हैदराबाद: तेलंगाना में गुरुवार को झमाझम बारिश हुई। शहरवासियों को चिलचिलाती धूप से थोड़ी राहत मिली है। हैदराबाद शहर में शुक्रवार को भी भारी बारिश की संभावना है। मौसम विभाग ने कहा गया है कि 20 मार्च तक शहर में बारिश जारी रहेगी। इसके अलावा भारत मौसम विज्ञान विभाग ने ऑरेंज अलर्ट जारी किया। नलगोंडा में जिले में एक युवक और 40 बकरियों की मौत हो गई।
हैदराबाद के छह जोन- चारमीनार, खैरताबाद, कुकटपल्ली, एलबीनगर, सिकंदराबाद, सेरिलिंगमपल्ली में बादल छाए रहेंगे और मौसम ठंडा रहेगा। मौसम विभाग ने कहा है कि गुरुवार रात को हैदराबाद शहर की सीमा में बारिश की संभावना है। न्यूनतम तापमान 36 डिग्री रिकॉर्ड किया जाएगा। संगारेड्डी कस्बे की सभी सड़कों पर पानी भर गया। बारिश का पानी निचले इलाकों में घुसने से स्थानीय लोगों को परेशानी का सामना करना पड़ रहा है।

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు, ఎల్లో అలెర్ట్ జారీ
హైదరాబాద్ : తెలంగాణలో ఇవాళ వర్షాలు పడ్డాయి. నగర వాసులకు మండుతున్న ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. ఎందుకంటే, గురువారం, శుక్రవారాల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మార్చి 20 తేదీ వరకు కూడా నగరంలో వర్షం కురుస్తుందని తెలిపింది. అంతేగాక, మార్చి 16, 17 తేదీల్లో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎందుకంటే, గురువారం, శుక్రవారాల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లోని ఆరు జోన్లు హైదరాబాద్- ఛార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో మేఘావృతమై వాతావరణం చల్లగా ఉండనుంది. హైదరాబాద్ నగర పరిధిలో గురువారం సాయంత్రం లేదా రాత్రి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 36 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. సంగారెడ్డి పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఉత్తర – దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు కురుస్తున్నాయి. గురువారం నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
17న నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్లగొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడుతాయని చెప్పింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు పలుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని తెలిపింది. 18న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
పిడుగుపాటుకు మేకలతో 40 మేకల, రామావత్ సైదానాయక్ అనే యువకుడు మృత్యు
నల్లగొండలో జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిని భారీ వడగండ్ల వాన కురిసింది. దీంతో జిల్లాలో అక్కడక్కడ పిడుగు కూడా పడ్డాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్ పరిధిలోని చింతల తండాలో పిడుగుపాటుకు మేకలతో పాటు ఓ యువరైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో దాదాపు 40 మేకల, రామావత్ సైదానాయక్ అనే యువకుడు మృత్యువాతపడ్డారు.
నాగార్జునసాగర్ మండలం చింతల తండాకు చెందిన సైదానాయక్ అనే యువకుడు మేకలను కాసుకుంటూ జీవనం సాగించేవాడు. రోజులాగే ఇవాళ కూడా మేకలను మేత కోసం తోలుకెళ్లాడు. ఉదయం నుండి మేకలను మేపుకుంటు ఓ చెట్టు కింద వాటిని నిలిపాడు. అంతలోనే ఒక్క సారిగా భారీ వర్షం అందుకుంది. వర్షం తగ్గిన తర్వాత వెళ్దామనుకొని కాసేపు మేకలను చెట్టు కిందనే నిలిపాడు.
ఇంతలో వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కూడా రావడం మొదలైయ్యాయి వర్షం హోరెత్తిస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దీంతో చెట్టు కింద ఉన్న ఆ యువకుడు, దాదాపు 40 మేకలు అక్కడికక్కడే చణిపోయాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషదఛాయలు నెలకొన్నాయి. (ఏజెన్సీలు)