हैदराबाद : सिकंदराबाद के स्वप्न लोक कॉम्प्लेक्स में भीषण आग लग गई। स्वप्न लोक कॉम्प्लेक्स की 7वीं और 8वीं मंजिल में भीषण आग लग गई है। मामले की जानकारी होते ही दमकल की चार गाड़ियां मौके पर पहुंच गईं। दमकलकर्मी आग बुझाने का पुरजोर प्रयास कर रहे हैं। 13 लोगों के बचाया गया है। छह लोगों को बेहोश हालत में बाहर निकाला गया। इनमें तीन महिलाएं हैं। सभी को नजदीकी अस्पताल ले गये। कुछ और लोग अंदर फंसे जाने की खबर है। अंदर फंसे लोगों को बाहर निकालने का कार्य जारी है। अंदर कितने लोग है, इस बात का पता नहीं चल पाया है। मौके पर मंत्री तलसानी श्रीनिवास यादव, जोनल आयुक्त श्रीनिवास रेड्डी और वरिष्ठ अधिकारी मौके पर मौजूद है।
Fire Accident : సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్వప్న లోక్ కాంప్లెక్స్ లోని 7, 8వ అంస్తుల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. విషయం తెలియగానే సంఘటనాస్థలానికి నాలుగు ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
మార్చి 16వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో కాంప్లెక్స్ లోని 7, 8వ అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. దట్టంగా అలుముకున్న పొగలతో ఫైర్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కాంప్లెక్స్ లోపల పలువురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్వప్న లోక్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

SP రోడ్డులోని స్వప్న లోక్ కాంప్లెక్స్ లో జరిగిన ప్రమాదంపై సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, EVDM అడిషనల్ కమిషనర్ ప్రకాష్ రెడ్డితో జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మి మాట్లాడారు. డీఆర్ఎఫ్ టీమ్ లు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రకాశ్ రెడ్డి తెలిపారు. కాంప్లెక్స్ చుట్టుపక్కల ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారికి సహాయ సహకారాలు అందించాలని మేయర్ అధికారులకు ఆదేశించారు.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ మెన్స్ వేర్ షాపులకు పెట్టింది పేరు.. నిత్యం రద్దీగా ఉంటుంది. రోజూ వేలాది మంది అక్కడ దుస్తులు కొనుగోలుకు వస్తుంటారు. మెన్స్ వేర్ కు ఫారెవర్ అనే ట్యాగ్ కూడా ఉంది స్వప్నలోక్ కాంప్లెక్స్ కు. బ్రాండెడ్ తోపాటు అన్ బ్రాండెడ్ దుస్తులకు పెట్టింది పేరు ఈ కాంప్లెక్స్.
జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కేపల్లే ఫార్మా, రసాయనల పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గాల్లోకి ఎగురుతూ భారీ శబ్దాలతో సాల్వెంట్స్ డ్రమ్స్ పేలుతున్నాయి. డ్రమ్ములు పేలుతుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కంపెనీకి దగ్గరలో ఉన్న జనప్రియ, మోదీ అపార్ట్‌మెంట్ల వాసులు ఆందోళన చెందుతున్నారు. (ఏజెన్సీలు)