హైదరాబాద్ : మేడ్చల్ దేవరయాంజాల్ టీపీసీసీ సెక్రెటరీ పీసరి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.

పాల్గొన్న డీసీసీ ప్రెసిడెంట్ హరిబాబు, మేడ్చల్ ఇంచార్జ్ తోటకూర జంగయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో కలిసి కైట్( పతంగి) ఎగరేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

బైక్పై వెళ్తున్నవ్యక్తి గొంతు కోసిన చైనా మాంజా
హైదరాబాద్: పతంగులు ఎగరేసే చైనా మాంజా చాలా ప్రమాదకరం. ఈ మాంజాను నిషేదించాలని పోలీసులు గొంతు అరిగిపోయాలా చెబుతున్నారు. కొన్ని నిమిషాల సంతోషం కోసం ప్రకృతికి, పక్షులకు, ఇతరులకు హాని చెయొద్దని మొత్తుకుంటున్నారు. మాంజా వల్ల ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు.

మన పండుగ సంతోషం.. ఇతరుల ఇండ్లలో విషాదం నింపొద్దని చెబుతున్నప్పటికీ.. కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రతిసారిలాగే.. ఈ సారి కూడా మాంజా దారం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు గాయాల పాలవుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటన ఒకటి సంగారెడ్డి జిల్లాలో జరిగింది. మాంజా దారం కోసుకపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ఇది కూడ చదవండి-
వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఖర్ధనూరు గ్రామం వద్ద వెంకటేష్ అనే వ్యక్తి బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న వెంకటేష్ మెడకు మాంజా కోసుకుపోయింది. మాంజా మెడను బలంగా తెంపడంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. గమనించిన స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేసి క్షతగాత్రుని పటాన్ చెరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడు వెంకటేష్ వికారాబాద్ వాసి కాగా.. పటాన్ చెరు నుండి శంకర్ పల్లికి వెళ్తుండగ ఈ ప్రమాదం జరిగింది. (ఏజెన్సీలు)