CERI App आपका खोया हुआ फोन पंजीकरण करने पर पुलिस लाकर देगी घर पर
हैदराबाद: राजेंद्र नगर के डीसीपी जगदीश्वर रेड्डी ने कहा कि यदि आपका सेल फोन खो जाता है या चोरी हो जाता है, तो आप इसे CEIR ऐप में पंजीकृत कर सकते है। पुलिस इसे जब्त कर लेगी और सौंप देगी। गुरुवार को राजेंद्र नगर डीसीपी कार्यालय में 57 पीड़ितों को सेल फोन सौंपे गए।
इस मौके पर डीसीपी जगदीश्वर रेड्डी ने कहा कि केंद्र सरकार टेलीकॉम कंपनी के माध्यम से CEIR ऐप लेकर आई है और यह लोगों के लिए काफी उपयोगी है। उन्होंने कहा कि अगर मोबाइल फोन कहीं गिर जाता है या कोई उसे चुरा लेता है तो सीईआईआर ऐप में विवरण दर्ज करने पर संबंधित थाने की पुलिस उसे जब्त कर वापस सौंप देगी। डीसीपी ने बताया कि इस ऐप के जरिए अब तक पीड़ितों को सेलफोन सौंपे गए है।
హైదరాబాద్: మీ సెల్ ఫోన్ పోయినాలేదా దొంగిలించబడినా సి ఈ ఐ ఆర్ యాప్ లో నమోదు చేసుకుంటే పోలీసులు స్వాధీనం చేసుకొని అప్పగిస్తారని రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం రాజేంద్ర నగర్ డీసీపీ కార్యాలయంలో 57 మంది బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించారు.
ఈ సందర్భంగా డీసీపీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం టెలిక సంస్థ ద్వారా సి ఈ ఐ ఆర్ యాప్తీ సుకొచ్చిందని, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పారు. సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా లేదా ఎవరైనా దొంగిలించినా సి ఈ ఐ ఆర్ యాప్ లో వివరాలు నమోదు చేస్తే ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని తిరిగి అప్పగిస్తారని తెలిపారు. గతంలో ఈ యాప్ ద్వారా 200 మంది బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించామని డీసీపీ గుర్తు చేశారు.
అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 33, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులను పిలిపించి అప్పగించినట్లు డీసీపీ జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. గతంలో సెల్ ఫోన్లు పోతే తీవ్ర ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు ఎంతో సులువుగా ఉందని తెలిపారు. ప్రస్తుతం సెల్ ఫోన్లు పోతే ఎఫ్ఐఆర్ నమోదు, కోర్టు వ్యవహారాలు అలాంటివి ఏమీ లేవని, పోలీసులు బాధితులను పిలిపించి అప్పగిస్తున్నట్లు చెప్పారు.
ప్రజలు సీఐఈఆర్ యాప్ వినియోగిస్తే బాధితులతో పాటు పోలీసులకు ఎంతో సులభంగా ఉంటుందన్నారు. సి ఈ ఐ ఆర్ యాప్ పై విరివిగా ప్రచారం నిర్వహించి ప్రజలు వినియోగించేలా మీడియా చొరవ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్, అత్తాపూర్ ఇన్స్పెక్టర్లు నాగేంద్రబాబు, పులి యాదగిరి పలువురు ఎస్సైలు పోలీసు సిబ్బందిపాల్గొన్నారు. (ఏజెన్సీలు)