కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, కన్నాడీలు నుంచి భారీ స్పందన

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి..

ఈ రోజు నాలుగు సభల్లో ప్రసంగించిన టీపీసీసీ అధ్యక్షులు..

కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించండి. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం..

బీజేపీ 40 శాతం కమీషన్ల సర్కార్..

మోడీ, షా వెంట గుజారాతీలు ఉన్నారు.. ఖర్గే వెంట కన్నడీలు ఉండాలి..

రేవంత్ ప్రసంగాలకు కన్నాడీలు నుంచి భారీ స్పందన

హైదరాబాద్ : గుజరాతీ లు నరేంద్ర మోడీ అమిత్ షాల వెంట ఉన్నారు, మరి మనం కర్ణాటక వాళ్లం మన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే వెంట ఉండాలి కదా.. ఏఐసీసీ జాతీయ అధ్యక్షులుగా మన పూర్వ హైదరాబాద్ కర్ణాటక బిడ్డ మల్లికార్జున్ ఖర్గే కు అవకాశం వచ్చింది, మనమంతా ఆయన వెంట ఉండి కర్ణాటకలో కాంగ్రెస్ కు 150 సీట్లు గెలిపించి ఘన విజయం సాధించి పెట్టాలని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ, కర్ణాటక ఎన్నికల స్టార్ కంపెయినర్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

మంగళ వారం నాడు ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, బాల్కి, బసవ కళ్యాణ్, హుంనాబాద్ నియోజక వర్గాలలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు సభలలో ఏఐసీసీ అధ్యక్షులు మలికార్జున్ ఖర్గే, ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబులు కూడా పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆత్మగౌరవంతో బతుకుతామని లేకపోతే ఇక్కడ బీజేపీ ఇంతకాలం 40 శాతం కమిషన్లు తీస్కొని పనులు చేసిందని కర్ణాటక వాళ్లు బయటకు వెళ్లి మాది కర్ణాటక అని చెపితే 40 శాతం కమిషన్లు తీసుకునే రాష్ట్రమా అని ఎద్దేవా చేస్తారని అందుకోసం నిజాయితీ గా పనిచేసే కాంగ్రెస్ పార్టీని గెలుపోయించాలని ప్రజలను కోరారు.

మల్లికార్జున్ ఖర్గే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులని ఆయన 9 సార్లు అసెంబ్లీకి 2 సార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారని ఆయన రాజకీయానుభవం అపారమైందని అలాంటి నాయకులు మన కర్ణాటక బిడ్డను గెలిపించి మన ఆత్మగౌరవాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X