This Is Telangana- తెలంగాణలో కలపాలని తీర్మానాలు చేస్తున్నరు: CM KCR

హైదరాబాద్‌ : సాయంత్రం 4 గంట‌ల‌కు ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. సంక్షేమంలో తెలంగాణకు ఎవరూ పోటీ లేరని, సాటిరారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. జాతివర్గం, లింగబేధం లేకుండా అందరినీ కూడా కడుపులో పెట్టుకొని ఆదరిస్తూ ముందుకువెళ్తున్నామన్నారు. కేసీఆర్ మాట్లాతూ… “పాలమూరు హెడ్‌క్వార్టర్‌గా ఉన్న మహబూబ్‌నగర్‌లో అనేక మంచి కార్యక్రమాలు జరిగాయి. పాలమూరు, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం పారిశ్రామిక హబ్‌గా మారుతోంది. ఐటీ సెంటర్‌, 300 ఎకరాల్లో ఫుడ్‌ పార్క్‌, 2వేల ఎకరాల్లో అర్బన్‌ పార్క్‌, 9500కోట్లతో బ్యాటరీల ఫ్యాక్టరీ పాలమూరుకు రావడం చాలా సంతోషమైన విషయం. ఎన్నో రోజులు కావాలని కోరిన బైపాస్‌ రోడ్డు పూర్తయ్యింది. ఇంతకు ముందు ఇరుకైన రోడ్లుండేవి. ఇవాళ నాలుగులైన్ల రోడ్లు చాలా అందంగా కనిపిస్తుంది. కలెక్టరేట్‌కు మునుపు ఊరంతా తిరిగి రావాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు నిమిషం రెండు నిమిషాల టైమ్‌ పడుతుంది. ఈ కాలేజీ గ్రౌండ్‌లో ఇది వరకు సమావేశాలు పెట్టుకున్నాం. ఇక్కడ స్పోర్ట్స్‌ స్టేడియం కావాల్సిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అడిగారు. వెంటనే స్టేడియం, ఆడిటోరియాన్ని మంజూరు చేస్తాం” అని ప్రకటించారు.

“దళితబంధు, గొర్రెల పంపిణీ, చేనేత, గీత ఉన్నంతలో ఆదుకునే కార్యక్రమాలు తీసుకున్నాం. చెప్పిందే చెప్పి మాట్లాడడం కాదు. మంచినీటి, కరెంటు కొరత తీరింది. సాగునీటి కొరత సగం తీరింది. ప్రస్తుతం రాస్తాలో ఉన్నాం. దాన్ని కంప్లీట్‌ చేసుకుంటున్నాం. పేదల బాగోగులు చూసుకుంటున్నాం. పథకాలన్నీ కండ్ల ముందే అమలవుతున్నయ్‌. మీరందరు ఇండ్లకు వెళ్లిన తర్వాత చర్చించాలి. ఉద్యమం జరిగే సమయంలో తెలంగాణ వస్తే బ్రహ్మండంగా బాగుపడుతమని చెప్పినా.. అది కండ్ల ముందే జరుగుతుంది. మేలైన రైతులు, ఇబ్బంది లేకుండా ఎక్కడ ఉన్నరు అంటే తెలంగాణలో ఉన్నరు అని దేశం మాట్లాడుతుంది.”

“రైతుబంధు ఎవరైనా అనుకున్నారా? గతంలో పెద్దపెద్ద మాటలు నాయకులను చూశారు. కర్నాటకలోని రాయ్‌చూర్‌ ప్రజలు, సర్పంచులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మమ్మల్ని తెలంగాణలో కలపాలని అని చెబుతున్నారు. మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో కలపాలని మాట్లాడుతున్నరు. కేసీఆర్‌ కంటే మూడంతల దొడ్డు, నాలుగంతల ఎత్తున్న నేతలను చూశారు. ఆపద్బందు అని పెట్టి 50వేలు ఇస్తామని చెబితే.. ఆరు నెలలు తిరిగినా పదివేలు చేతికి రాని పరిస్థితి. ఇవాళ ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే రూ. 5లక్షలు వస్తున్నయ్‌. ఇవాళ అద్భుతంగా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసే పరిస్థితిని చూస్తున్నారు” అని సీఎం గుర్తు చేశారు.

“గీత కార్మికులకు 15శాతం బార్‌, వైన్స్‌ షాపుల్లో రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా ఇండియాలో. ఎవరినీ వదిలిపెట్టలేదు, చిన్నచూపు చూడలే. ఉన్నంతలో అందరికీ పథకాలు అమలు చేస్తున్నాం తెలంగాణ రాక ముందు మహబూబ్‌నగర్‌ జిల్లాలో మెడికల్‌ కాలేజీ వస్తుందని ఊహించామా? ఈ రోజుపాలమూరు నేను గర్వంగా ప్రకటిస్తున్నా.. ఐదు మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే మూడు ప్రారంభమయ్యాయి. నారాయణపేట, గద్వాలలో వచ్చే జూన్‌ నుంచి అడ్మిషన్లు తీసుకుంటాం. దళిత కుటుంబాలకు తరతరాలుగా నలిగిపోయారు కాబట్టి రూ.10లక్షలు ఇచ్చి మీ ఇష్టం వచ్చిన వ్యాపారం, పథకం పెట్టుకోవచ్చని చెప్పే పద్ధతి ఇండియాలో ఎప్పుడైనా చూశామా. చరిత్రలో ఎప్పుడూనా విన్నామా? మెడికల్‌, ఫెర్టిలైజర్‌, వైన్స్‌ దుకాణాలు, ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చే దుకాణాల్లో, లాభాసాటి వ్యాపారాల్లో,కాంట్రాక్టుల్లో దళితులకు రిజర్వేషన్లు ఇచ్చింది చూశామా?” అని సీఎం వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X