కాంగ్రెస్, బీజేపీ నాయకులు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: మంత్రి హరీశ్ రావు

Hyderabad: రాష్ట్ర వైద్యారరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించారు. నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ భవన సముదాయాన్ని పరిశీలించారు. తర్వాత జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్ భవనంతో పాటు పార్టీ ఆఫీసును ప్రారంభించే నేపథ్యంలో మంత్రి జిల్లా అధికారులు స్థానిక నాయకులతో సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు పాల్గొనే బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. సభ జరిగేటప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇతర పార్టీ నేతలు ఉన్నారు.

జగిత్యాలలో మంత్రి హరీశ్ రావు పొలిటికల్ కామెంట్స్..

కాంగ్రెస్, బీజేపీ నాయకులు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇంత కాలం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎందుకు అభివృద్ధి చేయలేదు. ఎందుకు మెడికల్ కాలేజీలు పెట్టలేదు. టీఆర్ఎస్ పార్టీ వచ్చాక 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. కిషన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. జీఎస్టీ కింద తెలంగాణకు ఎనిమిదన్నర వేల కోట్లు ఇచ్చామంటున్నారు. కిషన్ రెడ్డి తెలిసి, తెలవక మట్లాడుతరు. అసలు జీఎస్టీ కింది మీరు ఇచ్చింది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రమే జీఎస్టీ సెస్సు కింద కేంద్రానికి ఇచ్చింది 30వేల కోట్లు ఇస్తే, కేంద్రం తెలంగాణకు ఇచ్చింది 8వేల కోట్లు.

పన్నుల వాటా పెంచాము. 42శాతం రాష్ట్రానికి ఇస్తామనడం ఆశ్చర్యకరం. చాలా సార్లు కిషన్ రెడ్డి ఇలాగే మాట్లాడారు. వాస్తవాలు చెబితే నాలుక కరుచుకున్నారు. జూటా మాటలు చెబుతున్నారు. మీరు ఇచ్చింది తక్కువ కోతలు పెట్టింది ఎక్కువ. నిజంగా ఇచ్చింది 29.6 శాతం మాత్రమే. 42 శాతం ఇస్తున్నామనే పేరిట అనేక పథకాలు రద్దు చేశారు. మోడల్స్ స్కూల్స్ రద్ద, బీఆర్జీఎఫ్ రద్దు చేశారు. పథకాలను రద్దు చేశారు. దీని వల్ల కొన్ని వేల కోట్లు తెలంగాణకు నష్టం కలిగింది. రాష్ట్రాలకు వాటా తగ్గించారు. కేంద్రానికి వచ్చిన ఆదాయాన్ని మీరు పంచుతున్న వాటా 29.6శాతం మాత్రమే. మీరు చెప్పింది 42శాతం అనేది జూటా మాటా. కిషన్ రెడ్డి నేను చాలెంజ్ చేస్తున్నా ఎక్కడికి రమ్మంటే అక్కడికి చర్చకు వస్తా.

రాష్ట్రాలకు డబ్బులు రాకుండా దొడ్డిదారిన డబ్బులు మళ్లిస్తున్నారు. రాష్ట్రాలు ఖర్చు పెట్టేది ఎక్కువ. కేంద్రం ఖర్చు పెట్టేది తక్కువ. రాష్ట్రం కిందనే అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. మోడీ సీఎంగా పని చేశారు కాబట్టి ఆయనకు తెలుసు అందుకే రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం పెంచారు అంటున్నారు. మీరు పెంచలేదు కదా దించారు. బండి సంజయ్ తలా తోక లేకుండా మాట్లాడుతారు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద నెలకు లక్ష కోట్ల అప్పు వేస్తున్నది. నెల తిరిగితే లక్ష కోట్ల అప్పు. ఈ 8 ఏళ్ల బీజేపీ పాలనలో కోటి కోట్ల అప్పు చేశారు. అప్పుల కుప్పగా దేశాన్ని మార్చింది మీరు. ప్రతి పౌరుడి మీద లక్షా 24వేల అప్పు చేసింది బీజేపీ ప్రభుత్వం.

ఎల్ఐసీ తెగనమ్మిర్రు, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మిర్రు, బిఎస్ఎన్ఎల్ కూడబెట్టిర్రు, ఉన్న ఉద్యోగాలు పోగొట్టారు. ఈరోజు తెలంగాణ ధాన్యాగారంగా మారింది. పంటలు అద్భుతంగా పండుతున్నాయి. ఇది అమాయకపు తెలంగాణ కాదు, ఉద్యమ తెలంగాణ. మీ గోబెల్స్ ప్రచారాన్ని ఎవరూ నమ్మరు. బీజేపీ నాయకుల యాత్రలు చూస్తుంటే, టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ల వద్ద లాస్టుకు ఉండే జనం అంత మంది కూడా ఉండటం లేదు. వారి పాదయాత్రలు వెలవెలబోతున్నాయి. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బిజేపీ పాల్పడుతున్నది. ఎన్నికలు వస్తే చాలు ఈడీలు, ఐటీలు రైడింగ్లు చేస్తుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే అక్కడ రైడ్లు చేస్తారు.

బిజేపీ పెట్టించే పార్టీలు ఉంటాయి, బిజేపీ వదిలిన బాణాలు ఉంటాయి. మీ ఉత్తర్ ప్రదేశ్లో, బిహార్ లోనో మీ బాణాలు పార్టీలు, కుట్రలు, ఐటీలు నడిచినయి కాని ఉద్యమాల గడ్డ మీద నడువవు. నాడు ఉద్యమ సమయంలో ఆంధ్రాపాలకులు ఎన్నో కేసులు పెట్టారు. చాలా సార్లు అరెస్టులు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించాం. ఈరోజు బిజేపీ కూడా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం వైపు నిలబడుతుంది. తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది. ఇక్కడి ప్రజల శ్రేయస్సు కోసం నిలబడుతాం. ఎక్కడా తలవంచం. గట్టి పోరాటం చేస్తాం.

మీకు రాజకీయం ముఖ్యం. మీకు అధికారం ముఖ్యం. మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం. అభివృద్ధి ముఖ్యం. మొన్న ఎంఎంఆర్ (మాతృ మరణాలు) లెక్కలు కేంద్రం విడుదల చేస్తే అందులో మీ డబుల్ ఇంజిన్ ఉత్తర్ ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే, మీరు ఒక్కటి కూడా ఇవ్వలేదు. మీరు ఇవ్వకపోయినా సీఎం కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి ప్రజలకు వైద్యం, విద్యను చేరువ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ పని చేస్తున్నది. మహారాష్ట్రాలోని రెండు, మూడు తాలుక సర్పంచులు వచ్చి మమ్మల్ని తెలంగాణలో కలుపుమని కోరుతున్నారు. బిజేపీ పాలిత సర్పంచులు వచ్చి ఐకే రెడ్డి గారికి వినతులు ఇచ్చారు.

తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి పక్క రాష్ట్రాలకు కనిపిస్తున్నది. మీకు మాత్రం కళ్లుండి కనబడనికబోదిళ్లా, వినబడి కూడా చెవులు లేనివారిలా మీరు మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి ఇవ్వనివి ఇచ్చినట్లు చెప్పకు. కేంద్రం రాష్ట్రానికి లక్షకోట్ల బకాయిలు పడ్డది.
42 శాతం ఇచ్చినం అన్నవు కదా, మీ ప్రకారమే లెక్కపెడితే 8 ఏళ్లలో 32 వేల కోట్లు రాష్ట్రానికి రావాలి అది తీసుకురా. స్థానికసంస్థలఅభివృద్ధికి 14 వఆర్థికసంఘంసిఫార్సుచేసిన 817.61 కోట్లు, స్టేట్సెక్టార్, సెక్టార్స్పెసిఫిక్గ్రాంట్కింద 15 వఆర్థికసంఘంసిఫార్సుచేసినమొత్తం 6,268 కోట్లు ఇంతవరకు విడుదలచేయలేదు అది తీసుకురా.. ఏపీపునర్విభజనచట్టంప్రకారం, రాష్ట్రానికిరావాల్సినప్రత్యేకసహాయగ్రాంట్ 1350 కోట్లువిడుదలకావాల్సిఉంది. అది తీసుకురా..

2022, 23 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం రుణాలపై అసంబద్ధమైన, గతంలోలేని నిబంధనలు విధించడం వల్ల తెలంగాణ రాష్ట్రంకోల్పోయిన మూలధన వ్యయం రూ. 15,033 కోట్లు. అది తీసుకురా. ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్బకాయిలు సుమారు రూ. 18వేలకోట్లు అది తీసుకురా..ఏపీఖాతాల్లో తప్పుగా బదిలీ చేసిన సీఎస్ఎస్ నిధులు రూ. 495 కోట్లను 8 ఏళ్లుపూర్తిఅయినా, నేటివరకుతెలంగాణకుతిరిగిఇవ్వలేదు. అది తీసుకురా. కేంద్రప్రభుత్వంప్రతిష్టాత్మకంగాఏర్పాటుచేసిననీతిఅయోగ్సిఫార్సులను కూడా కేంద్రం బుట్టదాఖలు చేసింది. మిషన్ భగీరథకురూ.19205 కోట్లు, మిషన్ కాకతీయకురూ. 5000 కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు నయా పైసా విడుదల చేయలేదు. అది తీసుకురా. ఇలా కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లను తీసుకు వచ్చి కిషన్ రెడ్డి మాట్లాడాలని హితవు పలుకుతున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X