हैदराबाद: मंत्री पोन्नम प्रभाकर ने टीजीएसआरटीसी कर्मचारियों से हड़ताल खत्म करने और ड्यूटी पर लौटने की अपील करते हुए कहा कि हड़ताल समस्या का हल नहीं है। मालूम हो कि टीजीएसआरटीसी कर्मचारी 22 अप्रैल की आधी रात से हड़ताल पर हैं। इस संदर्भ में मंत्री पोन्नम ने हड़ताल खत्म करने की अपील की। उन्होंने कर्मचारियों से टीजीएसआरटीसी की सुरक्षा और लोगों की भलाई के लिए हड़ताल खत्म करने का सुझाव दिया। उन्होंने कहा कि कर्मचारियों की समस्याओं को हल करने के लिए वरिष्ठ अधिकारियों वाली एक कमेटी बनाई गई है और कमेटी को चार हफ़्ते के अंदर रिपोर्ट देने का निर्देश दिया गया है।

मंत्री ने आगे कहा कि कमेटी के नाम पर समय बर्बाद करना ही है, कहना गलत है। कर्मचारियों द्वारा उठाए गए 32 मुद्दों में से 29 मुद्दे मानने के लिए योग्य है। सिर्फ आरटीसी का सरकार में विलय और मान्यता एसोसिएशन के चुनाव का मुद्दा ही बाकी है। उन्होंने बताया कि कर्मचारियों को हर महीने की पहली तारीख को वेतन दिया जा रहा है। उन्होंने कहा कि जब कांग्रेस सत्ता में आई, तो आरटीसी कर्मचारियों की समस्याओं को हल करने पर ध्यान दिया। जब हम सत्ता में आए, तो हमने पेंडिंग 2017 पीआरसी को क्लियर किया और लंबित डीए का भी भुगतान किया।

आपको बता दें कि तेलंगाना आरटीसी में हड़ताल आधी रात से आरंभ हो गया है। तेलंगाना सरकार और आरटीसी जेएसी नेताओं के साथ बातचीत फेल होने के बाद पूरे तेलंगाना में कर्मचारी हड़ताल पर चले गए हैं। हड़ताल के असर से पूरे राज्य में सड़कों पर बसें नहीं चल रही हैं। सभी जिलों में बसें डिपो तक ही सीमित हैं। इस वजह से यात्रियों को गंभीर दिक्कतों का सामना करना पड़ रहा है। वे बस स्टैंड के पास बसों के लिए लाइन में लग रहे हैं। सरकार ने दूसरे इंतज़ामों पर ध्यान दिया है ताकि यात्रियों को कोई दिक्कत न हो।
यह भी पढ़ें-
ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
హైదరాబాద్: సమస్యకు సమ్మె పరిష్కారం కాదని.. సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. 2026, ఏప్రిల్ 22 అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం సమ్మె విరమించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులతో కమిటీ వేశామని, 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామని తెలిపారు.
కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటని అన్నారు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలపై సానుకూలంగా ఉన్నాయని.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికల అంశం మాత్రమే పెండింగ్లో ఉందని చెప్పారు. ఉద్యోగులకు ప్రతి నెలా ఫస్ట్ తేదీనే జీతాలు చెల్లిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిందని తెలిపారు. అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశాం. డీఏలు పెండింగ్ లేకుండా చెల్లించాం.
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు విఫలం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. బుధవారం అర్థరాత్రి ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలైంది. సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు రోడ్డెక్కడం లేదు. అన్ని జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ల దగ్గర బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. (ఏజెన్సీలు)
