श्रीशैलम में ब्रह्मोत्सव शुरू, विभिन्न वाहन सेवाएं कल से

हैदराबाद: श्रीशैलम में महाशिवरात्रि ब्रह्मोत्सव की शुरुआत शनिवार सुबह 8 बजकर 46 मिनट पर यज्ञशाला में प्रवेश के साथ शुरू हुई है। मंदिर के ईओ ​​लवन्ना ने कहा कि महोत्सव इस महीने की 21 तारीख तक आयोजित किया जाएगा। ब्रह्मोत्सवम के तहत शाम को सभी देवी-देवताओं को आमंत्रित कर ध्वजारोहण कार्यक्रम आयोजित किया जाएगा। उन्हों​​ने कहा कि कल से स्वामी और मांता के लिए विभिन्न वाहन सेवा और ग्रामोत्सव का आयोजन किया जाएगा।

హైదరాబాద్ : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ఈనెల 21 వరకు నిర్వహించనున్నట్టు ఈవో లవన్న తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజావరోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రేపటి నుంచి స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈవో తెలిపారు.

ఈ క్రమంలో 12న భృంగి వాహనసేవ, 13న హంస వాహనసేవ, 14న మయూర వాహనసేవ, 15న రావణ వాహనసేవ, 16న పుష్పపల్లకీ సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవను భక్తుల సమక్షంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తామని వివరించారు.

మరోవైపు 19న రథోత్సవం, తెప్పోత్సవం, 20న యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, 21న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఈనెల 13న దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, 14న ఉదయం శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవస్థానం, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం, 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని వివరించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X