సీఎం కేసీఆర్ కు ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై బర్త్ డే విషెస్

हैदराबाद: तेलंगाना के सीएम केसीआर आज अपना 69वां जन्मदिन मना रहे हैं। राज्य के लिए संघर्ष के दौरान मृत्यु के कगार पहुंचकरआखिरकार एक अलग राज्य हासिल कर लिया। उसके बाद उन्होंने राज्य के मुख्यमंत्री के रूप में कार्यभार संभाला और अब देश के नेता बन गए हैं। केसीआर के जन्मदिन के अवसर पर, भारत राष्ट्र समिति के कार्यकर्ताओं ने राज्य भर में बड़े पैमाने पर समारोह आयोजित किए और कई सेवा कार्यक्रम आयोजित किए। साथ ही नेता, फिल्मी हस्तियां, खेल जगत और अन्य क्षेत्रों के कई प्रमुख लोग केसीआर को बधाई दे रहे हैं। इसी क्रम में प्रधानमंत्री नरेंद्र मोदी, राज्यपाल तमिलिसाई, जनसेना प्रमुख और अभिनेता पवन कल्याण ने ट्वीट कर सीएम केसीआर को जन्मदिन की बधाई दी हैं।

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు తన 69వ బర్త్ డేను జరుపుకుంటున్నారు. రాష్ట్ర సాధన సమయంలో చావు నోట్లో తలపెట్టిన ఉద్యమకారుడు చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. ఆ తరువాత రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు దేశ్ కీ నేతగా మారారు. ఇక కేసీఆర్ బర్త్ డే సందర్బంగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడంతో పలు సేవా కార్యక్రమాలు తలపెట్టారు.

అలాగే కేసీఆర్ కు పలువురు ప్రముఖ రాజకీయ, సినీ, క్రీడా సహా ఇతర రంగాలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై, జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్లు చేశారు.

ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అల్లోల‌

సీయం కేసీఆర్ జన్మదినం సందర్భంగా అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీయం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి మరింత కృషి చేసేలా దేవుడు శక్తి ప్రసాదించాలని మంత్రి ఆకాంక్షించారు.

సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని సాధించి, ఎంతో అభివృద్ధి చేయడంతో పాటు అనేక సంక్షేమ‌ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తన పాలనతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. తెలంగాణ తరహాలో దేశాభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు.

(ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X