దావోస్‌లో తెలంగాణ ధమాకా, పెట్టుబడులకు కేరాఫ్‌గా మారిన తెలంగాణ

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో వచ్చిన పెట్టుబడులు. ఒక సంవత్సరంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులపై చర్చించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్దమా అని సవాలు చేస్తున్నాం. మహేశ్ కుమార్ గౌడ్
పెట్టుబడులు రావాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమని దావోస్‌ వేదికగా మరోసారి రుజువైంది. 

దావోస్‌లో తెలంగాణ పెవిలియన్‌ వద్ద పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున క్యూ కట్టడం హర్షించదగ్గ విషయం.

తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబు నేతృత్వంలోని తెలంగాణ బృందానికి ప్రత్యేక అభినందనలు.


ప్రసిద్ధ ఐటీ, ఎనర్జీ, సోలార్‌, ఏయిర్‌స్పేస్‌, మౌలిక సదుపాయల కల్పన, ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగానికి చెందిన కంపెనీలు దావోస్‌లో తెలంగాణ పెవిలియన్‌ వద్ద క్యూ కట్టి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం స్వాగతించాల్సిన అంశం.  

దావోస్‌ వేదికగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు రావడంతో రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌కు కూడా ‘భూం’ వచ్చే అవకాశాలున్నాయి.

దావోస్‌లో 16 సంస్థలతో రూ.1,64,050  కోట్ల ఒప్పందాలు కుదరడంతో, రాష్ట్రంలో యువతకు 50 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఏర్పడ్డాయి. 

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇంత భారీగా పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి. 

గతేడాది దావోస్‌లో తెలంగాణకు రూ.40,232 కోట్ల పెట్టుబడులు రాగా, ఈ సారి భారీ పెట్టుబడులు  రావడం సంతోషం.

దావోస్‌లో గతేడాది జరిగిన సమావేశంలో 14 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా 18 ప్రాజెక్టుల ఏర్పాటుకు కంపెనీలు ముందుకురాగా, వాటిలో 17 పనులు ప్రారంభమై  పురోగతిలో ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి ప్రాధాన్యతిస్తుండడంతో పాటు యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తుండడంతో పలు కంపెనీలు తెలంగాణపై ఆసక్తి చూపాయి. 

ప్రభుత్వం ముందు చూపుతూ రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం, నగరంలో మెట్రో విస్తరణకు అధిక ప్రాధన్యతివ్వడం కూడా తెలంగాణలో పెట్టుబడులకు కంపెనీలు ఆసక్తి చూపాయి. 

రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న ‘తెలంగాణ రైజింగ్‌ 2050 విజన్‌’ రాష్ట్రానికి గేమ్‌ ఛేంజర్‌గా మారింది.

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతోపాటు ఇటీవల ప్రకటించిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ పాలసీ ప్రపంచ పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించింది. 

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రూ.25,750 కోట్ల పెట్టుబడులు రాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లలో రూ.2 లక్షలకుపైగా పెట్టుబడులు రావడం విశేషం.

అమేజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ రూ.60 కోట్ల పెట్టుబడులతో ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్‌, క్లౌడ్‌ సర్వీసెస్‌ అండ్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. సన్‌ పెట్రోల్‌ కెమికల్స్‌ రూ.45,500 కోట్లు పెట్టుబడులు పెడుతుండడంతో 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఏజ్‌లిటి కంపెనీ రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇన్పోసిస్‌ రూ.750 కోట్లు పెట్టుబడులతో 17 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. విప్రో కంపెనీ పెట్టుబడులతో మరో 5000 మందికి ఉపాధి రానుంది. హెచ్‌సీఎల్‌ టెక్‌ సెంటర్‌ కూడా తెలంగాణలో పెట్టుబడులపై ఆసక్తి చూపింది. ఇలా చెప్పుకుంటూ పోతే పలు ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడుల కోసం ముందుకు రావడం కాంగ్రెస్‌ ప్రభుత్వం సాధించిన విజయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X