PRSI : పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ మహిళా విభాగం కన్వీనర్ గా డా. కె. అనిత

హైదరాబాద్ : పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) మహిళా విభాగం మొట్టమొదటి కన్వీనర్ గా సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్, బేగంపేట్, జర్నలిజం విభాగం అధిపతి డా. కలువోయ అనిత బాధ్యతలు స్వీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కనుల పండుగగా జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త అంజలి రజ్దాన్, భారత వాయు సేన పబ్లిక్ రిలేషన్స్ విభాగంలో పనిచేసిన గ్రూప్ కెప్టెన్ జీ జే రావు, పీఆర్ఎస్ఐ హైదరాబాద్ చాఫ్టర్ చైర్మన్ డా. ఎస్. రాము, కార్యదర్శి కె. యాదగిరి ల సమక్షంలో సంస్థ జాతీయ సెక్రటరీ జనరల్ యాన బాబ్జీ డా. అనిత చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్స్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యాభై ఏళ్లకు పైగావేదికగా ఉన్న పీఆర్ఎస్ఐ లో మహిళను ఏకతాటిపైకి తెచ్చేందుకు, వారి సమస్యల అధ్యయనానికి, వాటి పరిష్కారానికి మహిళా విభాగం ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం.

“వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటూ ఎదురీదాల్సి వస్తుంది. జీవన యానంలో ఒక్కో మహిళది ఒక్కో స్ఫూర్తిదాయకపైన గాధ. జర్నలిస్టుగా, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నప్పుడు అయిన పరిచయాలు, జర్నలిజం అధ్యాపకురాలిగా సాధించిన అనుభవం ఆధారంగా పీఆర్ ఇండస్ట్రీ లోని మహిళలను కూడగట్టి పలు రకాల ఉపయుక్త కార్యక్రమాలు రూపొందించి నిర్వహిస్తాను,” అని డా. అనిత చెప్పారు.

ఈ కార్యక్రమ ముఖ్యఅతిథి, విద్యారంగంలో 42 ఏళ్ళ అనుభవం గడించిన విద్యావేత్త అంజలీ రజ్దాన్ మాట్లాడుతూ… అసమానతలు లేని ప్రపంచం కోసం స్త్రీ పురుషులిద్దరూ ఉమ్మడిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. “అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎందుకు లేదు? కేవలం ఒక్క రోజును మాత్రమే మహిళల కోసం కేటాయించడమేమిటి? స్త్రీలకు, పురుషులకు అందరికీ అన్ని రోజులూ సమానమైనవే,” అని ఆమె అన్నారు.

ప్రతి సంస్ధ, వ్యక్తి మహిళలను సమదృష్టితో చూస్తామని ప్రతిన బూనాలని మరొక వక్త గ్రూప్ కెప్టెన్ జీజే రావు అన్నారు. అనాదిగా భారత దేశంలో మహిళలకు ఉన్న స్థానం పరమోన్నతమైనదని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పీఆర్ఎస్ఐ-హైదరాబాద్ సంయుక్త కార్యదర్శి అపర్ణ రాజ్ హన్స్ చెప్పారు.

మహిళా విభాగం ఏర్పడిన రోజు పీఆర్ఎస్ఐ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని పీఆర్ఎస్ఐ హైదరాబాద్ చాఫ్టర్ చైర్మన్ డా. ఎస్. రాము, కార్యదర్శి యాదగిరి చెప్పారు. ఈ వృత్తిలో పెద్ద సంఖ్యలో ఉన్న మహిళలను ఒకటిగా చేసి వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు, ప్రతిభావంతులను వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు మహిళా విభాగం నిరంతరం పని చేస్తుందనీ, ఐదుగురు ప్రతిభావంతులైన మహిళా సభ్యుల అర్హతలను, విజయాలను, అనుభవాలను పరిగణనలోకి తీసుకుని డా. అనితను ఎంపిక చేశామని వారు చెప్పారు.

పీఆర్ఎస్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అజిత్ పాఠక్ ఈ సందర్భంగా పంపిన సందేశాన్ని కోశాధికారి భుజంగరావు చదవగా, ఈసీ సభ్యురాలు సాజిదాఖాన్ వందన సమర్పణ చేశారు. పీఆర్ఎస్ఐ అమరావతి చాఫ్టర్ చైర్మన్ వీ ఎస్ ఆర్ నాయుడు, జాతీయ కమిటీ సభ్యులు, జర్నలిజం విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Dr K. Anitha takes charge as PRSI Women’s Wing Convenor

Hyderabad : Dr. K.Anitha, Head, Department of Mass Communication and Journalism at St. Francis College for Women, Begumpet, has assumed charge as the first convenor of the women’s wing of the Public Relations Society of India-Hyderabad chapter. Mr Y.Babji, PRSI Secretary General, administered the oath in the presence of the renowned educationist Mrs Anjali Razdan, Group Captain GJ Rao, the PRSI Hyderabad Chapter Chairman Dr S.Ramu and Secretary Mr K.Yadagiri at a glittering ceremony held at Sri Pottisriramulu Telugu University to mark the International Women’s Day.

The EC of the present governing body recognised the need for launching a women’s wing without further delay and selected Dr Anitha after scrutinising five contenders, according to a press release on Thursday.
A former journalist, communication specialist and award-winning educator, Dr Anitha said that she would use her industry connections and experience to strengthen the women’s wing. “Every woman has a story to tell about her personal and professional journey. PRSI-Hyd’s women’s wing will provide a platform for the women professionals working in the private, public and corporate sector in Telangana,” Dr Anitha said.

Mrs. Anjali Razdan, who put in 42 years of experience in academics, appreciated the PRSI leadership for having chosen the women’s day to launch the women’s wing. “I wonder why men don’t have International Men’s day. There shouldn’t be a special day for women. Every effort should be made to fill the gender gap by both the genders,” Razdan said. A former PR professional of the Indian Air Force, Group Captain GJ Rao said that every man should take a pledge to accord equal importance to women to ensure gender equality.

The PRSI Joint Secretary, Aparna Rajhans chaired the session that was co-chaired by the EC Member Dr Sajida Khan. The Chapter treasurer Bhujanga Rao read out the message sent by the national president Dr Ajit Pathak.

The Chapter chairman Dr S.Ramu said that it was a red-letter day in the history of the PRSI-Hyderabad. “As soon as I took charge as the chairman of the chapter, I sincerely felt the need of having an exclusive wing for women to chalk out programmes for women. It is unfair if we don’t have a women’s wing in a profession that is served by a good number of highly talented women professionals,” he maintained. The Chapter Secretary Mr. Yadagiri said that the selection of a highly qualified professional to lead the women’s wing is a successful first step to achieve the desired goals. The PRSI Amaravathi chapter Chairman CVR Naidu also spoke.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X