ముస్లింలపై దాడులు, వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి
ఈసీ సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేసిన మండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, జీవన్‌రెడ్డి, ముస్లిం నేతలు
సీఈవోకు వేర్వేరుగా ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ నేతలు
తక్షణమే రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి దిగజారి చేస్తున్న ప్రయత్నాలను, కబారు మాటలను పరిశీలించి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలి అని సీఈవో తెలంగాణ సుదర్శన్‌రెడ్డిని కోరినట్టు శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముస్లింపై చేసిన దాడులు, వ్యాఖ్యలపై గురువారం ఈసీకి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు.
ఈ మేరకు సీఈవో తెలంగాణ సుదర్శన్‌రెడ్డిని ఫిర్యాదు కాపీ అందచేసినట్టు పేర్కొన్నారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్ పార్టీ ఒక చారిత్రక బాధ్యతను నిర్వహించింది. తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాలు పడిన గోసను, అన్యాయం, అవమానం, అవహేళనకు గురైన తెలంగాణ జాతిని విముక్తి చేసింది, దానికి కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికే ఆదర్శవంతమైన పాలను అందించింది ’ అని కొనియాడారు.

ఎవరు ఊహించని విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత, అనేక కార్యక్రమాలు ప్రవేశ పెట్టి అమలు చేసిందని, ప్రజా జీవితాలలో వెలుగులు నింపిన పార్టీ బీఆర్‌ఎస్ అని కొనియాడారు. ఆరోజు పోరాటం చేసి, ఆ తర్వాత మార్పును తీసుకురావడంతో పాటు, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండి, సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలు కోసం అనుక్షణం కోసం నిలదీస్తున్నదీ కూడా ఈ బీఆర్‌ఎస్ పార్టీనే అని తెలిపారు. అలాంటి చరిత్ర ఉన్న పార్టీని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారని, జూబ్లీహిల్స్ ఎన్నికలో పార్టీ ఓడిపోతుందన్న భయంతో, ఆ తర్వాత తన పదవికి గండం ఉంటుందన్న ఆందోళన చెందుతూ, రేవంత్‌రెడ్డి చాలా కబారు వ్యాఖ్యలు చేస్తున్నరని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే, పథకాలు పోతాయని బెదిరిస్తున్నాడని దుయ్యబట్టారు.
Also Read-
అసలు బీఆర్‌ఎస్ పార్టీని పెట్టిందే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజలను కన్న తల్లిలాగా చూసుకోవడం కోసమన్నారు. అలాంటి ఎకైక పార్టీకి అధినేత కేసీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇదంతా వేటగాడి తీరు తలపిస్తుందని దుయ్యబట్టారు. వేటలో భాగంగా, ముందుగా గింజలు వేసి, ఆ పైన వల వేసి, పిట్టలు రాగానే పట్టుకుని పోతడు అని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి.. ఎన్నికల సందర్భంగా మాట్లాడే మాటలు, ఇచ్చేటువంటి హామీలు ఆ రకంగా ఉన్నాయి కాబట్టే, ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలన నిర్వాకం వల్ల ప్రజల్లో పెల్లుబికుతున్న వ్యతిరేకత, జూబ్లీహిల్స్‌లో ఎదురుకాబోతున్న వ్యతిరేత భయానికే, రకరకాలైన సర్కస్ ఫీట్లు చేస్తున్నాడు అని దుయ్యబట్టారు.
కల్లుతాగిన కోతిలా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి గురించి ఎన్నికల కమిషన్ దృష్టికి అనేక విషయాలు తీసుకువచ్చి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సందర్భంగా యూసుఫ్‌గూడలో జరిగిన సభ, రాష్ట్ర రాజకీయాలలో 40 నుంచి 50 సంవత్సరాలుగా ఉన్న తామందరం ఎన్నడూ చూడలేదన్నారు. ఈ ఉప ఎన్నిక జరుగుతున్న నియోజక వర్గం పరిధిలో ఒక్క మీటింగ్ పెట్టి, ఇంత నగ్నంగా హామీలు ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టడం అనేది, ప్రజాస్వామ్యానికే మయని మచ్చ తెచ్చే దుర్మార్గమైన చర్య అని ఆయన ఆభివర్ణించారు. అందుకే ఈ ఉప ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరడం జరిగిందన్నారు.
పోలీసులతో పాటు అధికార యంత్రాంగంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అని దుయ్యబట్టారు. అందుకు ప్రతిపక్ష సభలను విచ్ఛిన్నం చేసి, అధికారి పార్టీ సభలను మాత్రం విజయవంతం చేసుకుంటున్నారని ఆగ్రహించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన షకీల్ ఇంటికి వెళ్లి బెదిరింపు చర్యలకు దిగిన వారిపై మధుసూధనాచారి నిప్పులు చెరిగారు.
ప్రజలు ఇంతటి దయనీయ స్థితిలో ఉండడానికి కారణం కాంగ్రెస్సే కాబట్టి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో జై తెలంగాణ అని నినదించి, తెలంగాణ కోసం, పోరాడి సాధించుకున్న వాళ్లం, ఈ సాధించుకున్న తెలంగాణను బాగు పడాలన్న విషయంలో, ఆ అవేదన ఉన్నటువంటి వాళ్లమన్నారు.
ఏ ఒక్క రోజు కూడా జై తెలంగాణ అనని ఈ రేవంత్‌రెడ్డి, ముమ్మాటికీ తెలంగాణ పాలిటి ద్రోహి, శత్రువే అంటూ మండిపడ్డారు. కాబట్టి, అటువంటి శత్రువుకు ఈ ఎన్నికల సందర్భంగా గుణపాఠం చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇది పేరుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రమే, కానీ 4 లక్షల మంది ఓటర్లు పాల్గొంటున్నదే కానీ, ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించిన ఎన్నికలు కాబట్టి యావత్ భారతదేశం దృష్టి కూడా ఈ ఉప ఎన్నికలపై ఉందన్నారు. చైతన్యానికి మారు పేరు తెలంగాణ అని ఒక ముద్ర ఉన్నదన్నారు. అసాధ్యమనుకున్న తెలంగాణను సాధించుకున్నటువంటి చరిత్ర ఉన్నదీ తెలంగాణకు అని తెలిపారు.
