Congratulations : డా . బి . ఆర్ . అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి న్యాక్ ‘A’ గ్రేడ్

హైదరాబాద్ : డా . బి . ఆర్ . అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి న్యాక్ A గ్రేడ్ గుర్తింపు వచ్చినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొ. ఏ. వి . ఎన్ . రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గత జూలై మాసంలో న్యాక్ బృందం విశ్వవిద్యాలయంలో పర్యటించి అన్ని విభాగాలను పర్యవేక్షించి 2.96 పాయింట్లతో B ప్లస్ ప్లస్ గ్రేడ్ ఇవ్వగా తమకు రావాల్సిన స్థాయిలో పాయింట్లు రాలేదని మళ్ళీ అస్సెస్మెంట్ కావాలని న్యాక్ కు దరఖాస్తు చేశామన్నారు.

దీనితో న్యాక్ కమిటీ ఆరుగురు సభ్యుల బృందంతో మార్చి 21 – 23 వరకు మళ్ళీ అస్సెస్మెంట్ చేశారన్నారు . ఈ ఆరుగురు సభ్యుల బృందం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం న్యాక్ పాలక వర్గం శనివారం బెంగుళూరు లో సమావేశమై డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ కు 4 పాయింట్ల ఫార్ములా లో 3.12 స్కోర్ తో A గ్రేడ్ కేటాయించినట్లు రిజిస్ట్రార్ వివరించారు . విశ్వవిద్యాలయం A గ్రేడ్ పొందడానికి కష్టపడ్డ ఉద్యోగులకు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. కె . సీతారామా రావు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X