హైదరాబాద్: ఐపీఎల్ లోని ముంబై ఇండియన్స్ టీం యజమాని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో నీతా అంబానీ హైదరాబాద్ వచ్చారు.
హైదరాబాద్లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా నీతా అంబానీ ముందుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియానికి వెళ్లడం నీతా అంబానీ సెంటిమెంట్. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆలయానికి చేరుకున్న నీతా అంబానీ కి ఆలయ ఈవో కుంట నాగరాజు, చైర్మన్ కొత్తపల్లి సాయి గౌడ్ లు ఘన స్వాగతం పలికారు. దాదాపు 15 నిమిషాల పాటు నీతా అంబానీ ఎల్లమ్మ అమ్మవారి సన్నిధిలో గడిపారు.
బల్కంపేట గుడిలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్మృణాల్
ఓ టాలీవుడ్ టాప్ హీరోయిన్ హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ గుడికి చాలా సాధాసీదాగా వెళ్లారు. సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తొలుత ఆమెను చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత ఫోటోలు కోసం ఎగబడ్డారు. పూజల అనంతరం అడిగిన అందరికీ ఫోటోలు ఇచ్చారు మృణాల్.
గుడిలోని పూజారి మృణాల్‌కు ప్రత్యేక ఆశీర్వాదం ఇచ్చారు. త్వరలో విడుదలవుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమా హిట్ అవ్వాలని దీవించండి అని మృణాల్ కోరడంతో ఆయన కూడా అలాగే దీవించారు. (ఏజెన్సీలు)