80వ స్వాతంత్య్ర దినోత్సవం, తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జెండాను ఎగురవేసిన కవిత

హైదరాబాద్ : రెండు వందల ఏళ్ల పాటు భారతీయులపై చేసిన అఘాయిత్యాలకు బ్రిటన్ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం కవిత మాట్లాడారు. మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఎంతో మంది మన పూర్వీకుల త్యాగాల పోరాట ఫలితమన్నారు. మన చరిత్రను గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాలని, చరిత్ర తెలుసుకున్న వాళ్లే భవిష్యత్ ను చక్కగా నిర్మించగలరని అన్నారు.

కొహినూర్ సహా మన సంపద తిరిగి ఇచ్చేయాలని

జలియన్ వాలా బాగ్ ఘటనలో వందలాది మందిని పొట్టనబెట్టుకున్నారన్నారు. కృత్రిమ కరువు తీసుకొచ్చి వేలాది మంది చావులకు కారణమయ్యారన్నారు. రెండు ప్రపంచ యుద్ధాలకు మన సైనికులను తీసుకెళ్లి స్వాతంత్ర్యం ఇస్తామని మాట ఇచ్చిన తప్పిన విషయాన్ని గుర్తు చేశారు. శాంతియుతంగా స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మనవాళ్లపై ఎన్నో అరాచకాలకు పాల్పడిన బ్రిటీష్ వాళ్ల చరిత్ర మనం తెలుసుకోవాలని కవిత అన్నారు. రెండు వందల ఏళ్ల పాటు మనపై జరిపిన అరాచకాలకు బ్రిటీష్ రాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. మన దేశం నుంచి దోచుకెళ్లిన కోహినూర్ వజ్రంతో పాటు సంపదను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

బ్రిటన్ పాఠ్య పుస్తకాల్లో తప్పుగా రాసిన చరిత్రను మార్చాలని డిమాండ్

బ్రిటీష్ కాలంలో ఒకే భూభాగంగా ఉన్న భారత్, పాకిస్తాన్ లను ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండానే విభజించి, రెండు దేశాల మధ్య శాశ్వత వైరుధ్యాలు తీసుకువచ్చారని అన్నారు. అలాంటి బ్రిటీష్ వాళ్ల కల్చర్ ను, ఇంగ్లీష్ మాట్లాడటాన్నే ఇప్పటికీ కూడా గొప్ప అన్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్ల తోలు గొప్ప, నల్ల తోలు కాదన్నట్లుగా విభజించి పాలించారని అన్నారు. బ్రిటీష్ పాలన నాటి ఆనవాళ్ల నుంచి మనం బయటపడాల్సిన అవసరముందని చెప్పారు. మన సంస్కృతిని, చరిత్రను కాపాడుకోని భవిష్యత్ తరాలకు వాటిని అందించాలన్నారు. చరిత్ర తెలుసుకున్న వాళ్లే భవిష్యత్ ను నిర్మించగలరన్నారు. బ్రిటన్ పాఠ్య పుస్తకాల్లో తప్పుగా రాసిన చరిత్రను మార్చాలని డిమాండ్ చేశారు.

Also Read-

స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను పిల్లలకు చెప్పాలి

బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ఏళ్ల తరబడి మన దేశంలో పోరాటం కొనసాగిందని గుర్తు చేశారు. ఎంతో మంది మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేశారన్నారు. ఈ పోరాటంలో ఎన్నో సార్లు ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ పట్టు వదలకుండా చేసిన ఉద్యమం కారణంగానే మనకు స్వాతంత్ర్యం సిద్దించిందని అన్నారు. వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. స్వతంత్ర ఉద్యమంలో జరిగిన పోరాటాన్ని కచ్చితంగా మన పిల్లలకు వివరించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar