“ముంబైలో రోజుకు రెండు గంటలే మంచినీళ్లు హైదరాబాద్ లో 24 గంటల సరఫరా”

మహారాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ భాగస్వామ్యం అవుతుంది

తెలంగాణలో జరుగుతున్న పనులు మహారాష్ట్రలో ఎందుకు జరగలేదు ?

ముంబైలో కల్వకుంట్ల కవిత

हैदराबाद: बीआरएस एमएलसी कल्वकुंट्ला कविता ने घोषणा की है कि उनकी पार्टी महाराष्ट्र के विकास में अहम भागीदार होगी और यहां के लोगों के लिए काम करेगी। एमएलसी कविता मुंबई में मराठा योद्धा छत्रपति शिवाजी की मूर्ति को श्रद्धांजलि दी। इस कार्यक्रम में बड़ी संख्या में महाराष्ट्र बीआरएस नेताओं, कार्यकर्ताओं और स्थानीय लोगों ने भाग लिया। कार्यक्रम का मंच महाराष्ट्रीयन सांस्कृतिक संगीत और ढोल नगाड़ों से गूंज उठा।

హైదరాబాద్ : మహారాష్ట్ర అభివృద్ధిలో తమ పార్టీ కీలక భాగస్వామి అవుతుందని, ఇక్కడి ప్రజల కోసం తాము పని చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముంబయిలో, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహారాష్ట్ర సాంస్కృతిక సంగీతం, డోలు చప్పుడు తో కార్యక్రమ వేదిక మార్మోగింది.

తెలంగాణ జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ముఖ్యంగా పొరుగునే ఉన్న మహారాష్ట్రలో ఇంకా ఎక్కువ చర్చ నడుస్తుందని తెలిపారు. తెలంగాణతో దాదాపు 1000 కిలోమీటర్ల మేర మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటుందని, తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అక్కడ ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. తమ పార్టీని మహారాష్ట్రలో కూడా విస్తరించి తెలంగాణలో చేస్తున్న పనులను చేయాలని అక్కడి ప్రజల నుంచి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడి ప్రజలు అనేక విజ్ఞప్తులు చేశారని అన్నారు.

దేశంలో ఇప్పటివరకు విద్యుత్తు తాగునీరు సాగునీరు అందించడం వంటి కనీస సదుపాయాలను ఎవరు కల్పించలేదని, కానీ తెలంగాణలో మాత్రం 98 శాతం సదుపాయాల కల్పనను పూర్తి చేశామని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రమే ఇంత చేస్తే దేశవ్యాప్తంగా ఎందుకు చేయలేరని అన్నారు. ఈ ప్రజల ఎజెండానే ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీ విషయంపై పార్టీ ప్రకటన చేస్తుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహారాష్ట్ర ప్రగతిశీల అభివృద్ధి లో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం అవుతుందని ప్రకటన చేశారు. శివాజీ, అంబేడ్కర్ తో పాటు అనేక మంది మహానుభావుల స్ఫూర్తితో తాము ప్రజల కోసం పని చేస్తామని అన్నారు.

ముంబై పట్టణంలో రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే మంచినీరు సరఫరా అవుతుందని, హైదరాబాదులో మాత్రం 24 గంటల పాటు నల్ల ద్వారా ఇంటింటికి మంచినీరు అందుతుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం చేసినప్పుడు మహారాష్ట్రలో ఎందుకు చేయలేరని ప్రశ్నించారు.

ఈ పర్యటనలో శరత్ పవర్, ఉద్ధవ్ ఠాక్రే వంటి నాయకులను కలుస్తారా అని విలేకరులు అడగ్గా… శరత్ పవర్ తో కెసిఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఉద్యమానికి కూడా ఆయన ఎంతగానో తోడ్పడ్డారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X