భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్ నాథ్ మాట్లాడాతూ…

• వక్ఫ్ ప్రాపర్టీ అమెండ్ మెంట్ బిల్లు-2024 ని తెలంగాణ వక్ఫ్ బోర్డు తిరస్కరించడం ముందునుంచి ఊహించిన విషయమే.
• అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఎంఐఎం నాయకుల కనుసన్నల్లో నడిచే తెలంగాణ వక్ఫ్ బోర్డు తిరస్కరించకుంటే ఆశ్చర్యపోవాలి కాని తిరస్కరిస్తే పెద్ద ఆశ్చర్యమేమీ లేదు.
• దేశంలోనే రైల్వేలు, రక్షణ రంగం తర్వాత మూడవ అతిపెద్ద భూ యాజమాన్య సంస్థగా ఉన్న వక్ఫ్ బోర్డు అతికొద్ది ఛాందసవాద ముస్లింల చేతుల్లో ఉండటం, వాళ్లు దాన్ని ఒక మాఫియా లాగా రన్ చేయడం ఎంతవరకు సమంజసం..?
• పేద, సామాన్య ముస్లింల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అమెండ్ మెంట్ బిల్లును తిరస్కరించడంతో తెలంగాణ వక్ఫ్ బోర్డు ఎంఐఎం కనుసన్నల్లోనే నడుస్తున్నదనడానికి ఒక నిదర్శనం.
• జస్టిస్ రాజేందర్ సచ్చార్ కమిటీ 2006లో వక్ఫ్ ఆస్తుల గురించి ఒక అంచనా వేసి దాదాపు సంవత్సరానికి రూ. 12 వేల కోట్లు ఆదాయం రావాలని గుర్తించారు. కాని కనీసం 200 కోట్ల రూపాయల ఆదాయం కూడా మించుతలేదు.
• తెలంగాణలో 77 వేల ఎకరాల వక్ఫ్ ల్యాండ్ ఉంటే.. అందులో 80 శాతం ఎంఐఎం గూండాలు, ఓవైసీ బ్రదర్స్ లాంటివాళ్లు ఆక్రమించుకున్నవే.
• ఈ 77 వేల ఎకరాల్లో ఒక గజం కూడా పేద ముస్లింలకు ఉపయోగపడే పరిస్థితిలో లేదు. ఎందుకంటే.. ఎప్పుడైతే ప్రభుత్వ సంస్థలు సీబీ సీఐడీ కావొచ్చు.. గవర్నమెంట్ ఆడిటర్ (సీఏజీ) ఎవర్నీ ఇన్వాల్వ్ చేయకుండా ఉండటమంటే వాళ్లు ఒక మాఫియాలాగానే ఈ సంస్థను నడపాలని కోరుకుంటున్నరు.
• ఇప్పటివరకు వక్ఫ్ ట్రిబ్యునళ్లలో ఉన్న కేసుల్లో 90 శాతం మంది బాధితులు ముస్లిం కుటుంబాలే.
• సమీనా సయ్యద్ అనే వృద్ధ మహిళకు సంబంధించిన రూ. 100 కోట్ల విలువైన ప్రాపర్టీని ఎంఐఎం గూండాలు కబ్జా పెడితే.. ఆమె క్యాన్సర్ తో చనిపోయిన తర్వాత కూడా ఆ భూమి గురించి ఎవ్వరు మాట్లాడలేదు. ఒక్క సియాసత్ పత్రికలో మాత్రమే వచ్చింది.
• మజిద్-ఇ-ఆలంగిర్ కు సంబంధించిన హైటెక్ సిటీలోని మాదాపూర్ లో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీని ఎంఐఎం నాయకులు కబ్జాపెట్టి బిల్డింగు కట్టింది.
• ఎంఐఎం లీడర్ షేక్ నిజాం, అతని కొడుకు ఇద్దరు మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో వక్ఫ్ ల్యాండ్ కబ్జా చేసిన్రని చీటింగ్, ఫోర్జరీ లాంటి కేసులు నమోదయ్యాయి.
• ఇట్ల.. అనేక నేరాలు చేసుకుంటూ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక వక్ఫ్ భూములను ఎంఐఎం గూండాలు ఆక్రమించిన్రు.
• ఒక్క వక్ఫ్ భూములే కాదు.. చెరువులు, నాలాలను కూడా ఆక్రమించడంలో ఎంఐఎం పార్టీ, ఓవైసీ బ్రదర్స్ ఎక్స్ పర్ట్స్.
• తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఓవైసీ బ్రదర్స్ దే రాజ్యం.
• బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది.. ఇప్పుడు అభయహస్తం అని చెప్పుకునే భస్మాసుర హస్తమైన కాంగ్రెస్ హస్తం కూడా ఎంఐఎం చేతిలో ఉన్నట్లుగానే కనపడుతున్నది.
• ఎందుకంటే… ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. గత 20 సంవత్సరాలుగా ఓవైసీ బ్రదర్స్ నయా నిజాం లాగా హైదరాబాద్ పై ఆధిపత్యం చెలాయిస్తున్నరు.
• కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం ఎజెండాతో ముందుకు నడుస్తున్నది. నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి నేటి రేవంత్ ప్రభుత్వం దాకా ఎంఐఎం చెప్పుచేతల్లోనే నడుస్తున్నది.
• తెలంగాణ వక్ఫ్ బోర్డు భూ కబ్జాదారులు, రాజకీయ మాఫియా, ఓవైసీ బ్రదర్స్ తో పాటు కొంతమంది ప్రభావవంతమైన అధికారులు తెలంగాణలో సంపన్నమైన వక్ఫ్ బోర్డు కార్యకలాపాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
• వక్ఫ్ బోర్డు వెనుక ‘రాజకీయ మాఫియా’ ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేకచోట్ల పెద్దఎత్తున శ్మశాన వాటికలు, చెరువులు, నాలాలు, హిందూ ఆలయాలు, ప్రైవేటు వ్యక్తుల భూములు ఆక్రమణకు గురయ్యాయి.
• కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సియామి ట్విన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం చెప్పుచేతల్లో నడుస్తోంది.
• నాలాలను, చెరువులను కబ్జాచేయడంతో పాటు, పేద ముస్లింలకు ఉపయోగపడాల్సిన వక్ఫ్ భూములను కూడా కబ్జాచేసి ఎంఐఎం గూండాలు కోట్ల రూపాయలు గడిస్తున్నరు.
• ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి, దమ్ము ధైర్యం ఉంటే.. హైడ్రా కొరడా ముందుగా ఎంఐఎం బినామీ ఆస్తులపై జులిపించాలి.
• సల్కం చెరువును ఆక్రమించి ఫాతిమా ఓవైసీ కాలేజీని ఎట్ల నిర్మించారో మనందరికి కనపడుతున్నది.
• ఇలా అనేక ఆస్తులు నాలాలను, చెరువులను, కబ్జాపెట్టి బినామీ పేర్లమీద ఓవైసీ బ్రదర్స్, ఎంఐఎం గూండాలు అనుభవిస్తున్నరు.
• సీఎం రేవంత్ రెడ్డి గారికైనా,.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికైనా… ఓవైసీ ఆక్రమణలు, కబ్జాలు మీకు కనపడ్తలేవా..?
• రంగనాథ్ గారికి చిత్తశుద్ధి ఉంటే… ఓవైసీ బ్రదర్స్ ఆక్రమించుకున్న ఫాతిమా కాలేజ్ ను ఎప్పుడు కూలుస్తారో చెప్పాలని బిజెపి డిమాండ్ చేస్తున్నది.
• ఒక్క నాలాలు, చెరువులేకాదు… పేద ముస్లింలకు ఉపయోగపడాల్సిన వక్ఫ్ భూములు కూడా ఎంఐఎం నాయకులు కబ్జాలు చేసిన్రు.
• వక్ఫ్ బోర్డు అమెండ్ మెంట్ బిల్లు-2024 ని తెలంగాణ వక్ఫ్ బోర్డు తిరస్కరించడం అనేది పూర్తిగా ఎంఐఎం పార్టీ రాజకీయ చర్యే.
• అసలు ఈ నిర్ణయం పేద, సామాన్య ముస్లింల బాగు కోసం తీసుకున్నది కాదు. కేవలం, ఈ ఎంఐఎం, వక్ఫ్ బోర్డు మాఫియా చెప్పుచేతల్లోనే వక్ఫ్ ఆస్తులు ఉంచుకోవడానికి చేస్తున్న చర్యే.
• ఈరోజు జమ్ము కశ్మీర్ వక్ఫ్ బోర్డు హెడ్ డాక్టర్ సయ్యద్ అంద్రాబి గారు ఈ అమెండ్ మెంట్ బిల్లును స్వాగతించారు. అట్లాగే నిజంగా పేద ముస్లింల సంక్షేమాన్ని కోరే ముస్లిం పెద్దలందరు కూడా ఈ బిల్లును స్వాగతిస్తున్నరు.
• అయినా కూడా ముస్లిం సమాజానికి నా రిక్వెస్ట్ ఏంటంటే… పేద ముస్లింల బాగుకోరే ముస్లిం మేధావులు కావొచ్చు.. జర్నలిస్టులు కావొచ్చు.. పెద్దలెవ్వరైనా వక్ఫ్ బోర్డు అమెండ్ మెంట్ బిల్లును సామాన్య ముస్లింలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని కోరుకుంటున్నాను.
Bail for Kavitha – BRS support for Congress Rajya Sabha candidate and merger linked?
“People will certainly ask – Yeh Rishta Kya Kehlata hai, after Kavitha getting bail today with generous help of “Experienced Congress lawyers” and KCR supporting Congress in Rajya Sabha elections. This is a blatant “quid pro quo “ out in open. The question is, will KCR do Shatang dandavat in front of “ Sonia Amma” and merge his defeated and deflated BRS into CONGRESS, for good ? Said N V Subhash, BJP Spokeperson while speaking to the media at in Hyderabad, Telangana.

“Those who have accused BJP of aligning with BRS can now open their eyes wide open and see , what is happening in the Telangana politics and ask CM Revanth Reddy Government on why till now various scams investigations haven’t happened. If this is not decieveing people’s mandate, then what it is? said N V Subhash
N V Subhash
BJP State Spokeperson & Media Incharge Telangana
Also Read-
హైదరాబాద్: బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతు…

మిస్ యూనివర్స్ పోటీల్లో బీసీల లెక్కలు తీస్తున్న రాహుల్ గాంధీ దిగజారుడుతనానికి, దివాలాకోరుతనానికి పరాకాష్ట అని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డా. కోవా లక్ష్మణ్ విమర్శించారు. కులగణన జరగాలని అంటోన్న రాహుల్ గాంధీ బీసీల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. సమాజాన్ని విడదీయాలనే ఏకైక ఎజెండాతో కుల, మత, ప్రాంతం, భాష పేరుతో కుట్రలు చేస్తున్నారని, బీసీలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత 70 ఏండ్లలో జమ్ము కశ్మీర్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేకపోయిందని ప్రశ్నించారు. నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ వేర్పాటువాదానికి వంత పాడుతోందని, ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ఇవాళ బిజెపి హైదరాబాద్ సెంట్రల్ కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటులో ప్రిన్సిపల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు పట్టుమని పదిమంది లేరంటూ రాహుల్ నిందలు వేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పాలనలో రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేసి, బీసీలను ఐఏఎస్ ఆఫీసర్లుగా నియమించినట్లయితే, ఇప్పుడు పార్లమెంటులో ప్రిన్సిపల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతులు సాధించేవారు. మరి ఎందుకు అమలు చేయలేదు..? ఒక సామాన్యమైన, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దేశానికి మూడోసారి ప్రధానమంత్రి కావడం రాహుల్ గాంధీ ఓర్వలేక సహించలేకపోతున్నారు. ప్రధానమంత్రి వేసుకునే వస్త్రాలపైనా, తినే ఆహారంపైనా దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశం తమ సొత్తని, నెహ్రూ పరివారమే దేశాన్ని పాలించాలనే దృక్పథంతో వ్యవహరిస్తున్నారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపగలిగేలా నరేంద్ర మోదీ గారు చాణక్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచంలో నేడు వివిధ అగ్ర దేశాలు సైతం భారతదేశం వైపు చూస్తున్నాయి. కానీ, మోదీని, భారతదేశాన్ని బలహీనపర్చాలనే దురుద్దేశంతో అంతర్జాతీయ సంస్థలు కుట్రలు చేస్తున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ మూడుసార్లు ఓడిపోయింది. 100 సీట్లు కూడా గెలవని కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటోంది. ప్రజాస్వామ్యంలో ఇది విచిత్రమైన పరిస్థితి. వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తీసుకొస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. అటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో దేశ ప్రజలు గమనించాలి.
ఈ సందర్భంగా డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడిన మరిన్ని ముఖ్యాంశాలు:
భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం క్రియాశీలక పాత్ర పోషిస్తున్న బిజెపి ఓబీసీ మోర్చా సభ్యులందరికీ అభినందనలు.
మొన్న ఢిల్లీలో ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది.
భారతీయ జనతా పార్టీకి ఓబీసీ మోర్చా ఒక వెన్నుముకగా నిలుస్తోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడంలో ఓబీసీ మోర్చా ప్రధాన భూమికను పోషించింది.
అలాగే, భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బాధ్యతాయుతంగా తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు ఒక్కో జిల్లాలో పది మండలాల చొప్పున ఆఫీస్ బేరర్స్ పర్యటించి, కార్యక్రమంలో భాగస్వామ్యం వహించాలి.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో బీసీలను మోసం చేస్తున్న తీరును తిప్పికొట్టి, బుద్ధి చెప్పేలా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమించాలి.
నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్రప్రభుత్వం పదేళ్లుగా బీసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం, బీసీ విద్యార్థుల చదువులు, ఉద్యోగాల నిమిత్తం సముచిత స్థానం కల్పించి, కేంద్ర విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకుంది.
బీసీలను విస్మరించి, బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న చరిత్ర కాంగ్రెస్ ది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మొదలు నేటివరకు ఆ పార్టీది ఇదే తీరు.
సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల కోసం రిజర్వేషన్లు కల్పించేలా స్థాపించబడిన కాకా కాలేల్కర్, మండల్ కమిషన్ల సిఫార్సులను నెహ్రూ నుంచి మొదలు రాజీవ్ గాంధీ వరకు విభేదించి, వ్యతిరేకించారు.
దేశంలో ఓబీసీలు రెండో శ్రేణి ప్రజలుగా తయారవుతారు. తద్వారా దేశం బలహీనపడుతుంది. అందుకే, కులాల పేరుతో రిజర్వేషన్లు ఇవ్వకూడదని 1952లోనే ప్రధాని నెహ్రూ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
కేవలం ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఇవ్వాలి కాని, కులాల పేరు మీద రిజర్వేషన్లు ఇవ్వడం భావ్యం కాదని చెప్పిన వ్యక్తి నెహ్రూ గారు. బీసీలకు రిజర్వేషన్లను తిరస్కరించిన చరిత్ర కాంగ్రెస్ ది.
మండల్ కమిషన్ సిఫార్సులను వీపీ సింగ్, జనతా దళ్ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడితే రాజీవ్ గాంధీ గారు అడ్డంగా విభేదించారు.
నాడు కులాల పేరుతో దేశాన్ని విభజించాలనుకుంటున్నారంటూ బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి రాజీవ్ గాంధీ.
నేడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులు బీసీల పట్ల ఎనలేని ప్రేమ కురిపిస్తూ మొసలికన్నీరు కారుస్తున్నారు.
సమాజాన్ని విడదాయలనే ఏకైక ఎజెండాతో కుల, మత, ప్రాంతం, భాష పేరుతో కుట్రలు చేస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపి ప్రత్యేక దక్షిణ దేశంగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ డీకే సురేష్ అంటూ విభజన విషం కక్కారు.
ప్రధానమంత్రి వేసుకునే వస్త్రాలపైనా, తీసుకునే ఆహారంపైనా విమర్శలు చేసి దిగజారుడుగా వ్యవహరించారు.
నరేంద్ర మోదీ సుపరిపాలనలో భారతదేశంలో అన్ని రంగాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతోంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపగలిగేలా నరేంద్ర మోదీ గారు చాణక్యాన్ని ప్రదర్శించారు.
ప్రపంచంలో నేడు వివిధ అగ్ర దేశాలు సైతం భారతదేశం వైపు చూస్తున్నాయి.
కాని, మోదీని బలహీనపర్చి, భారతదేశాన్ని బలహీనపర్చాలనే దురుద్దేశంతో అంతర్జాతీయ సంస్థలు కుట్రలు చేస్తున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ అంతర్జాతీయ శక్తులు బిజెపి కి వ్యతిరేకంగా అనేక కుట్రలు పన్నాయి.
ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది నరేంద్ర మోదీ ప్రభుత్వమే.
గత 70 ఏండ్లలో జమ్ము కశ్మీర్ లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేకపోయింది..?
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల పట్ల వ్యవహరించిన తీరు బాధాకరం.
కామారెడ్డి డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి తాము అధికారంలో వస్తే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు.. మరి అమలు ఏది..?
బీసీ జనాభాకు అనుగుణంగా సీట్ల రిజర్వేషన్లు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదు..?
కాంగ్రెస్ కుఠిల రాజకీయాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.
బీసీలను నమ్మించి మోసం చేయడమే కాంగ్రెస్ నైజం.
పార్లమెంటులో బీసీలకు చట్టబద్ధత కల్పించే బిల్లును అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ.
కేంద్ర ప్రభుత్వంలో 27 మంది బీసీలను మంత్రులుగా చేసిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అడ్మిషన్లలో బీసీ అభ్యర్థులకు 27 శాతం నీట్ పీజీ రిజర్వేషన్ సదుపాయం కల్పించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం.
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రూ.20,050 కోట్లు కేటాయించి, మత్స్యకారులు, మత్స్య కార్మికులు, చేపల వ్యాపారులు, మత్స్య రంగానికి సంబంధించిన ఇతర వ్యక్తులు లబ్ధిపొందేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ప్రపంచంలో అతిపెద్ద స్కీం పీఎం విశ్వకర్మ యోజనతో 18 రకాల కులవృత్తుల వారికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి.
తెలంగాణలో 52 వేల మంది పూర్తిగా అర్హత పొంది పీఎం విశ్వకర్మ యోజనకు నమోదు చేసుకుని, ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనే బీసీల సమగ్ర అభివృద్ధి, అభున్నతి జరుగుతోంది. బీసీలను మోసగిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం బీసీలను రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేలా ఉద్యమించాలి.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప మాట్లాడిన ముఖ్యంశాలు:

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎట్లుందంటే… వారు బురదలో దొర్లుతూ ఇతరుల మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ మంజూరు అయితే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం..?
గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అబద్దపు ప్రచారాలతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
కాంగ్రెస్ పార్టీ నాయకుల అబద్దపు ప్రచారాలు, మోసపు మాటలు ఎక్కువ కాలం చెల్లవు.
సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే అధికార పార్టీ మేనేజ్ చేయడం సాధ్యమా.. అలాంటి మాటలు మాట్లాడేముందు రాజ్యాంగం చదువుకోండి.
రాజ్యాంగ పుస్తకాన్ని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబులో పెట్టుకొని తిరగడం కాదు..ఆ బుక్ చదవితే దాంట్లో ఏముందో తెలుస్తది.
సుప్రీంకోర్టు అధికారాలు, ఇతర రాజ్యాంగ అధికారాలు చదివి తెలుసుకున్న తర్వాత మాట్లాడండి.
రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టును, రాష్ట్రపతిని, న్యాయమూర్తులను అవమానించడమే కాంగ్రెస్ పార్టీ నైజo.
ఆప్ పార్టీకి చెందిన మనీష్ సుసోడియాకు బెయిల్ వస్తే ఆపార్టీ బీజేపీతో కలిసినట్టా..??
కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు కదా.
ఇకనైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశంలోని రాజ్యాంగ విలువలకు గౌరవం ఇవ్వండి.
భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టుని అవమానించేలా మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకోవాలి.
ఎమ్మెల్సీ కవిత గారికి బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులే అని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.
తెలంగాణ నుండి రాజ్యసభకు పంపించిన అభిషేక్ సింఘ్వీ ఎవరు… ఈ విషయంలో కేసీఆర్ గారు ఎందుకు స్పందించలేదు..?
తెలంగాణ బిడ్డ కేశవ రావు గారు రాజ్యసభ ఎంపీకి రాజీనామా చేస్తే ఆ పోస్టు ఇంకొక తెలంగాణ బిడ్డకు ఎందుకివ్వలేదు..?
కేసీఆర్ గారికి అభిషేక్ సింఘ్వీతో అవసరం ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల దోస్తీతోనే కవితకు బెయిల్ వచ్చింది.
కేసీఆర్ మద్దుతుతోనే అభిషేక్ సింఘ్వీ రాజ్యసభ ఎంపీ అయ్యారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కపట నాటకం బయటపడింది.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్దపు ప్రచారాలు మానుకోండి.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసి కుట్రలతో అధికారంలోకి వచ్చింది.
పార్లమెంటు ఎన్నికల సమయంలో బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ రిజర్వేషన్లు ఎత్తివేస్తారంటూ విష ప్రచారం చేసి లబ్ధి పొందారు.
కవిత కి బెయిల్ రావడంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు.
సర్వోన్నత న్యాయస్థానo కవితకు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ విషయాన్ని బీజేపీ పైన రుద్దే ప్రయత్నం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నా.
ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల శంకర్ మీడియాకు విడుదల చేసిన ప్రకటన.

కేటీఆర్…చదువుకున్న అజ్ఝాని.
సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ను బండి సంజయ్ వ్యతిరేకించలేదు?
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేననే విషయాన్ని బండి సంజయ్ బహిర్గతం చేశారు.
కవితకు బెయిల్ కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నించింది నిజం కాదా?
కవిత బెయిల్ కోసం వాదించిన వ్యక్తికి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధిగా నిలబెట్టింది.
రాజ్యసభ అభ్యర్ధిగా బీఆర్ఎస్ పార్టీ నామినేషన్ ఎందుకు వేయలేదు?
కాంగ్రెస్, బీఆర్ఎస్ ‘క్విడ్ ప్రో కో’ రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
స్వయం ప్రకటిత మేధావి మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు మెదడు ఉండే మాట్లాడుతున్నారా?
బండి సంజయ్ ట్వీట్ చేసిన దాంట్లో తప్పేముంది?
బిజెపి ఒబిసి మోర్చా తెలంగాణ కార్యవర్గ సమావేశం అధ్యక్షులు గంధ మల్ల ఆనంద గౌడ్ అధ్యక్షతన బిజెపి కార్యాలయం బర్కతపుర హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు రాష్ట్ర ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శులు నందనం దివాకర్ వెన్న ఈశ్వరప్ప ఉపాధ్యక్షులు సంజయ్ ఘనాతే ,చీర శ్రీకాంత్ గోంగూలా మహేష్ రమేష్ జిల్ల అధ్యక్షులు జిల్లా ఇంచార్జులు సహా ఇంచార్జులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజాసింగ్ మీడియాకు విడుదల చేసిన ప్రకటన.

కేటీఆర్ చదువుకున్న మూర్ఖుడు.
బండి సంజయ్ చేసిన ట్వీట్ లో తప్పేముంది?
కవిత కు బెయిల్ ఇవ్వాలని వాదించిన వ్యక్తికి కాంగ్రెస్ రాజ్యసభ టిక్కెట్ ఇచ్చింది నిజం కాదా?
38 మంది ఎమ్మెల్యేలున్నా రాజ్యసభకు బీఆర్ఎస్ పార్టీ తరపున ఎందుకు నామినేషన్ వేయలేదు?
కేకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తే ఆ సీటును కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యక్తికి ఎందుకివ్వలేదు?
కాంగ్రెస్ అభ్యర్ధిత్వం ఏకగ్రీవమయ్యేందుకే బీఆర్ఎస్ తరపున అభ్యర్ధిని నిలబెట్టలేదన్నది నిజం కాదా?
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేననడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కావడం తథ్యం.