హైదరాబాద్ : ఒకరి రక్తం దానంతో కొందరి ప్రాణాలను కాపాడుకోవచ్చునని రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎస్ఎస్ఏస్ యువసేన వ్యవస్థాపకుడు మాజీ సైనికుడు సంతోష్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి ఉత్సవాలను ఎస్ ఎస్ యువసేన ఆధ్వర్యంలో వారం రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఎస్ ఎస్ ఎస్ యువసేన ఆధ్వర్యంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా పట్నం సునీత మహేందర్ రెడ్డి, బసవరాజు శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీపాదరావు రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
Also Read-

సంతోష్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద ఎత్తున విచ్చేసి పాల్గొన్న యువకులను, సహకరించిన కార్యకర్తలను నాయకులను రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచినా ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఎలైట్ నాచారం అధ్యక్షుడు మామిడాల రాజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీల్ రెడ్డి, ఎస్ఎస్ఎస్ యువసేన సబ్యులు కిషోర్ రెడ్డి, కరుణాకర్ ,సాయిచంద్, ఆరెళ్ల శ్రీధర్, అక్షంత్ పడాల, రాజేష్, సాయి కుమార్, రాజశేఖర్, ఉదయ్, కృష్ణ, ఆనంద్, సెబాస్టియన్, కమల్, జెస్సీ, ఆండ్రూ,సన్ని, యశ్వంత్, మహేష్, సృజల్ తధితరులు పాల్గొన్నారు.
