जय तेलंगाना: 24 डिज़ाइन, 10 रंग, 240 थ्रेड बॉर्डर और सौ फीसदी पॉलिस्टर फिलामेंट यार्न की बतुकम्मा साड़ियों का वितरण

हैदराबाद: हर साल की तरह इस बार भी तेलंगाना सरकार बतुकम्मा साड़ियों का वितरण करेगी। बतुकम्मा साड़ियों का वितरण महिलाओं के बीच गुरुवार से पूरे तेलंगाना में किया जाएगा। इसके लिए सभी व्यवस्था की गई है। इस बार साड़ियों को 24 डिज़ाइन, 10 रंग, 240 थ्रेड बॉर्डर और सौ फीसदी पॉलिस्टर फिलामेंट यार्न का उपयोग करके तैयार किया गया।

कपड़ा और हथकरघा मंत्री केटी रामाराव ने कहा कि पिछले पांच सालों में तेलंगाना सरकार ने राशन कार्ड के आधार पर महिलाओं को 5.81 करोड़ साड़ियां वितरित की हैं। इस साल भी लगभग 339.71 करोड़ रुपये साड़ियों पर खर्च किये गये हैं। उन्होंने कहा कि इस योजना ने न केवल उत्सव के अवसर पर बल्कि सरकार की ओर से महिलाओं को उपहार के रूप में साड़ी सुनिश्चित की है और बुनकरों को आजीविका भी प्रदान कर रही है। संयुक्त आंध्र प्रदेश के शासनकाल में बुनकरों ने अपने परिवार का भरण पोषण करने के लिए आंदोलन करना पड़ा था, लेकिन अब उनकी आय दोगुनी हो गई है।

मंत्री ने आगे कहा, “तेलंगाना सरकार बुनकरों की आय को दोगुना करके कपड़ा उद्योग की रक्षा के लिए सभी उपाय कर रही है। मगर केंद्र सरकार बुनकरों के वस्त्रों पर जीएसटी लगाकर उनकी कमर तोड़ रही हैं। केंद्र सरकार बुनकरों को सहयोग देने के लिए इच्छुक नहीं है. लेकिन तेलंगाना सरकार उनकी हित के लि सभी उपाय कर रही है और आगे भी करेगी।” उन्होंने बताया कि सभी साड़ियां अपने-अपने गंतव्य तक पहुंच चुकी हैं। अब जिला प्रशासन इनके वितरण की व्यवस्था कर रही है। इन साड़ियों को सिरसिल्ला जिले में लगभग बीस हजार से अधिक पावरलूम बुनकरों द्वारा किया गया। हर दिन लगभग एक लाख साड़ियों का निर्माण किया गया। तीन लाख साड़ियों का स्टॉक बनाए रखा गया।

तेलंगाना की महिलाओं की राय को ध्यान में रखते हुए डिजाइन को अंतिम रूप दिया है। साड़ियों की लंबाई छह मीटर है। इस बार 92 लाख साड़ियों को तेलंगाना में महिलाओं को वितरित किया जाएगा। 9 मीटर लंबाई की आठ लाख साड़ियां बुजुर्ग महिलाओं के लिए उनकी पसंद के अनुसार तैयार किया गया है। आपको बता दें कि सरकार ने सरकार ने 2017 में साड़ियों का वितरण शुरू किया था। तब से हर साल लगभग एक करोड़ महिलाओं को दशहरा के उत्सव के अवसर पर साड़ियां दी जा रही है। बतुकम्मा साड़ियों के वितरण कार्यक्र में मंत्री, विधायक और अन्य निर्वाचित प्रतिनिधि भाग लेते हैं।

రేపటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ : కేటీఆర్‌

హైదరాబాద్‌ : తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ఆడ పడుచులకు ప్రభుత్వం చీరెలను సారెగా అందిస్తోంది. ఈ నెల 25 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ కానుకలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక లక్ష్యంతో కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి.. ఇప్పటికే అన్ని జిల్లాల కలెకర్లతో సమన్వయం చేసుకుంటూ, తమ టెక్స్‌టైల్‌ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు. కార్యక్రమం ద్వారా సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు ఒక గొప్ప భరోసా వచ్చిందని, వారి వేతనాలు రెట్టింపు అయ్యాయన్నారు. తద్వారా వారు తమ కాళ్లపైన తాము నిలబడే పరిస్ధితికి చేరుకున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు.

నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు..

సమైక్య రాష్ట్రంలో ఉపాధి లేక ఆగమైన నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. బతుకమ్మ చీరెల పంపిణీతో అటు ఆడబిడ్డలకు ఆనందంతో పాటు ఏడాది పొడవునా నేతన్నలకు ఉపాధి భరోసా దొరికిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బతుకమ్మ చీరెల వంటి వినూత్నమైన కార్యక్రమాలతో నేత కార్మికుల ఒకవైపు ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే, టెక్స్‌టైల్‌ ఉత్పత్తులపైన జీఎస్టీ వంటి నిర్ణయాలతో నేతన్నలను నిలువునా ముంచే నేత కార్మికుల వ్యతిరేక చర్యలను కేంద్రం తీసుకుంటుందని కేటీఆర్ అన్నారు. కేంద్రం నేతన్నలను, వారి పరిశ్రమను, వారి జీవితాలను పట్టించుకోకున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేతన్నలకు కోసం తాము నిరంతరం నిబద్ధతతో పనిచేస్తామని కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం సైతం సూమారు కోటి బతుకమ్మ చీరలను పంపీణి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది గతంలో కన్నా మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగుల, వెరైటీల్లో ఈ చీరలను తెలంగాణ టెక్స్‌టైల్‌ శాఖ తయారు చేసిందని వివరించారు.

24 విభిన్న డిజైన్లు.. 10 రకాల రంగుల్లో..

గ్రామాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, ఆసక్తులు, నిఫ్ట్‌ డిజైనర్ల సహకారంతో సరైన డిజైన్లు, అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ఏడాది బతుకమ్మ చీరెల నూతన డిజైన్లతో ఉత్పత్తి చేశామన్నారు. ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు, పది రకాల ఆకర్షణీయ రంగుల్లో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల)తో తయారు చేయబడిన 100శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను టెక్స్‌టైల్‌ శాఖ తయారు చేసిందన్నారు. మహిళలకు 92లక్షల సాధారణ చీరెలు, వయోవృద్ధులకు తొమ్మిది మీటర్ల పొడువున్న చీరెలు 8లక్షలు తయారు చేయించామన్నారు. మొత్తంగా కోటిచీరెలను రాష్ట్రంలో ఆహార భద్రతా కార్డు కలిగిన ప్రతీ ఆడబిడ్డకు అందించనున్నట్లు చెప్పారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన ఉపాధి కల్పిస్తున్న ఈ బతుకమ్మ చీరెల ప్రాజెక్టు కోసం రూ.339.73 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 5.81 కోట్ల చీరెరలను ఆడబిడ్డలకు ఐదు దఫాలుగా అందించినట్లు కేటీఆర్‌ వివరించారు. (एजेंसियां)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X