కొడంగల్ లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఎకో-పామ్ ఫ్యాక్టరీకి శ్రీకారం

కొడంగల్: మహబూబ్‌నగర్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఎకో-పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సందర్భంగా నిర్వహించిన రైతన్న ఆత్మీయ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ ముద్దుబిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభివృద్ధి పనులతో ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారని కొనియాడారు. జిల్లాకు సీఎం చేస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చే వారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఇది సాధ్యమైందని చెప్పుకునేలా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఒకప్పుడు వలసలకు నిలయంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తోందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణలో మరోసారి అధికారంలోకి వస్తామని ఎవరైనా భావిస్తే అది కేవలం సోషల్ మీడియాకే పరిమితమవుతుందని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో 100 సీట్లతో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి వెళ్లకుండా సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమయ్యారని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం, తెలంగాణలో రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం తథ్యమని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar