BRAOU: తగ్గేదే లే అంటున్న ఐక్య కార్యాచరణ సమితి, విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న పెద్ద ఎత్తున నిరసనలు

భూ కేటాయింపు లేఖను ఉపసంహరించుకోవాలి

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ లేఖను ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

పది ఎకరాల స్థలం కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు లంచ్ అవర్ డెమోనిస్ట్రేషన్ లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసనను కొనసాగించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీయనుకోవాలని నినాదాలు చేశారు.

Also Read-

ఈ నిరసన కార్యక్రమంలో జేఎసీ కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి; డా. అవినాష్; డా. కిషోర్; డా. ప్రమీల కేతావత్; డా. పరాంకుశం వెంకటరమణ; డా. రవీంద్రనాథ్ సోలమన్; డా. యాకేష్ దైద; ఎన్సీ వేణు గోపాల్; జేఎసీ నేతలు అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు విశ్వవిద్యాలయంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మల్టీఫంక్షనల్ ల్యాబ్ (ఎస్టిఎంయల్) భవనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X