హైదరాబాద్ : డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొ. జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికిప్రఖ్యాత విద్యావేత్త ప్రొ. జి. రామ్ రెడ్డి సామాజిక శాస్త్రవేత్త అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తునున్నట్లు జి.ఆర్.సి&ఆర్.సి. డైరెక్టర్ ప్రొ.ఇ.సుధారాణి ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read-
ప్రొ. జి. రామ్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని అందించే ఈ అవార్డుకు, భారతదేశంలో ప్రధానంగా నిర్వహించిన సామాజిక శాస్త్ర పరిశోధనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సామాజిక శాస్త్రవేత్తలను గుర్తించి, వారు అందించిన విశిష్ట సేవలకు సత్కరించడం, పరిశోధనలో నాణ్యతను ప్రోత్సహించేలక్ష్యం తో ఈ అవార్డును అందించనున్నట్లు వివరించారు. ఇందులో ప్రజా విధానాలు, (Public Policy); స్థానిక పాలన (Local Governance); విద్య (Education) రంగాల్లో ఏదో ఒకదానిలో పరిశోధన చేస్తున్న సామాజిక శాస్త్రవేత్త అయి ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థి వయస్సు 50 సంవత్సరాలకు మించి ఉండకూడదు, యూజీసీ నిబంధనల ప్రకారం రెగ్యులర్ ఫ్యాకల్టీ సభ్యుడై ఉండాలని పేర్కొన్నారు.
Also Read-
అవార్డు కోసం గత ఐదు సంవత్సరాల్లో నిర్వహించిన అత్యుత్తమ పరిశోధనా కృషిని పరిగణనలోకి తీసుకుంటారని, నిర్దేశిత ప్రొఫార్మాలో నామినేషన్లను, అభ్యర్థి ఉత్తమ పరిశోధనా పత్రాల్లో ఏవైనా మూడు ప్రతులతో సమర్పించాలని సూచించారు. అవసరమైన పత్రాలతో ప్రొ. జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌కు సమర్పించాలన్నారు. నామినేషన్లను ఈ-మెయిల్ ద్వారా కూడా పంపవచ్చు director-grcrd@braou.ac.in అన్నారు. చివరి తేది అక్టోబర్ 10, 2026 లోపు పంపాలన్నారు.
