అంబేద్కర్ వర్శీటీలో కొనసాగుతున్న నిరసనలు
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలం జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి ఏమాత్రం సరి పోదని జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ పూర్వ విద్యార్ధి దేవకీ నందన్ పేర్కొన్నారు. అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు లంచ్ అవర్ డెమోనిస్ట్రేషన్ లో భాగంగా నాలుగో రోజు సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసనలో పాల్గొన్న జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ పూర్వ విద్యార్థులు ఆలోచన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీయనుకోవాలని నినాదాలు చేశారు.
Also Read-
ఈ కార్యక్రమంలో జేఎసీ కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబ్డే; అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.పుష్పా చక్రపాణి; డా. అవినాష్; డా. కిషోర్; జేఎసీ నేతలు అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు విశ్వవిద్యాలయంలోని అకాడమిక్ భవనం ముందు నిరసన తెలిపారు.