కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుష్పాంజలి

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం సాయన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకున్నారు.

Sayanna

అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… సాయన్న మరణ వార్త అందరినీ కలచి వేసింది. సాయన్న మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. వివాదరహితుడిగా, సౌమ్యశీలిగా పేరున్న సాయన్న… ప్రజా దీవెనలతో 5 సార్లు ఎమ్మెల్యే గా గెలిచి సేవలు అందించారని కొనియాడారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాయన్న పార్థీవ దేహానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ౼శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్తూ ఓదార్చారు.

ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి వేముల

హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న పార్థివ దేహానికి శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సాయన్న మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. సాయన్న నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు అని,హైదరాబాద్ లో బ్యాంకు ఉద్యోగిగా సేవలందించి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా 5పర్యాయాలు ఇక్కడి ప్రజలకు సేవలందించారు అని గుర్తు చేశారు.

ఆయన రాజకీయాల్లో వివాదరహితుడిగా, నిరాడంబరుడు గా నిలిచిన వ్యక్తి అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఎన్నడూ అధికార దర్పం ప్రదర్శించలేదని కొనియాడారు. తాను ఎప్పుడు కలిసిన మనం నిజామాబాద్ వాళ్లం అని గుర్తు చేసే వారని అన్నారు. సాయన్న నిజమైన అంబేద్కరిస్ట్ అని ఆయన ఆశయ స్ఫూర్తి కొనసాగిస్తామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు యావత్ నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన ప్రగాఢ సానుభూతి,సంతాపం వ్యక్తం చేశారు.

మంత్రి హరీశ్ రావు నివాళులు

హైదరాబాద్: కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు సాయన్న పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మంత్రి హరీశ్ రావు.

నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి

ఎమ్మెల్యే జి.సాయన్న మృత దేహం వద్ద పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న మృతదేహం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి నివాళులర్పించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

సాయన్న ఆకస్మిక మరణం పట్ల మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాడా సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధి0చారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

MLA సాయన్న మృతికి సంతాపం తెలిపిన మంత్రి తలసాని

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారి మరణం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ఆయన పేర్కొన్నారు.

గంగుల కమలాకర్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారి మరణం బాధాకరమని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని పేర్కొన్నారు.

శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.ఆయన మృతి బి ఆర్ ఎస్ పార్టీకి తీరని లోటని తెలిపారు .ఎమ్మెల్యేగా సాయన్న ప్రజలకు ఎనలేని సేవ చేసారని ఈ సంధర్భంగా గుర్తు చేసుకున్నారు .సా యన్న గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల ఎంపీ రవిచంద్ర సంతాపం

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కంటోన్మెంట్ నియోజకవర్గానికి, సికింద్రాబాద్ ప్రాంతానికి తన అమూల్యమైన సేవలందించారని రవిచంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయన్న మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు.ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు ఎంపీ వద్దిరాజు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.సాయన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గారి మరణం బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X