TSRTC: MD सज्जनार का बड़ा फैसला, छात्रों को पल्लेवेलुगु और एक्सप्रेस बसों में भी ग्रेटर हैदराबाद बस पास की अनुमति

हैदराबाद : टीएसआरटीसी के एमडी का पद संभालने के बाद आईपीएस अधिकारी वीसी सज्जनार समय-समय पर नए-नए आइडिया लेकर आ रहे हैं। कंपनी को मुनाफे की राह पर ले जाकर ऑक्यूपेंसी बढ़ाने के मकसद से अहम फैसले ले रहे हैं। आरटीसी को मुनाफे में लाने के मकसद से अनेक बदलाव की पहल की जा रही है। लोगों को सार्वजनिक परिवहन में विश्वास दिलाने की कोशिश कर रहे हैं। हाल ही में टीएसआरटीसी ने छात्रों को खुशखबरी दी। आरटीसी के अधिकारियों ने दूर-दराज के इलाकों से हैदराबाद आने-जाने वाली पल्लेवेलुगु और एक्सप्रेस बसों में भी छात्रों को ग्रेटर हैदराबाद बस पास की सीमा तक अनुमति देने का फैसला किया है।

शहर के विभिन्न हिस्सों से उपनगरों के कॉलेजों और अन्य शैक्षणिक संस्थानों में पढ़ने के लिए बड़ी संख्या में छात्र आ रहे हैं। अभी इनके बस पास सिटी बसों में ही मान्य हैं। पल्लवेलुगु और एक्सप्रेस बसों में छात्रों के नियमित बस पास की अनुमति नहीं है। उपनगरों में सिटी बसें कम चलने के कारण वे निजी वाहनों का सहारा लेते हैं। छात्रों और उनके माता-पिता के अनुरोध पर आरटीसी अधिकारियों ने आदेश जारी कर उन छात्रों को पल्लेवेलुगु और एक्सप्रेस बसों में भी यात्रा करने की अनुमति दी है जिनके पास आरटीसी सिटी बस पास है।

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ MD సజ్జనార్

Hyderabad: ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. సంస్థను లాభాల బాట పట్టించి ఆక్యూపెన్సీ పెంచటమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంస్థను లాభాల బాట పట్టించటమే లక్ష్యంగా ఆర్టీసీలో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజా రవాణాపై ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తు్న్నారు. తాజాగా.. టీఎస్ ఆర్టీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ విద్యార్థుల గ్రేటర్‌ హైదరాబాద్‌ బస్‌పాస్‌లను పరిమితి వరకు అనుమతించాలని ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయించారు.

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శివార్లలోని కళాశాలలు, ఇతర విద్యా సంస్థల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చదువులు సాగిస్తున్నారు. ప్రస్తుతం సిటీ బస్సుల్లోనే వారి పాసులు చెల్లుబాటు అవుతున్నాయి. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో విద్యార్థుల సాధారణ బస్సు పాసులను అనుమతించటం లేదు. నగర శివారులో సిటీ బస్సులు తక్కువగా తిరిగుతున్నందున వీరు ప్రైవేటు వెహికల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఆర్టీసీ సిటీ బస్‌పాస్‌ ఉన్న విద్యార్థులను పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులోనూ ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

సజ్జనార్ టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఆర్టీసీ బస్సులను ప్రజలకు అతి చేరువ చేయటంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు విప్లవాత్మక మార్పులతో అనేక కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా టిక్కెట్లు, పాసుల జారీలో స్మార్ట్‌ శకానికి టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టనుంది. టికెట్‌ జారీకి ఐటిమ్స్‌ యంత్రాలతోపాటు.., మొబైల్ యాప్ ద్వారా బస్ పాసులను జారీ చేయాలని నిర్ణయించుకుంది. మెట్రో తరహాలో స్మార్ట్ పాసులను ప్రయోగాత్మకంగా చేపట్టనుంది. ముందుగా హైదరాబాద్ సిటీలో స్మార్ట్ పాసులను ప్రారంభించనున్నారు. చిల్లర సమస్య, లెక్కల్లో తేడాలు వంటి చిక్కుముడులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ స్మార్ట్ కార్డులను ఆర్టీసీ కౌంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మెట్రో తరహాలో ఆన్‌లైన్‌లోనే రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ప్రతిసారీ టికెట్‌ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా కార్డులో ఉన్న మొత్తం నుంచి ఛార్జీ డబ్బులు మినహాయించుకుని టికెట్లు ఇస్తారు. తద్వారా చిల్లర సమస్యకు చెక్ పడటంతో పాటు.., లెక్కలో తేడాలు రాకుండా ఉంటాయి. తొలి దశలో గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 3,087 సర్వీసుల్లో 3,500 ఐటిమ్స్‌ యంత్రాలను వినియోగించనున్నారు.

హైదరాబాద్‌లో ఈ ప్రయోగం విజయవంతమైతే దశలవారీగా రాష్ట్రమంతటా అమలు చేసేందుకు ఆర్టీసు కసరత్తు చేస్తోంది. ఆర్టీసీలో ప్రస్తుతం సొంత, అద్దె బస్సులు కలిపి 9,321 ఉండగా.. 10 వేల ఐటిమ్స్‌ అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఐటిమ్స్‌ యంత్రాలు, స్మార్ట్‌ కార్డులు, మొబైల్‌ యాప్‌ సాంకేతికత కోసం ఆర్టీసీ తాజాగా టెండర్లు ఆహ్వానించింది. ఈ స్మార్ట్‌ కార్డులను వచ్చే ఏడాది మార్చిలోపు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

కేవలం ప్రయాణికుల సేవలే కాకుండా కార్గో సర్వీసులతో ఆదాయాన్ని పెంచుకుంటున్న ఆర్టీసీ.. వాటర్ బాటిల్స్ విక్రయాలతోనూ ఆదాయన్ని సమకూర్చుకుంటుంది. ఏసీ బస్సుల్లో ఉచితంగా అందించే వాటర్ బాటిల్స్ స్థానంలో తాము తయారు చేసే వాటిని ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే పెట్రోల్ బంకులు నిర్వహిస్తూ ఆదాయాన్ని అర్జిస్తోంది. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X