తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌, డిసెంబ‌ర్ 28 నుంచి ఖాతాల్లోకి రైతుబంధు నిధి

హైద‌రాబాద్ : కె చంద్రశేఖర్ రావు ప్ర‌భుత్వం రైతుల‌కు శుభ‌వార్త వినిపించింది. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం ఆదేశించారు. రైతు బంధు నిధులు, ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభమై సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకోసం గాను రూ. 7,600 కోట్ల‌ను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. పదో విడత రైతుబంధు నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

రైతుబంధు ముఖ్యాంశాలు…

రైతుబంధు దేశానికే ఆదర్శం

పదో విడతతో దాదాపు రూ.66 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాలలోకి

దేశంలో నేరుగా రైతుల ఖాతాలలో జమచేస్తున్న మొట్టమొదటి పథకం

అన్నం పెట్టే రైతు అప్పులపాలు కాకూడదు, రైతు యాచించే స్థితిలో కాదు శాసించే స్థాయిలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష

ఇప్పటివరకు 9 విడతలలో రూ.58 వేల కోట్లు రైతుల ఖాతాలలో జమచేశాం

రైతుబంధు, రైతుభీమా, సాగునీటి సదుపాయం, 24 గంటల ఉచిత కరంటుతో తెలంగాణ రైతులలో ఆత్మస్థయిర్యం పెరిగింది

వ్యవసాయరంగానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చేయూత దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు

60 శాతం మందికి ఉపాధి కల్పించే వ్యవసాయరంగానికి చేయూత ఇవ్వాలన్నదే కేసీఆర్ ఆలోచన

కేంద్రప్రభుత్వం సహకారం లేకున్నా తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేసీఆర్ విజయవంతంగా అమలుచేస్తున్నారు

పదోవిడత రైతుబంధులో 65 లక్షల మంది పైచిలుకు రైతుల ఖాతాలకు రూ.7600 కోట్లు

డిసెంబర్ 28 నుండి రోజుకు ఎకరా చొప్పున రైతుల ఖాతాలలో నిధులు జమ అవుతాయి

సంక్రాంతి లోపు అందరు రైతుల ఖాతాలలో నిధులు జమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X