హైదరాబాద్ : “వరంగల్ జిల్లాలో ఏ ఎమ్మెల్యేను తీసుకున్నా ఉద్యమంలో వీరి దగ్గర ఏమీ లేదు. కానీ ఇప్పుడు వేల కోట్లకు పరిగెత్తారు. కేసీఆర్ కు టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. ఇవన్నీ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లే. ఎంత కాలం వీరిని భరిద్దాం. దీనికి మందు లేదా” అని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా 12వరోజు వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.
అనంతరం హనుమకొండ అమృత జంక్షన్ వద్ద నిర్వహించిన జనసభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. పాదయాత్రలో ఎవరిని కలిసినా సంతోషంగా లేదు. అవకాశం రాగానే కేసీఆర్ ను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏనుమాముల మార్కెట్ దళారుల పాలు అయిందని రైతులు తమ గోడు వినిపించారు. బీఆరెస్ నేతలే కాదు… బీజేపీ నేతలు కూడా భూములు కబ్జా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నష్టం జరుగుతున్నా సోనియాగాంధీ గారు అమరుల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే వచ్చిందా? రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందల గడ్డగా మారింది. వరంగల్ ఏకశిల పార్కు తాగుబోతుల అడ్డాగా మారింది. కాళోజీ కళా క్షేత్రం మొండిగోడలతో నిలబడ్డది.
కేసీఆర్ కట్టిస్తామన్న డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వలేదు. తొమ్మిదేళ్లయినా అమరుల స్థూపం నిర్మాణం పూర్తికాలేదు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఇప్పటికీ పూర్తికాలేదు. కానీ 9 నెలలో ప్రగతి భవన్ పూర్తయింది. వాస్తు కోసం 9 నెలలో సచివాలయం నిర్మాణం పూర్తయింది. కేసీఆర్ హామీలు చెప్పుకుంటూ పోతే చాంతాడంత. కానీ ఏ ఒక్క హామీని నేరవేర్చలేదు. పార్టీ కోసం కష్టపడేవారికి చేయాల్సిన సమయంలో చేయాల్సినవన్నీ సోనియమ్మ చేస్తుంది. పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలను ఆదుకునే కార్యాచరణ మేం తీసుకుంటాం.
వరంగల్ ఈస్ట్, వెస్ట్ ఎమ్మెల్యేలు బిల్లా రంగా ల్లా ప్రజలను దోచుకుంటున్నారు. వరంగల్ పసునూరు దయాకర్ పసిపిల్లాడు గాడు అనుకుంటున్నారు. కానీ టైర్ల ఫ్యాక్టరీని మూసివేసి హంటర్ సెంటర్లో 6 ఎకరాల భూమిని కబ్జా చేసిండు. వరంగల్ జిల్లాలో ఏ ఎమ్మెల్యేను తీసుకున్నా ఉద్యమంలో వీరి దగ్గర ఏమీ లేదు. కానీ ఇప్పుడు వేల కోట్లకు పరిగెత్తారు. కేసీఆర్ కు టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. ఇవన్నీ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లే. ఎంత కాలం వీరిని భరిద్దాం. దీనికి మందులేదా.
ఎన్నికల్లో కేసీఆర్… దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, రైతుకు రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంది. వీటిల్లో ఏదైనా తీరిందా. బీఆరెస్ ఎమ్మెల్యేలంతా ఒక దండుపాళ్యం ముఠా. దండుపాళ్యం ముఠాకు హన్మకొండ సాక్షిగా హెచ్చరిక చేస్తున్నా. గోడ మీద రాసిపెట్టుకోండి. రోజులు లెక్కపెట్టుకోండి. డైరీలో ప్రతి ఒక్కటీ నోట్ చేసుకుంటున్నాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధించిన దండుపాళ్యం ముఠాకు ఇంతకింత మిత్తితో సహా చెల్లిస్తాం.
ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. అధికారులు నిబంధనలకు లోబడి పనిచేయాలి. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో చర్యలు తప్పవు. ప్రభుత్వ ఉద్యోగాలకు పీఆర్సీ, బోనస్ ఇచ్చింది మేము. రాజస్థాన్, చత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ప్రజల్లో మార్పు వచ్చింది. పాలకుల్లో మార్పు రావాలి. కాంగ్రెస్ నాయకులం అంతా కలిసే ఉన్నాం. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి పార్టీ కార్యకర్త పని చేయాలి.
కాజీపేట దర్గా సందర్శన
పాదయాత్రకు ముందు కాజీపేటలోని హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గాను దర్శించుకొని రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. చారిత్రక కాజీపేట దర్గాను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ దర్గాను దర్శించి ప్రభుత్వం తరపున గిలాఫ్ ఈ చదర్ సమర్పిస్తాం. ప్రతీ సంవత్సరం ఎమ్మెల్యేల అభివృద్ధి నిధుల్లో 25 శాతం మైనారిటీల అభివృద్ధికి కేటాయిస్తామన్నారు.
How Long will we endure KCR’s Rule: TPCC President Revanth Reddy during Yatra for Change Padayatra
Hyderabad : “No matter which MLA is considered in Warangal district, they have no properties during the Telangana movement. But now they run into thousands of crores. KCR got TVs, papers and properties worth thousands of crores. All this because Congress gave Telangana. How long should we bear them? There is no medicine for this,” said TPCC President Revanth Reddy. On the 12th day, Revanth Reddy held a padayatra in the Warangal West constituency as part of the Yatra for Change Padayatra.
Afterwards, Revanth Reddy addressed the public meeting held at Hanumakonda Amrita Junction. Nobody I met during the Yatra is happy. They are ready to oust KCR when the opportunity arises. Farmers voiced their grievances that the Enumamula market has become the abode of middlemen. The victims are expressing their grief that not only BRS leaders, but also BJP leaders are occupying the lands. Despite the political loss in Andhra Pradesh, Sonia Gandhi gave Telangana as per the wish of the martyrs. Did Telangana get statehood just for the KCR family? Suicides of farmers and unemployed have increased in the state. Telangana, won by a struggle, has become a mound of dead.
Warangal Ekashila Park has become a haven for drunkards. Kaloji Kala Kshetra has just bare walls. What happened to the double-bedroom houses that KCR promised to build? Journalists were not given houses and plots. Even after nine years, the construction of the martyrs’ memorial was not completed. The 125 feet Ambedkar statue is still incomplete. But Pragati Bhavan was completed in 9 months. Construction of vastu compliant Secretariat got completed in 9 months. KCR’s list of promises is endless. But not a single promise was fulfilled. Soniamma will do all the things that have to be done at the time for those who are struggling for the party. We will take measures to support the workers who carry the flag for the party. Warangal East and West MLAs are robbing the people just like Billa Ranga.
Warangal Pasunur Dayakar thinks he is a toddler. But he shut down the tire factory and occupied 6 acres of land in Hunter Centre. “No matter which MLA is considered in Warangal district, they have no properties during the Telangana movement. But now they run into thousands of crores. KCR got TVs, papers and properties worth thousands of crores. All this because Congress gave Telangana. How long should we bear them? There is no medicine for this,” said Revanth Reddy. In the elections, KCR gave a lot of promises like a Dalit Chief Minister, three acres of land for Dalits, loan waiver for farmers, free education from KG to PG. Have any of these promises been fulfilled? BRS MLAs are like Dandupalyam gang. I am warning this Dandupalyam gang from the centre of Hanmakonda. Write it on the wall. Count the days.
We are noting everything in the diary. We will pay the Dandupalyam gang who harassed our party leaders and activists with interest. Governments come and go. Officers should abide by the rules. Otherwise, we will take action against them in the Congress government. We have given PRC, and bonus for government employees. We brought back the old pension scheme in the states of Rajasthan, Chhattisgarh and Jharkhand. People have changed. There should be a change in the rulers. All Congress leaders are united. Congress party stands by the workers. Every party worker should work to make the Congress party win.
Visit to Kazipet Dargah
Before the padayatra, Revanth Reddy visited Hazrat Syed Shah Afzal Biyabani Dargah in Kazipet and offered special prayers. He said he was happy to visit the historical Kazipet Dargah. Some parties are trying to create a rift between castes and religions to spend political time. He said that it is everyone’s responsibility to defeat these conspiracies. Once the Congress comes to power in the state, we will again visit the Dargah and present Gilaf-e-Chadar on behalf of the government. Every year, 25 per cent of MLA’s development funds will be allocated for the development of minorities.