Hyderabad : Dr. B. R. Ambedkar Open University paid rich floral tributes to Konda Laxman Bapuji on his 109th Birthday Anniversary at it’s campus on Friday. Bapuji was an Indian freedom fighter who participated in the Telangana agitation and well known Telangana activist. Always he raised for his voice for the welfare of weaker sections of society and fought for the people throughout his life. Konda Laxman Bapuji’s life set an example for future generations.
Prof. E. Sudha Rani, Registrar; and Directors Prof. G. PushpaChakrapani, Prof. I. Anand Pawar; Prof. Srinivas Vaddanam; Dr. Rama Devi, Coordinator, BC Cell; Dr. B. Srinivas; Dr. P. Venkataramana; Prof. Pallavi Kabde and all the Directors, Deans, Heads of the branches, Teaching and Non-Teaching Staff Members, Representatives of various service associations offered rich tributes to the Bapuji’s portrait.
Also Read-
కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణా ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి అర్పించారు. బాపూజీ స్వాతంత్ర్య సమరయోధుడు తొలి తరం ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమం తో పాటు అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలచిన బాపూజీ, బడుగు బలహీన వర్గాల పోరాట గళంగా, తన జీవిత కాలం అంతా ప్రజల కోసమే పరితపించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భావి తరాలకు ఆదర్శనీయంగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఇంఛార్జ్ ప్రొ. ఇ. సుధా రాణి; డైరెక్టర్లు ప్రొ. జి. పుష్పా చక్రపాణి; ప్రో. ఆనంద్ పవార్; ప్రో. వడ్డాణం శ్రీనివాస్; బి. సి సెల్ కోఆర్డినేటర్ డా. రామా దేవి; డా. బి. శ్రీనివాస్; డా. పరాంకుశం వెంకటరమణ; ప్రొ. పల్లవి కబ్డే పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి ఘనంగా పుష్పాలతో నివాళి అర్పించారు.