“జన్మించిన మతంలో పుట్టి వేరే మతంలోకి వెళ్లే వారిని దైవం క్షమించదు”

దేవుడికి అంతా సమానమే

అంటరానివాళ్లను గుడిలోకి రానియ్యడం లేదనేది పనిలేని వాళ్ల దుష్ప్రచారం

కులాలకు అతీతంగా పురోహితులను తయారు చేస్తున్న బర్థీపూర్ ఆశ్రమం అందరికీ ఆదర్శం

ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని భారత్ లో పుట్టడం మన అద్రుష్టం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు

బర్థీపూర్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలకు రూ.5 లక్షల విరాళాలు అందజేసిన బండి

చెప్పులు కుట్టేవాళ్లతోసహా వివిధ వ్రుత్తులతో సేవ చేస్తున్న వారిని సన్మానించిన సంజయ్

హైదరాబాద్ : ‘‘దేవుడికి అంతా సమానమేనని, అంటరానివాళ్లను గుడిలోకి రానియ్యడం లేదనేది పనిలేని వాళ్లు చేస్తున్న దుష్ప్రచారమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఎక్కడైనా అంటరాని పేరుతో ఎవరినైనా గుడిలోకి రానియ్యకపోతే… అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జన్మించిన మతంలో పుట్టి వేరే మతంలోకి వెళ్లే వారిని దైవం క్షమించదని పేర్కొన్నారు. కులాలకు అతీతంగా పురోహితులను తయారు చేస్తున్న బర్థీపూర్ ఆశ్రమం అందరికీ ఆదర్శమని చెప్పారు.

శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ శత జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని జహీరాబాద్ నియోజకవర్గంలోని బర్థీపూర్ ఆశ్రమంలో నిర్వహించిన శ్రీ డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ కు గురు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు బాబూమోహన్, చంద్రశేఖర్, సామాజిక సమరస్థ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• అప్పాల ప్రసాద్ నా గురువు. నేనీరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అప్పాల ప్రసాద్ వల్లే. మనకు తెలియని విషయాలు, భారత జాతి గొప్పతనం, సంస్క్రుతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని అద్బుతంగా తెలియజేశారు. ఈ విషయాలను మన కుటుంబ సభ్యులకు, బయట ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.

• భారత దేశం ఎన్నడూ చేయి చాచలేదు. ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియని దేశం. కోవిడ్ తో ప్రపంచమంతా వణికిపోయినా… చెక్కుచెదరకుండా యావత్ ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన దేశం భారత్. వ్యాక్సిన్ కనుగొనకపోతే ఇలా తిరిగేవాళ్లమే కాదు…

• ప్రపంచానికి ఆయుధాలను తయారు చేసి అందిస్తున్న దేశం భారత్. ఈ దేశంలో హిందువుగా పుట్టడం పూర్వ జన్మసుక్రుతం. ఈ ఆశ్రమానికి రాగానే వైబ్రేషన్స్ వస్తున్నాయి. దత్తగిరి మహారాజ్ 12 సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేసి సమాధి అయ్యారు.

• ఈ దేశంలో అర్చకుల కొరత ఏర్పడిందతి. చిక్కడపల్లిలో అర్చకులు బిచ్చమెత్తుకునే దుస్థితి ఏర్పడింది. కులాలతో సంబంధం లేకుండా అన్ని కులాల వారిని పురోహితులుగా తయారు చేసే ఆశ్రమం బర్థీపూర్ ఆశ్రమం.

• దేవుడి దగ్గర అందరూ సమానమే. ఏ కులం వారైనా దైవదర్శనం చేసుకోవచ్చు. కొందరు పనిలేని వాళ్లు మాత్రమే గుడిలోకి అంటరాని వాళ్లను రానియ్యడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా అలాంటివి జరిగితే గుణపాఠం చెప్పాల్సిన అవసరం మనపైన ఉంది.

• వ్రుద్దాశ్రమాలు లేని సమాజ నిర్మాణం కావాలి. కుటుంబ సభ్యులున్న తరువాత కూడా వ్రుద్దులు అనాథలుగా ఉండాల్సిన ఖర్మ ఉండకూడదు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోలేని వాళ్లు నా ద్రుష్టిలో మనుషులే కాదు..

• జన్మనిచ్చిన ధర్మాన్ని వీడితే ఏ దేవుడు సహించరు. హిందువుగా పుట్టి పరమతంలోకి వెళితే దేవుడు క్షమించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలాంటి సాధు సంతుల ఆశీస్సులతో భారతదేశ అభివ్రుద్ధికి పాటుపడదాం. సంస్క్రతి, సంప్రాదాయాలను కాపాడుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X