ఉప్పల్ స్టేడియంలో రికార్డు బద్దలు, సన్ రైజర్స్ విధ్వంసం, 31 పరుగుల తేడాతో విజయం,

హైదరాబాద్: సన్ రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా ముంబైగా ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలు సిసలు మజాను అందించింది. కొడితే సిక్స్ లేకపోతే ఫోర్ అనేట్లుగా ఇరు జట్ల విధ్వంసం సాగింది. మ్యాచ్ లైవ్ లో కాకుండా హైలెట్స్ చూసిన ఫీలింగ్ సగటు క్రికెట్ అభిమానికి కలిగింది. హై స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 31 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై 246 పరుగులకే పరిమితమైంది.

భారీ లక్ష్యం ఉన్న ముంబై ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. చివరి ఓవర్ వరకు తమ పోరాటాన్ని కొనసాగించింది. తొలి మూడు ఓవర్లలోనే 50 పరుగులు జోడించి కిషాన్, రోహిత్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ 12 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ తో 26 పరుగులు చేస్తే.. కిషాన్ 13 బంతుల్లో 4 సిక్సర్లు,2 ఫోర్లతో 34 పరుగులు చేసి సన్ రైజర్స్ బౌలర్లను వణికించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటైనా.. తిలక్ వర్మ విధ్వంసం సృష్టించాడు. 

బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. తిలక్ జోరు ధాటికి ఒక దశలో ముంబై గెలుస్తుందేమో అనిపించింది. 34 బంతుల్లో 6 సిక్సర్లు 2 ఫోర్లతో 64 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. తిలక్ ఔట్ తో ముంబై ఛేజింగ్ లో వెనకపడింది. భువనేశ్వర్, ఉనాద్కట్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో పరుగులు రావడం కష్టమైంది. పాండ్య(20), టిం డేవిడ్ (42) పోరాడినా.. లక్ష్యం భారీగా ఉండడంతో ముంబైకి  పరాజయం తప్పలేదు. 

అంతకు ముందు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్స్ ట్రావిస్ హెడ్ (62), అభిషేక్ శర్మ (63), క్లాసెన్ (80 నాటౌట్), మార్ క్రమ్ (42 నాటౌట్)లు పెను విధ్వంసం సృష్టించారు. ముంబై బౌలర్లను ఊచకోత కోస్తూ భారీ సిక్సులు, ఫోర్లతో స్టేడియాన్ని మోత మోగించారు. దీంతో ముంబై బౌలర్లు ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది.

ఈక్రమంలో ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పారు సన్ రైజర్స్ బ్యా్ట్స్ మెన్లు. వచ్చిన బ్యాట్స్ మెన్లు వచ్చినట్లు ఒకరిని మించి మరోకరు బౌండరీలతో ముంబై బౌలర్లపై విరుచుకుపడడంతో ఐపీల్ లో పలు రికార్డులు బద్దలయ్యాయి.

20 ఓవర్లలో 3 మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్ రైజర్స్ ఐపీఎల్ లో చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 263 పరుగులతో బెంగళూరు మీద ఈ రికార్డు ఉంది. ఇక మొదటి 10 ఓవర్లలోనూ అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది. 10 ఓవర్లలో ఎస్ఆర్ హెచ్ మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అంతకుముందు ముంబై(133/3)పై ఉన్న రికాడ్డును సన్ రైజర్స్ తన పేర లిఖించుకుంది.

సంబంధిత వార్త :

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఎస్ఆర్ హెచ్.. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ధాటికి తొలి 7 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. 24 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 62 పరుగులు చేసి హెడ్ ఔటయ్యాడు. ఇక్కడ నుంచి అభిషేక్ శర్మ వంతు వచ్చింది. హెడ్ 18 బంతుల్లో అర్ధ సెంచరీ చేస్తే అభిషేక్ మాత్రం అంతకు మించి చెలరేగి 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 23బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ దశలో మార్కరం కు జత కలిసిన క్లాసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 55 బంతుల్లోనే 116 పరుగులు రాబట్టారు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసన్ మొత్తం 34 బంతుల్లో 7 సిక్సులు, నాలుగు ఫోర్లతో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో మార్కరం 28 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో మఫాకా 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు.. కోయెట్జ్ నాలుగు ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకున్నాడు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X