10 శాతం గిరిజన రిజర్వేషన్ల అమలు కోస, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డ్స్ ఉద్యమం

గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ…

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ చేపట్టిన చేనేత పోస్ట్ కార్డ్స్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని గన్ పార్క్ వద్ద గిరిజన రిజర్వేషన్ల కోసం ప్రధానికి పోస్ట్ కార్డ్స్ ఉద్యమాన్ని ప్రారంభించిన బీ.ఆర్.ఎస్. పార్టీ గిరిజన విద్యార్థి విభాగం నాయకులు శ్రీను నాయక్.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలోకి తీసుకుని వచ్చిన 10 శాతం గిరిజన రిజర్వేషన్లను వెంటనే ఆమోదించాలని, గిరిజన యూనివర్సిటీ వెంటనే ప్రారంభించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పోస్ట్ కార్డ్స్ ఉద్యమాన్ని గిరిజన విద్యార్థులు సోమవారం హైదరాబాద్ గన్ పార్క్ వద్ద చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చిన 10 శాతం గిరిజన రిజర్వేషన్లను… కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరణ చేసి వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.

ఇదే డిమాండ్ తో హైదరాబాద్ గన్ పార్కు వద్ద బీ.ఆర్.ఎస్. పార్టీ గిరిజన విద్యార్థి విభాగం నాయకులు దాడి శ్రీను నాయక్ ఆధ్వర్యంలో… ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి పోస్టు కార్డ్స్ ఉద్యమాన్ని చేపట్టారు. శ్రీను నాయక్, గిరిజనుల విద్యార్థులతో కలిసి పోస్ట్ కార్డ్స్ ఉద్యమాన్ని సోమవారం ప్రారంభించారు.

మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల సమస్యలపై ప్రారంభించిన పోస్ట్ కార్డు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఆ ఉద్యమాన్ని కొనసాగింపులో భాగంగా… గిరిజన 10శాతం రిజర్వేషన్ కోసం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని శ్రీను నాయక్ తెలిపారు. ఆంద్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ 2014 చట్టంలో ఇచ్చిన హామీ మేరకు గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని శ్రీను నాయక్ డిమాండ్ చేశారు.

సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా… 1,000 మంది గిరిజన విద్యార్థులచే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 1000 పోస్ట్ కార్డులను పంపుతామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తూ… ప్రతి కాలేజీ, స్కూల్,యూనివర్సిటీ విద్యార్థులను ఏకం చేస్తూ… తమకు రావాల్సిన 10 శాతం గిరిజన రిజర్వేషన్లు, గిరిజన యూనివర్సిటీనిసాధించుకుంటామని గిరిజన విద్యార్థులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X