్తుగానే హౌజ్ అరెస్ట్ చేసిన పోలీసులు

• కోర్టుకు చేరుకునే సమయంలో బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు

• పోలీసుల డైరెక్షన్లోనే జరుగుతున్న హైడ్రామా

• వందలాది మంది పోలీసులు, పదుల సంఖ్యలో వాహనాలున్నప్పటికీ… బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకుంటున్నా చోద్యం చూస్తున్న పోలీసులు

• బండి సంజయ్ వాహనాన్ని పోలీసుల సమక్షంలో బీఆర్ఎస్ గూండాలు అడ్డుకుంటూ చెప్పులు విసిరే యత్నం చేసినా పట్టించుకోని పోలీసులు

• పోలీసులు, బీఆర్ఎస్ గూండాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న బీజేపీ నేతలు

• పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ గూండాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మండిపడుతున్న బీజేపీ రాష్ట్ర నాయకులు

ఫ్లాష్….ఫ్లాష్…

బీజేపీ రాష్ట్రీయ అధ్యక్షలు బండి సంజయ్ కుమార్ గారి అక్రమ అరెస్టు కు నిరసన తెలుపుతూ రాంగోపాల్ పేట్ డివిజన్ లో ముఖ్క మంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దహణం చేయడం జరిగింది. వెంటనే సంజయ్ గారిని విడదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి , NDMA మాజీ ఉపాదక్షులు మర్రి శశీధర్ రెడ్డి. ఈ కార్ర్యక్రమం కార్పరేటర్ చీర సుచిత్రా శ్రీకాంత గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. కేసీఆర్ డౌన్ డౌన్ నినాదాలతో మారు మోగింది. సీనియర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారూ.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ నాంపల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్న బీజేపీ కార్యర్తలు. బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ కార్యకర్తల నినాదాలు.

తీవ్ర ఉద్రిక్తతల మధ్య మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ ను మీర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అర్థరాత్రి అమానుషంగా అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు శ్రీరాములు. దీనిపై మండిపడిన బీజేపీ, బీజేవైఎం శ్రేణులు బడంగ్పేట్ రహదారిపై ఆందోళనకు దిగారు.

ఫ్లాష్…. ఫ్లాష్…

• రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను గ్రుహ నిర్బంధిస్తున్న పోలీసులు

• అన్ని జిల్లాల్లోనూ బీజేపీ నాయకులకు బయటకు రాకుండా హౌజ్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు

• రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోందంటూ బీజేపీ నేతల ఆగ్రహం

• ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించిన భువనగిరి డీసీపీ రాజేశ్ చంద్ర

• బండి సంజయ్ పై నేరారోపణలు ఉన్నందునే అదుపులోకి తీసుకున్నామన్న డీసీపీ

• ఆ నేరారోపణల వివరాలేంటని అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వని డీసీపీ

• కేసు ఫైల్ చేశాకే వివరాలు వెల్లడిస్తామన్న డీసీసీ

• పోలీసుల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు

• బండి సంజయ్ ను ఎందుకు అరెస్ట్ చేశారనే విషయంపై 10 గంటలు దాటినా ఎందుకు చెప్పడం లేదని మండిపాటు

ఫ్లాష్…ఫ్లాష్…

• బండి సంజయ్ అరెస్ట్ వివరాలు తెలుసుకునేందుకు బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వైపు వెళుతున్న బీజేపీ లీగల్ టీం ప్రతినిధులను స్టేషన్ కు 3 కి.మీల దూరంలోనే నిలిపివేసిన పోలీసులు

• పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ లీగల్ టీం నేత, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఆంటోనీ రెడ్డి

• కేసీఆర్ ప్రభుత్వం, పోలీసుల అమానుష చర్యలపై న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్న ఆంటోనీ రెడ్డి

——

ఫ్లాష్…ఫ్లాష్…

• పోలీసుల అష్ట దిగ్బంధంలో బొమ్మల రామారాం

• బొమ్మల రామారాం వైపు ఎవరూ వెళ్లకుండా బ్యారికెడ్లు పెట్టిన పోలీసులు

• బొమ్మల రామారం నలువైపులా పోలీసులను భారీగా మోహరించిన పోలీసులు

• ఆర్టీసీ బస్సులసహా ఏ ఒక్క వాహనాన్ని బొమ్మల రామారం వెళ్లనీయకుండా ఆపేస్తున్న పోలీసులు

• బొమ్మల రామారం గ్రామస్తుల వాహనాలను సైతం అడ్డుకుంటూ నిలిపివేస్తున్న పోలీసులు

• బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వైపు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారనే సమాచారాన్ని ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించిన పోలీసులు

• మీడియా వాహనాలను సైతం అనుమతించని పోలీసులు

• తమను ఎందుకు ఆపుతున్నారంటూ పోలీసులతో వాగ్వావాదానికి దిగుతున్న మీడియా ప్రతినిధులు, బొమ్మల రామారం వైపుగా వెళుతున్న ప్రయాణీకులు

ఫ్లాష్… ఫ్లాష్…

• బండి సంజయ్ అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా పరిగణించిన బీజేపీ.

• హైకోర్టు లో హెబియస్ కార్పస్ పిటిషన్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి

• ఈరోజు కోర్టుకు సెలవు దినం కావడంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసానికి వెళ్లి హేబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసిన బీజేపీ లీగల్ విభాగం నేతలు

• కాసేపట్లో హైకోర్టులో హౌజ్ మోషన్ దాఖలు చేయనున్న బీజేపీ లీగల్ టీం నేతలు

• హౌజ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు చీఫ్ జస్టిస్ కాసేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం

——-

ఫ్లాష్…ఫ్లాష్..

• బండి సంజయ్ అరెస్ట్ వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ పై పోలీసుల దాష్టీకం.

• రఘునందన్ ను చొక్కా పట్టి బలవంతంగా లాగి పోలీస్ వాహనం వద్దకు తీసుకెళ్లిన మఫ్టీలోనున్న పోలీసులు

• తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పాలన్న రఘునందన్

• పోలీసులు, రఘునందన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం

• మఫ్టీలో ఉంటూ మెడపై చేయి లాగుతూ దురుసుగా ప్రవర్తిస్తారా? అంటూ రఘునందన్ తీవ్ర ఆగ్రహం

• ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నట్లు చెబుతున్న పోలీసులు

• అరెస్ట్ ప్రొసీజర్ ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్న రఘునందన్

• బండి సంజయ్ అరెస్ట్ విషయంలో డీసీపీని కలిసేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపాటు

• మీడియాతో మాట్లాడాక తాను పూర్తిగా పోలీసులకు సహకరిస్తానంటూ చెబుతున్నా వినకుండా బలవంతంగా రఘునందన్ ను పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తున్న పోలీసులు

• తన వద్ద తుపాకీ ఉందని… మీ చేష్టల వల్ల మిస్ ఫైర్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నా వినకుండా రఘునందన్ ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి తరలించిన పోలీసులు

• మహిళా మోర్చా నేతలపైనా దురుసుగా వ్యవహరిస్తున్న పోలీసులు

• మహిళలని చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తారా? అంటూ మహిళా మోర్చా రాష్ట్ అధ్యక్షురాలు గీతామూర్తి ఆగ్రహం

• కేసీఆర్ డౌన్ డౌన్… పోలీస్ జులుం నశించాలంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలు

—————-

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ ఎప్పుడో అయ్యింది. నిన్న రాత్రి మళ్ళా అదే రుజువైంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని ఎటువంటి నోటీసు, వారెంటు లేకుండా పోలీసులతో అరెస్టు చేయించి, ప్రశ్నించిన ప్రతీసారీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించుకుంది.

టెర్రరిస్టులను, నక్సలైట్లను అరెస్టు చేసినట్టు ఒక పార్లమెంటు సభ్యుడిని, జాతీయ పార్టీ అయిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని ఎటువంటి కారణం చెప్పకుండా అరెస్టు చెయ్యడం అత్యంత హేయమైన చర్య. బహుశా ఇది తెలంగాణ పోలీసుల కోసం రాసిన కొత్త పీనల్ కోడ్ ఏమో అనిపిస్తుంది.

అసలు ఈ అరెస్టు ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్న.? టి.ఎస్.పి.ఎస్.సి. పరీక్ష ప్రశ్న పత్రాలు లీకైనప్పుడు ప్రశ్నించినందుకా? లేకపోతే నిన్న మొన్న పదో తరగతి బోర్డ్ పరీక్షల తెలుగు పేపర్, ఆ తర్వాతి రోజు హిందీ పేపర్ లేకైతే ప్రశ్నించినందుకా? వరుసగా ఒక్కొక్క పరీక్ష పేపర్ ప్రభుత్వ అసమర్థ, అన్యాయ, అక్రమ పాలనలో లీకైతుంటే ఆగమైతున్న విద్యార్థుల పక్షాన ప్రశ్నించి నిలిచినందుకా? లేకుంటే…నిన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సదివిన ఎం.ఎస్.సి. పొలిటికల్ సైన్స్ డిగ్రీ ని సూపెట్టమని అడిగినందుకా? అని….తెలంగాణ ప్రజలు అడుగుతున్నరు. వినాశకాలే విపరీత బుద్ధి అని నిరూపితమైందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

ఇప్పటికైనా నీ నియంత విధానాలను విడనాడి వెంటనే శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ నలుమూలల ప్రజల్లోకి వెళ్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్న అవినీతి పాలన మీద భారతీయ జనతా పార్టీ పోరాటం మరింత ఉదృతం చేస్తామని తెలుపుతున్నాం.

ఇట్లు

కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మాజీ ఎం.పి., చేవెళ్ల

ఫ్లాష్…ఫ్లాష్..

• బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల జులుం,

• బండి సంజయ్ అరెస్ట్ వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలిస్తున్న పోలీసులు

• మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష సహా పలువురు నేతలు బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

—–

లీకు కుట్రలో ఇరికించే యత్నం. కేటీఆర్ కు ఎవరైనా వాట్సప్ చేస్తే ఆయనను అరెస్ట్ చేస్తరా?

• టీవీ ఛానళ్లన్నీ టెన్త్ పేపర్ లీకుపై వార్తలు ప్రసారం చేశాయి. వాళ్లందరినీ అరెస్ట్ చేస్తారా?

• పరీక్ష మొదలయ్యాక పేపర్ బయటకు వస్తే అది మాల్ ప్రాక్టీస్ కిందకు వస్తుంది

• మాల్ ప్రాక్టీస్ కేసు విద్యార్థులకు, ఇన్విజిలేటర్లకు మాత్రమే వర్తిస్తుంది?

• బండి సంజయ్ ను ఎట్లా అరెస్ట్ చేస్తారు?

• తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా

• టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో రాజశేఖర్ బీజేపీ వాడంటూ దుష్ప్రచారం చేస్తే ఏమైంది?

• రాజశేఖర్ ఐటీశాఖ పరిధిలోని టీఎస్టీఎస్ శాఖ ఉద్యోగి, కేటీఆర్ మంత్రి పీఏకు సన్నిహితుడని తెలింది

• బీఆర్ఎస్ నేతలతో రాజశేఖర్ తో సన్నిహిత సంబంధాలున్నాయని విచారణలోనే తెలింది కదా

• టెన్త్ పేపర్ లీకేజీ విషయంలో జర్నలిస్ట్ ప్రశాంత్ విషయంలోనూ దిగజారి వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం

• టీఎస్పీఎస్సీ రాజ్యాంగ బద్ద సంస్థ తమకేం సంబంధం అని ప్రశ్నిస్తున్న కేటీఆర్… టెన్త్ పేపర్ తప్పిదాలపై ఏం జవాబు చెబుతారు?

• వినాశకాలే విపరీత బుద్ది… పాపం పండింది. ఇట్లాంటి చర్యలు దుర్మార్గం

• కేసీఆర్ సర్కార్ పతనం క్లైమాక్స్ కు చేరింది

టీఎస్పీఎస్పీ మాజీ సభ్యులు సీహెచ్ విఠల్, ఎస్పీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణిరుద్రమదేవి, జె.సంగప్ప, పోరెడ్డి కిశోర్ రెడ్డి

దీనికంటే ముందు బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా. బండి సంజయ్ అరెస్టు హేయమైన చర్య. ఏ కారణం లేకుండా… ఎలాంటి నోటీసు ఇవ్వకుండా… ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుని ఎలా అరెస్టు చేస్తారు? పేపర్ లీకేజీ విషయంలో బీఆర్ఎస్ బండారాన్ని బయట పెడతాడన్న భయంతోనే… బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ప్రగతి భవన్ డైరెక్షన్లో… మంత్రుల ఒత్తిడితోనే బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు. కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గరలోనే ఉంది.

టీఎస్పీఎస్సీ, టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే… బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు. ఈనెల 8న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన, పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న నేపథ్యంలోనే… ఎక్కడ బహిరంగసభ విజయవంతమై, తమకు నూకలు చెల్లుతాయోనన్న భయంతోనే… బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి బరితెగింపులకు పాల్పడుతోంది. బిజెపి బద్ద వ్యతిరేకి రాజ్దీప్ సర్దేశాయ్ కేసీఆర్ గురించి ఏమన్నారో… ప్రజలు అంతా గమనిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు తనను చైర్మన్ ను చేస్తే… దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలకు ఎలక్షన్ల ఖర్చు అంతా తానే భరిస్తానని కేసీఆర్ అన్నాడంటే… తెలంగాణ సొమ్ము ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడో ప్రజలారా ఆలోచించండి. మీ అవినీతి నుంచి, అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బండి సంజయ్ ని అరెస్టు చేశారు. బండి సంజయ్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా.

– ఎన్ వి సుభాష్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ ని అర్ధరాత్రి అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తూ అన్ని మండల జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం పైన కెసిఆర్ కుటుంబం పైన లీకేజీ ప్యాకేజీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకెల్లుతుండడం తో దాని పక్కదారి పట్టించడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేసి ఇప్పుడు కారణాలు వెతుకుతున్నారు

ఒకవైపు రాష్ట్రంలో జరుగుతున్న పరీక్ష పత్రాలు లీకేజీల అవుతుండడం మరోవైపు బీఆర్ఎస్ పేరుతో దేశవ్యాప్తంగా బిజెపి యేతర అన్ని రాజకీయ పార్టీలకు ఫైనాన్స్ అందిస్తామని తనను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోవాలని కేసీఆర్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబం దగ్గర లక్షల కోట్ల రూపాయల ప్రజా ప్రజాధనం దోపిడీ చేశారన్న భావన ప్రజల్లో కలుగుతుండడంతో దాన్ని పక్కదారి పట్టించాలానే దుర్మార్గపు ఆలోచనతోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ను అరెస్ట్ చేయడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ ను బేషరత్ గా విడుదల చేయాలి.

అర్ధరాత్రి తన ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన బండి సంజయ్. లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసిన బండి సంజయ్. బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా పరిగణించిన బీజేపీ జాతీయ నాయకత్వం. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నాయకత్వం పాలన చేతగాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేసింది. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్. బీఆర్ఎస్ మునిగిపోయే నావ… రాజకీయంగా బీఆర్ఎస్ సమాధి అయ్యేరోజులు దగ్గర పడ్డాయని వ్యాఖ్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X