BRS: 14న ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల, MP జోగినపల్లి (Photos)

ఈనెల 14న ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్

న్యూ ఢిల్లీ: ఈ నెల 14న దేశ రాజధాని ఢిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించి యాగం నిర్వహించనున్న నేపథ్యంలో… ప్రారంభోత్సవం, యాగం కోసం చేపట్టవలసిన ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమారు ఆదివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనం లో చేపట్టవలసిన మరమ్మత్తులు, కార్యాలయ ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ తో కలిసి పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X