రైల్ నిలయం ముందు పింఛనుదారుల భారీ ధర్నా, పెన్షనర్ల సమస్యలపై గళ మెత్తిన నిరసనకారులు,

సికింద్రాబాద్: NCCPA మరియు FCPA పిలుపు మేరకు, ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడరేషన్ (AIRRF) ఆధ్వర్యంలో ఈ రోజు సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ముందు సుమారు 500 మందికి పైగా పింఛనుదారులు (పెన్షనర్లు) భారీ ధర్నా నిర్వహించారు. ​కేంద్ర ప్రభుత్వం పింఛనుదారుల పట్ల అవలంబిస్తున్న ఏకపక్ష నిర్ణయాలను, వైఖరిని నిరసిస్తూ ధర్నాలో పాల్గొన్నవారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

​ఈ ధర్నా కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ (ప్రెసిడెంట్), సోమయ్య (G-S NCCPA), రామచంద్రుడు, ఎస్.ఎస్.ఆర్. ప్రసాద్, ఎమ్.ఎన్. రెడ్డి, ప్రభాకర్ నాయర్, జె. గోపాల్ రెడ్డి, కె. దక్షిణామూర్తి, కె.ఎన్. స్వామి, శ్యామ్ సుందర్ రెడ్డి (CRPF), రాజశేఖర్ రెడ్డి, జి. రమేష్, కృష్ణమూర్తి, నరహరి, జలాలుద్దీన్, జ్ఞానప్రకాష్, నాగేశ్వరరావు మరియు కృష్ణమోహన్ తదితర నాయకులు పాల్గొని ప్రసంగించారు. పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read-

పింఛనుదారుల ముఖ్య డిమాండ్లు:

​Validation Act ను వెంటనే రద్దు చేయాలి.
​8వ వేతన సంఘం (8th Pay Commission) లో పెన్షన్ రివిజన్ కల్పించాలి.
​8వ పే కమిషన్ Terms of Reference ను సవరించాలి.
​”Past-Present Pensioners” వ్యత్యాస విధానాన్ని స్వస్తి పలకాలి.
​కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను, పెన్షనర్లపై జరుగుతున్న దాడిని నిరసిస్తున్నాం.
​NPS మరియు UPS విధానాలను రద్దు చేసి, అందరికీ పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి.
​50 శాతం కరువు భత్యాన్ని (DR) పెన్షన్ బేసిక్‌లో కలపాలి.
​01.01.2026 నుండి మధ్యంతర ఉపశమనం (Interim Relief) అందించాలి.
​పెన్షన్ కమ్యూటేషన్ కాలాన్ని తగ్గించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar