Sports News: చెస్ ప్లేయర్ అరుష్ బత్తుల కు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు

హైదరాబాద్ : చదరంగం ఆటలో రాణిస్తున్న ఆరుష్ బత్తుల ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించి, ఆశీర్వదించారు.

हैदराबाद: पंचायत राज ग्रामीण विकास और ग्रामीण जल आपूर्ति राज्य मंत्री एर्राबेल्ली दयाकर राव ने शतरंज के खेल में उत्कृष्ट प्रदर्शन करने वाले आरुष बतूला को बधाई और आशीर्वाद दिया।

హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో ఆరుష్ మంత్రి ని కలిశారు. చిన్న వయసులోనే చదరంగం ఆటలో మంచి ప్రావీణ్యం కనబరచడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. మరింతగా రాణించి, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఆరుష్ ని మంత్రి KTRకి కలిపిస్తామని చెప్పారు.

కాగా ఆరుష్ ఇటీవల ఇండోనేషియాలో జరిగిన అండర్ 8 ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 5వ స్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియా ఫిడే (FIDE) రేటింగ్ టోర్నమెంట్‌లో అండర్ 9 విభాగంలో 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X