దివ్యాంగులు దైవ స్వరూపులు : మంత్రి కొప్పుల

సీఎం కేసీఆర్ ఆలోచన విధానం దేశాన్ని కదిలిస్తుంది

సంక్షేమం లో ముందుకు తీసుకువెళ్లడంలో తెలంగాణ రాష్ట్రం ముందుంది – మంత్రి కొప్పుల

Hyderabad: దివ్యాంగులు దైవ స్వరూపులని ధైర్యం లో ధైర్యంలో గొప్పవారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు రోజులు జరుపుకునే ఆటల పోటీలను మంగళవారం హైదరాబాద్ ఎల్.బి. స్టేడియం లో మంత్రి కొప్పుల ఈశ్వర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి ప్రారంభించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… దివ్యంగుల సంక్షేమమే ప్రభుత్వ ఉద్దేశ్యం అని, వారిని అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళ్లడంలో తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమం కొనసాగుతుందని, తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత 60 కోట్ల బడ్జెట్ తో వికలాంగుల సంక్షేమం కొరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… విద్య ఉద్యోగ రంగాలలో ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఐదు శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని, దివ్యాంగులు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ క్రీడలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, పెన్షన్లు మూడువేల రూపాయలకు పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.

అధ్యక్షత వహించిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ… 24 కోట్ల రూపాయల పరికరాలను దివ్యాంగులకు అంద జేయడం జరిగిందని, ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమిస్తుందని, దేశంలో సంక్షేమనిధిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

దివ్యాగుల శాఖ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ… సుమారు 110 రకాల ఆటలు ఆడేందుకు జిల్లాల నుండి వికలాంగులు హైదరాబాదు నగరానికి వచ్చారని వారందరికీ రెండు రోజులు ఆనందభరితంగా క్రీడలను నిర్వహించడం జరుగుతుందని, 33 జిల్లాల వికలాంగులు తమ ప్రతిభను జిల్లాలలో ప్రదర్శించి ఇక్కడికి రావడం ఆనందదాయకంగా ఉందని కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించిన దక్షిణామూర్తి అన్నారు. ఈ ఆటల పోటీలలో విజేతలు నిర్వహించిన వారికి మంత్రులు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X