No Tension: ప్రజా సంగ్రామ యాత్ర-5 షెడ్యూల్, బహిరంగ సభ అనంతరం పాదయాత్ర ప్రారంభం

Hyderabad: సోమవారం మధ్యాహ్నం బైంసా పట్టణ శివారులోని గణేష్ ఇండస్ట్రీ సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్పాల్గొంటారు. రేపటి బహిరంగ సభలోబండి సంజయ్ కుమార్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభ అనంతరం పాదయాత్ర మొదలవుతుంది. రేపు మొత్తం 5.8 కి.మీల మేర పాదయాత్ర చేస్తారు. రేపు రాత్రి బైంసా శివారులో బస చేస్తారు.

మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 వరకు సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభ అనంతరం 2వ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నారు. అంతకుముందు నిర్వహించాలనుకున్న Y జంక్షన్ వద్ద యధావిధిగా నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు.

హైకోర్టు సూచనల మేరకు సభ, పాదయాత్రను రీషెడ్యూల్ చేసినట్లు బీజేపీ సీనియర్ నేత గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు. బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. హైకోర్టు సూచనల మేరకే పాదయాత్ర నిర్వహిస్తామని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని మహాపోచమ్మ దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X