తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్, ప్రతీ బలిదానం కాంగ్రెస్ చేసిన హత్యే: MLC కవిత

ట్విట్టర్ లో కాంగ్రెస్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

హైదరాబాద్: తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు. దీక్షా దివస్ సందర్భంగా కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్ కు స్పందించి అనుచిత వాక్యానాలు కాంగ్రెస్ పార్టీపై ట్విట్టర్ వేదికగా ఆమె ఫైర్ అయ్యారు.

“రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారు. ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదు. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్ గారు,దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి,తెలంగాణ రాష్ట్రం తెచ్చారు.” అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం జరిగిన ప్రతి బలిదానం కాంగ్రెస్ పార్టీ చేసిన హత్యేనని తెలిపారు.

“సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానని నమ్మకం లేక కేరళ రాష్ట్రం వాయనాడ్ వెళ్లారు మీ నాయకుడు రాహుల్ గాంధీ.. ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో మీ పార్టీ పైనే ఎమ్మెల్సీ కి పోటీ చేసి గెలిచా.” అని కవిత స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X