Big Breaking News : SIT की जांच में बड़ा खुलासा, कुल पांच पेपर लीक

हैदराबाद: तेलंगाना राज्य लोक सेवा आयोग (TSPSC) पेपर लीक मामले में दिन पर दिन उलझता जा रहा है। प्रारंभ में TSPSC जिसने नगर नियोजन पेपर लीक होने के संदेह पर पुलिस में मामला दर्ज किया। यह निष्कर्ष निकाला गया कि AE पेपर लीक हो गया। बाद में मामला विशेष जांच दल (SIT) को सौंप दिया गया और एसआईटी अधिकारियों ने ताजा सनसनीखेज मामले का खुलासा किया।

टीएसआईटी अधिकारियों की जांच के मुताबिक टीएसपीएससी से कुल 5 पेपर लीक हुए हैं। जांच में पता चला कि 5 मार्च को हुई एई परीक्षा के साथ ही प्रवीण के पेन ड्राइव में तीन और प्रश्नपत्र पाये गये। एसआईटी की जांच में पता चला कि टाउन प्लानिंग, वेटरनरी असिस्टेंट सर्जन और दो अन्य पेपर भी उसकी पेन ड्राइव में मिले हैं। एसआईटी के अधिकारियों ने शेष दो पेपरों के बारे में विवरण का खुलासा नहीं किया है।

Related News:

TSPSC Paper Leak Scam : మొత్తం 5 పేపర్లు లీక్, సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంలో రోజుకో ములుపు తిరుగుతోంది. మొదట టౌన్ ప్లానింగ్ పేపర్ లీకైందనే అనుమానంతో పోలీసులకు కేసు నమోదు చేసిన టీఎస్పీపీస్సీ పోలీసుల దర్యాప్తులో ఏఈ పేపర్ లీకైనట్లు తేల్చారు. తర్వాత ఈ కేసును సిట్ కు అప్పగించగా తాజాగా సంచలన విషయాలను సిట్ అధికారులు బయట పెట్టారు.

టీఎస్పీఎస్సీ నుంచి మొత్తం 5 పేపర్లు లీకైనట్లు సిట్ అధికారుల దర్యాప్తులో తెలుస్తోంది. మార్చి 5న జరిగిన ఏఈ పరీక్షతో పాటు మరో మూడు ప్రశ్నా పత్రాలు ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ తో పాటు మరో రెండు పేపర్లు కూడా తన పెన్ డ్రైవ్ లో ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. మిగిలిన రెండు పేపర్లకు సంబంధించి వివరాలు సిట్ అధికారులు బయట పెట్టలేదు.

త్వరలో జరగబోయే టౌన్ ప్లానింగ్ , వెటర్నరీతో పాటు మరో పేపర్ లీక్ చేసినట్లు సమాచారం. అయితే మిగతా పేపర్లు ఎంటనే ఆధారాలు సిట్ దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది. కాగా త్వరలో జరగబోయే మరిన్ని ప్రశ్నాపత్రాలు కూడా ఇస్తానని రేణుకకు ప్రవీణ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాజశేఖర్ సహాయంతోనే ప్రవీణ్ పేపర్లు తన పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు TSPSC అధికారులతో సిట్ చీఫ్ భేటీ అయ్యారు. లక్ష్మీ ప్రసన్న నుంచి పాస్ వర్డ్ ఎలా వచ్చాయన్న అంశంపై సిట్ చీఫ్ శ్రీనివాస్ ఆరా తీస్తున్నారు.

ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు బేగంబజార్ పోలీస్ స్టేషన్ నుంచి సిట్ కు బదిలీ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీనితో  తదుపరి దర్యాప్తును సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ క్రమంలో కేసులో సిట్ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా  సిట్  బేగంబజార్ పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ స్వయంగా పీఎస్ కు వచ్చి రికార్డులను పరిశీలించారు. ఇప్పటికే బేగంబజార్ పీఎస్ కు వెళ్లి రికార్డులను పరిశీలించిన ఆయన..చైర్మన్ జనార్దన్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అంతేకాదు నాంపల్లిలోని TSPSC ఆఫీస్ కు వెళ్లిన సిట్ చీఫ్ కంప్యూటర్ కు సంబంధించి యూజర్ ఐడి, పాస్ వర్డ్ సహా ఇతర విషయాలు ఎలా తెలిశాయనే అంశంపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. పరీక్షల నిర్వహణ సీక్రెసీతో పాటు ప్రింటింగ్ వ్యవహారాలపై ఆరా తీశారు. కాన్ఫిడెన్షియల్ రూంను కూడా ఆయన పరిశీలించారు. కాన్ఫిడెన్షియల్ రూం నుంచే పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు.

ఈ క్రమంలో కాన్ఫిడెన్షియల్ రూం ఇంఛార్జి లక్ష్మీ ప్రసన్నను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రసన్నలక్ష్మీ వద్దే ప్రవీణ్ యూజర్ ఐడి, పాస్ వర్డ్ చోరీ చేసినట్లు గుర్తించారు. ఈ పేపర్ లీకేజీలో ఎవరెవరి ప్రమేయం ఉంది? పేపర్ ఏ విధంగా లీక్ అయింది? అనే అంశాలపై దర్యాప్తు ఇంకా చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు కేవలం ఇద్దరికీ మాత్రమే ఈ పేపర్ లీక్ అయినట్లు గుర్తించామని..నిందితుల కంప్యూటర్, ల్యాప్ టాప్ లను ఫోరెన్సిక్ ల్యాప్ కు పంపించినట్టు సిట్ చీఫ్ పేర్కొన్నారు. ఆ నివేదిక వచ్చాక పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X