అమెరికాలో ప్రతిష్టాత్మక ‘ఆటా’ వేడుకలు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుకి ఆహ్వానం

హైదరాబాద్ : అమెరికాలోని మేరీల్యాండ్ వేదికగా జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ మహాసభలు మరియు యూత్ కన్వెన్షన్‌కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావుకి గౌరవపూర్వకంగా ఆహ్వానం అందింది. జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరగనున్న ఈ మూడ్రోజుల సమ్మేళనానికి రాంచందర్ రావు ని విశిష్ట అతిథిగా హాజరుకావాల్సిందిగా ‘ఆటా’ ఆహ్వానించింది. ఈ మహాసభలలో పాల్గొనడానికి రాంచందర్ రావు జూలై 30న అమెరికా బయలుదేరి వెళ్లి, కార్యక్రమాలు ముగించుకుని తిరిగి ఆగస్టు 6న హైదరాబాద్‌కు చేరుకుంటారు.

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా సమాచార సాంకేతికత (IT), పర్యాటకం, డిజిటల్ సేవలు మరియు స్టార్టప్ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించేలా ఈ మహాసభల్లో ప్రత్యేక ప్యానెల్ చర్చలు మరియు నెట్‌వర్కింగ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రొఫెషనల్స్, పారిశ్రామికవేత్తలు మరియు యువ నాయకులతో రాoచందర్ రావు భాగస్వామ్యం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ప్రతినిధులు లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడ చదవండి-

ఎన్. రాంచందర్ రావు అనుభవం, నాయకత్వ పటిమ ఈ సభలకు సరికొత్త దిశానిర్దేశం చేయడమే కాకుండా, విదేశీ తెలుగు సమాజానికి మరియు తెలంగాణ అభివృద్ధికి మధ్య అనుసంధానకర్తగా నిలుస్తుందని ‘ఆటా’ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా తెలంగాణ పారిశ్రామిక, సాంకేతిక ప్రగతికి సరికొత్త అవకాశాలు లభించడంతో పాటు, విదేశాలలో ఉన్న తెలుగువారికి తమ మాతృభూమితో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి రాంచందర్ రావు పాల్గొనడం ఎంతగానో తోడ్పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X