BiG News: तेलंगाना में राशन कार्ड धारकों को पतला चावल के साथ-साथ… తెలంగాణలో సన్నబియ్యం

हैदराबाद: नागरिक आपूर्ति मंत्री उत्तम कुमार रेड्डी ने तेलंगाना के राशन कार्ड धारकों को खुशखबरी दी है। चुनाव के दौरान किए गए वादे के अनुसार, इस उगादी से सभी राशन कार्ड धारकों को चावल वितरित करने का निर्णय लिया गया। साथ ही मंत्री एक और खुशखबरी की घोषणा की गई। उत्तम कुमार रेड्डी ने विधानसभा में इस आशय को महत्वपूर्ण बयान दिया।

उत्तम कुमार रेड्डी ने घोषणा की कि अब से राशन की दुकानों में चावल के साथ-साथ आवश्यक वस्तुएं भी वितरित की जाएंगी। इससे तेलंगाना के सभी राशन कार्ड धारकों को लाभ मिलेगा। हालांकि, अब यह दिलचस्प हो गया है कि इन आवश्यक वस्तुओं के अंतर्गत कौन-कौन सी वस्तुएं वितरित की जाएंगी।

हालांकि, अब तक उपलब्ध कराए गए मोटे चावल का कार्ड धारक उपयोग नहीं कर रहे है और इस चावल बाहरी बाजार में बेच रहे है। इससे दलालों को इसका फायदा हो रहा है। यह देख सरकार ने पतला चावल उपलब्ध कराने का फैसला किया। इस सीमा तक, उगादी त्योहार से सभी राशन कार्ड धारकों को चावल वितरित किया जाएगा। प्रत्येक व्यक्ति को 6 किलो चावल दिया जाएगा।

इससे पहले मोटे चावल के साथ चीनी के साथ-साथ दाल, नमक, तेल के पैकेट, गेहूं (गेहूं का आटा), केरोसिन और साबुन भी सस्ते दामों पर उपलब्ध कराए जाते थे। अब यह देखना दिलचस्प हो गया है कि रेवंत रेड्डी सरकार क्या देने वाली है।

Also Read-

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యంతో పాటు…

హైదరాబాద్ : తెలంగాణ రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఈ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించగా పేద ప్రజలకు పండుగలాంటి మరో వార్త వినిపించారు. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

ఇకపై రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటుగానే నిత్యవసర సరుకులు కూడా పంపిణీ చేయనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని పేదవారందరికీ లబ్ధి చేకూరనుంది. అయితే ఈ నిత్యావసర సరుకుల కింద ఏఏ వస్తువులు పంపిణీ చేయనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే ఇప్పటివరకు ఇచ్చిన దొడ్డుబియ్యాన్ని ప్రజలు వాడుకోవట్లేదని వాటిని బయట మార్కెట్‌లో అమ్ముకుని సన్నబియ్యాన్ని కొనుక్కుంటున్నారని దాని వల్ల మధ్యలో ఉన్న దళారులు లబ్ది పొందుతున్నారని గ్రహించిన ప్రభుత్వం తామే ప్రజలకు నేరుగా సన్నబియ్యం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉగాది పండుగ నుంచి రేషన్ కార్డు దారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నారు.

ఇది రాష్ట్రంలో పేదలకు పండుగలాంటి వార్త కాగా తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనతో వారి సంతోషం రెట్టింపు కానుంది. అయితే గతంలో పంచదార, పప్పు, ఉప్పు, నూనె ప్యాకెట్, గోధుమలు (గోధుమ పిండి), కిరోసిన్‌తో పాటు సబ్బులు కూడా చౌకగా ఇచ్చేవారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X