“ధరణి రద్దు కోసమే తొలి జీవో, రూ.500కే గ్యాస్ సిలిండర్”

హైదరాబాద్ : “కొత్త సంవత్సరంలో 2024, జనవరి 1న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ధరణి పోర్టల్ ను రద్దు చేస్తూ తొలి జీవో ఇస్తాం” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా 10వరోజు వర్ధన్నపేట నియోజకవర్గంలో 17కిలోమీటర్ల మేర రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వర్ధన్నపేట సెంటర్లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

గురువారం ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు. ఈ నెల 6న సమ్మక్క-సారలమ్మల ఆశ్వీరాదంతో, సీతక్క అండతో మొదలైన పాదయాత్ర మహబూబాబాద్, భద్రాచలం మీదుగా 100 కిలోమీటర్లు పూర్తి చేసుకొని వరంగల్ పార్లమెంట్ పరిధిలోని పాలకుర్తి నియోజకవర్గం చేరుకుంది. అటునుంచి ఇప్పుడు వర్ధన్నపేటకు వచ్చింది. ఐనవోలులో ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ పెరుమాండ్ల గ్రామానికి వచ్చాం. ఏడు నెలల నుంచి జీతాలు లేవని గ్రామపంచాయితీ కార్మికులు వాపోయారు. ఎవరిని కలిసిన ఏదో తెలియని బాధ. ప్రభుత్వం అన్యాయం చేసిందనే భావన. ఎవరికి డబుల్ బెడ్రమ్ ఇళ్లు రాలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు,

రైతులు పండించిన పంటలకు గిట్టు బాటు ధరలేదు, విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కాలేదు, రైతులకు రుణ మాఫీ కాలేదు, దళితులకు మూడు ఎకరాల భూమి రాలేదు. పెరుమాండ్ల గ్రామంలో ల్యాండ్ పూలింగును నిరసించిన దళితులపై పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగింపజేశారు. ఎమ్మెల్యే దళితుడే కానీ ఎన్నడు దళిత కాలనీలోకి రాలేదు. కమీషన్లు లేనిదే ఇక్కడి ఎమ్మెల్యే ఏ పని చేయడని చెబుతున్నారు. రాజకీయంగా నష్టపోయినా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. మోసపూరిత హామీలతో కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు. మనమందరం కులవృత్తులు చేసుకోవాలంటా.

కేసీఆర్, ఆయన కొడుకు మాత్రం రాజ్యం ఏలుతారంటా. కేసీఆర్ కుబుంబం కోసమా తెలంగాణ వచ్చిందా. నాలుగు కోట్ల మంది కోసం తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబంలో నలుగురు బతుకులు బాగుపడ్డాయి. తన భూముల ధరలు పెంచుకునేందుకే.. ఇక్కడి ఎమ్మెల్యే ల్యాండ్ పూలింగ్ లో పేదల భూములు లాక్కున్నారు. జేఏసీకి జెండాలు కట్టింది మనం. దొరగారికి దండాలు పెట్టింది మనం. రాష్ట్ర ఏర్పాటు అలస్యమైతే ప్రాణాలు తీసుకుంది మనం. కానీ వచ్చిన తెలంగాణ ఏవడి పాలైందో మీరే ఆలోచించండి. ఏ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇచ్చారో ఆ ఓట్లు కేసీఆర్ వేయించుకోవచ్చు.. రాని వారు కాంగ్రెస్ కు వేస్తారు. ఇంటికో ఉద్యోగం వచ్చిన వారి ఓట్లు బీఆరెస్ కు వేయించుకోండి… రానివారి ఓట్లు కాంగ్రెస్ అడుగుతుంది.

దళితబంధు వచ్చినవారు కేసీఆర్ కు ఓటు వేయించుకోండి.. దళితబంధు రాని వారిని కాంగ్రెస్ కు ఓటు వేయించుకుంటాం. దళితులకు మూడెకరాలు వస్తే వారు వస్తే టీఆర్ఎస్ కు ఓటేస్తారు రాని వారి ఓట్లు మేము వేయించుకుంటాం. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నయో గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతాం. డబుల్ బెడ్రూం ఉన్న గ్రామాల్లో అక్కడే బీఆరెస్ ఓట్లు అడగాలి. ఈ సవాల్ ను స్వీకరించేందుకు కేసీఆర్ సిద్ధమా? ఏ పార్టీకైనా జనం పదేళ్లు అవకాశం ఇచ్చారు. ఇక కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం వచ్చింది. ల్యాండ్, శాండ్, వైన్ మాఫియా అంతా బీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలోనే నడుస్తుంది. రేప్ లు, మర్డర్లు జరిగినా బీఆర్ఎస్ నాయకులే ఉంటున్నారు.

కేసీఆర్ నాయకత్వంలో ఈ బీఆర్ఎస్ దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుంటుంది. 2024, జనవరి1న కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ధరణి రద్దు చేసే జీవో ఇస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తాం. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి వారిని ఆదుకుంటాం. ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఒక్క ఏడాదిలోనే భర్తీ చేస్తాం. ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.

పేదలకు వైద్యం అందించేందుకు 2 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ మార్జిన్ ను 5లక్షలకు పెంచుతాం. పోయిన భూములు తిరిగి ఇస్తాం. ఇన్నీ మంచి పనులు చేయాలంటే వర్ధన్నపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయండి. రమేష్ తిరిగి వస్తే మీ భూములు పోతాయి. రాష్ట్రంలో రావుసాబ్ పోవాలి. టీఆర్ఎస్ పీడ పోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో అనాడు 2004లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితులే ఉన్నాయి. అనాడు వచ్చిన విధంగానే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తుంది. ఈ విషయంలో ఎవరికి అనుమానం అక్కర్లేదు.

కోమటిరెడ్డిపై దాడికి ఖండన

తుంగతుర్తి నియోజకవర్గంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల దాడిని ఖండిస్తున్నాం. అనాడు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మేము దాడులకు పాల్పడితే మీరు రోడ్ల మీద తిరిగేవారా. ఎవరైనా మా నాయకులపై దాడులు చేస్తే అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి సంగతి తెలుస్తాం. అన్ని రాసుకుంటున్నం. లెక్కకు లెక్క మిత్తికి మిత్తి చెల్లిస్తం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా రుణం తీర్చుకుంటా. నాయకులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.

అరూరి రమేష్ పై చార్జిషీట్ విడుదల చేసిన కాంగ్రెస్

ఉప్పర్ పల్లి లంచ్ పాయింట్ వద్ద కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, కోదండరెడ్డి, మల్లు రవి, సిరిసిల్ల రాజయ్య మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్ పై చార్జీషీటును విడుదల చేశారు.

వైఎస్ యాత్ర గుర్తొస్తోంది : మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

రేవంత్ రెడ్డి పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ఈ పాదయాత్ర చూస్తుంటే నాటి వైఎస్ యాత్ర గుర్తొస్తోంది. మోసపూరిత హామీలతో కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ లూఠీ అయింది. దొర గడీలో తెలంగాణ బందీ అయింది. పనికిరాదని తెలిసి కాళేశ్వరం కట్టి వేల కోట్లు దండుకున్నారు. రాష్ట్రంలోని భూములన్నీ కేసీఆర్ కుటుంబ సభ్యులు, ఆయన తాబేదార్లకు సొంతమవుతున్నాయి. బంగారు తెలంగాణ కాలేదు కానీ.. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయింది. రోజులు మారతాయి.. రాజకీయాలు మారతాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. బీఆరెస్ ను ఇంటికి పంపించే సత్తా కాంగ్రెస్ కె ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది.

ధరణితో లాభపడింది కేసీఆర్ కుటుంబమే: కోదండ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ నాయకులు

ధరణి పేరుతో కేసీఆర్ భూ రికార్డులను ప్రయివేటుకు అప్పగించారు. తెలంగాణలో కాంగ్రెస్ పంపిణీ చేసిన 24లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చారు. భూదాన బోర్డు రద్దు చేసి దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారు. ధరణితో లాభ పడింది కేసీఆర్ కుటుంబం, బీఆరెఎస్ నాయకులు మాత్రమే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సర్వే చేసి టైటిల్ గ్యారంటీ చట్టం అమలు చేస్తాం. 2013 చట్టం భూసేకరణ చట్టం ప్రకారం వరంగల్ రింగ్ రోడ్ బాధితులకు పరిహారం అందించాలి.

పర్సంటేజీల ఎమ్మెల్యే : సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎంపీ

వర్ధన్నపేట నియోజకవర్గంలో ఏ పని అయినా ఎమ్మెల్యే పర్సంటేజీల ఆశతో కాంట్రాక్టర్లతోనే చేయిస్తున్నారు. ఎమ్మెల్యేకు కావాల్సింది అభివృద్ధి కాదు.. పర్సంటేజీలు మాత్రమే. ఖాళీ జాగా కనిపిస్తే చాలు ఎమ్మెల్యే రమేష్ కబ్జాకు పాల్పడుతున్నారు.

రూ.500కే గ్యాస్ సిలిండర్ : మల్లు రవి, మాజీ ఎంపీ

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరంగల్ రైతు డిక్లరేషన్ ను అమలు చేస్తాం. పేదలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ప్రజలు బీఆరెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కసిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.

The first GO is for the abolition of Dharani-TPCC President Revanth Reddy

“In the new year on January 1, 2024 the Congress party will be in power. We will release our first GO cancelling the Dharani portal” said TPCC President Revanth Reddy. As part of the Hath Se Hath Jodo Yatra, on the 10th day, Revanth Reddy conducted a 17KM padayatra in Wardhannapet constituency. Later, Revanth Reddy spoke at the street corner meeting held at Wardhannapet Center. On Thursday, Revanth Reddy started the padayatra after visiting Shri Mallikarjuna Swamy. The padayatra which started on the 6th of this month with the blessings of Sammakka-Saralamma and with the support of Sitakka, passed through Mahabubabad and Bhadrachalam to complete 100 KM and reached Palakurti constituency under Warangal Parliament. From there it has now come to Wardhannapet.

Revanth Reddy said that they came to Perumandla village after meeting the people in Ainavolu and getting to know their problems. The Gram Panchayat workers complained that they have not received their salaries since seven months. There is unexplainable pain in whoever we meet. There is great despair that the government has done injustice. No one got double bedroom houses, no jobs for the unemployed, no remunerative price for crops grown by farmers, no fee reimbursement for students, no loan waiver for farmers, no three acres of land for Dalits. Dalits who protested against land pooling in Perumandla village were subjected to third degree by the police.

The MLA here is a Dalit but never came to a Dalit colony. It is said that the MLA here does not do any work without commissions. Congress gave Telangana even knowing that it will lose politically. KCR came to power twice with fraudulent promises. He criticised that KCR and his son will rule the kingdom but we should continue to perform traditional professions. Has Telangana come for the sake of the KCR family? Telangana was given for four crore people, but only four members in KCR’s family prospered. In order to increase the prices of his lands.. the MLA here grabbed the lands of the poor in land pooling.

Revanth Reddy recalled that we are the ones who put up the flags for JAC. We are the ones who saluted the dora. When the formation of the state was delaying, it was we who took our lives. But think for yourself what happened to Telangana now. KCR can get votes in constituencies where they have given double bedrooms. Others will vote for Congress. Get the votes of those who got a job per house from BRS… Congress will ask for the votes of those who didn’t. BRS can get votes of Dalits who got 3 acres land but who did not get will be asked to vote for Congress. Those who got Dalit Bandhu can vote for BRS but those who didn’t get it will vote for Congress. We will ask for votes in the villages where there are Indiramma houses. BRS votes should be asked in villages with double bedrooms. Is KCR ready to accept this challenge?

People have given a chance for ten years to any party. The time has come for the KCR government to end. Land, sand and wine mafia is all taking place under the leadership of BRS leaders. Despite rapes and murders, BRS leaders remain. This gang of BRS thieves under the leadership of KCR is looting the state. Congress party will be in power in the new year on January 1,2024. It will release GO to cancel Dharani.
Revanth Reddy said that they will provide financial assistance of Rs.5 lakh to every poor person who builds houses under the Congress government.

We will support the farmers by waiving their loans of Rs.2 lakhs. We will fill up 2 lakh vacant government jobs within one year. We will provide a gas cylinder for women for only Rs.500. We will increase the Arogyasri margin from 2 lakhs to 5 lakhs to provide medical care to the poor. We will give back the lost lands. To make all these good things possible, make Congress win and hoist the Congress flag on Vardhannapet soil. If Ramesh returns, your lands will be lost. Rao Saheb should go from the state. We should be relieved from TRS. Now the state is in the same situation as it was in 2004. Congress party will come to power even now as itcame then. No need to doubt this.

Condemnation of the attack on Komati Reddy

We condemn the attack by BRS leaders on Bhuvanagiri MP Komatireddy Venkat Reddy in Tungathurthi constituency. He said if we had attacked them during ten years when we were in power, would they have roamed on the roads? If someone attacks our leaders, we will teach them a lesson after coming to power. We are making a record of everything. We will give tit for tat. After coming to power, the Congress will repay your debt with interest. Leaders have nothing to fear. The Congress party will be with you.


Congress released chargesheet on Aruri Ramesh

Congress leaders Mahesh Kumar Goud, Kodanda Reddy, Mallu Ravi and Sirisilla Rajaiah spoke to the media at the Upparpally lunch point. On this occasion, the charge sheet was released on Wardhannapet MLA Ramesh.

Remembering YS Yatra : Mahesh Kumar Goud, TPCC Working President

Revanth Reddy’s Padayatra is going on successfully. Looking at this padayatra, one remembers the YS Yatra of yesteryear. KCR came to power in Telangana with fraudulent promises. Telangana has been looted during the last nine and a half years of KCR rule. Telangana has been held hostile in Dora’s Gadi. They built Kaleshwaram, spending thousands of crores even knowing it is a waste. All the lands in the state are owned by KCR’s family members and his followers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X