ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఈవెంట్స్‌ ముగిసింది, 1,11,209 మంది క్వాలిఫై

హైద‌రాబాద్ : తెలంగాణలో ఖాళీగా ఉన్న స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ (ఎస్ఐ), కానిస్టేబుల్ ఉద్యోగాల భ‌ర్తీకి నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా ప్రిలిమిన‌రీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన అభ్య‌ర్థుల‌కు గ‌తేడాది డిసెంబ‌ర్ 8న ప్రారంభ‌మైన ఫిజిక‌ల్ ఈవెంట్స్ నేటితో ముగిశాయి.

అయితే ఈవెంట్స్‌కు తెలంగాణ వ్యాప్తంగా 2,07,106 మంది అభ్య‌ర్థులు హాజ‌రు కాగా, 1,11,209 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. మొత్తంగా 53.70 శాతం మంది క్వాలిఫై అయ్యారు. 2018-19లో జ‌రిగిన రిక్రూట్‌మెంట్‌తో పోల్చితే, ఇప్పుడు అద‌నంగా 5.18 శాతం మంది అభ్య‌ర్థులు క్వాలిఫై అయిన‌ట్లు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.

ఇక మార్చి 12 నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ మెయిన్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9న సివిల్‌ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 23న అన్ని రకాల కానిస్టేబుల్‌ పోస్టులకు మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తారు.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది. హాల్‌టికెట్లను ఎప్పటినుంచి డౌన్‌లోడ్‌ చేసుకోచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X