BRAOU : బి. ఎడ్ & బి. ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తుకు చివరి తేదీ మే 22

హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయo బి.ఎడ్ – ఒడిఎల్, బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్ – ఒడిఎల్) అర్హత పరీక్షా -2022-23 కు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ మే 22, 2023 గా విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు విశ్వవిద్యాలయo పోర్టల్ www.braouonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంట్రన్స్ ఫీజు రూ. 1000/-, ఎస్సి ఎస్టి, వికలాంగులకు రూ.750/- మాత్రమే ఆన్ లైన్ లో డెబిట్ / క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా TS/ AP ఆన్‌లైన్ ఫ్రాంఛైజీ కేంద్రాలులో చెల్లించాలన్నారు.

జూన్ 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రల్లోని పరీక్ష కేంద్రాల్లో బి.ఎడ్ ప్రవేశ పరీక్ష ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మరియు బి.ఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) మధ్యాహ్నం 2:00 నుండి 4:00 గంటల వరకు నిర్వహిస్తారని వెల్లడించారు. విద్యార్థులు పరీక్షకి రెండు రోజుల ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవల్లన్నారు. మరిన్ని వివరాలకు www.braou.ac.in లేదా www.braouonline.in లో సంప్రదించొచ్చని పేర్కొన్నారు.

BRAOU B.Ed & B.Ed ( Special Education ) ENTRANCE TEST REGISTRATION LAST DATE IS MAY 22

Hyderabad : The last date for Online Registration for B.Ed- ODL and B.Ed (Special Education- ODL) Entrance Test – 2022-23 of Dr. B. R. Ambedkar Open University (BRAOU) is May 22. Candidates have to Register through ‘Online’ from University portal www.braouonline.in. and pay the Registration fee of Rs. 1000/- and SC/ST/PWD candidates has to pay Rs.750/- only by debit / credit card or at TS / AP Online franchisee centre on or before 22-05-2023.

Candidates are advised to download the Hall Tickets two days before the Entrance Test date from the University website : www.braou.ac.in. The Entrance Test timing for B.Ed-ODL from 10:30 am to 12:30 pm and B.Ed (Special Education) 2.00 pm to 4.00 pm. The Entrance Test will be held on June 6. For Further details visit University website: www.braou.ac.in (or) www.braouonline.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X