గౌరవ శాసన మండలి అధ్యక్షులు,
తెలంగాణ శాసన మండలి, హైదరాబాద్ గారికి
విషయం: గౌరవ సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి డి . శ్రీధర్ బాబు మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పై సభ ను తప్పుదోవ పట్టించినందుకు వారిద్దరి పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు అనుమతి గురించి.
ఆర్యా ,
శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయం లో తేదీ 17.12.2024 రోజున మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కు సంబంధించి గౌరవ పరిశ్రమలు, ఐటీ, శాసన సభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు గౌరవ్వ ముఖ్యమంత్రి ,మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి ఏ. రేవంత్ రెడ్డి తరపున బీ ఆర్ ఎస్ శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు కాలేదని, వరల్డ్ బ్యాంకు నుంచి ఎలాంటి సాయాన్ని అభ్యర్థించలేదని చెప్పారు. అయితే వరల్డ్ బ్యాంకు కు రాష్ట్రప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం సెప్టెంబర్ 19, 2024 రోజున రూ. 4100 కోట్ల రూపాయల సాయాన్ని అభ్యర్థించింది. అంతే కాకుండా ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ని కలిసిన సందర్భం లోనూ సీఎం రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కు 14 వేల కోట్ల రూపాయలను కేటాయించాలని కొరడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ కు, కేంద్ర ప్రభుత్వానికి మూసీ ప్రాజెక్టు పై డీపీఆర్ గురించి ఓ రకంగా, శాసన మండలి కి మరో రకంగా చెప్పడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు గౌరవ సభ ను అవమానపరిచారు. శాసన మండలి నియమావళి 168 (ఏ )కింద వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ల పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల కింద చర్చకు అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాం
ఇట్లు
బీ ఆర్ ఎస్ శాసనా సభా పక్షం