ఉద్యానవన శాఖ సమీక్షా సమావేశం, పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, దిని పై జరిగింది చర్చ

భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఈరోజు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హార్టికల్చర్(ఉద్యానవన శాఖ) పై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు.

సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి రైతుకూ చేరేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు, భువనగిరి భాస్కర్ రావు, జిల్లా అడిషనల్ కలెక్టర్, యాదాద్రి భువనగిరి, dhso మాధవి, ప్రజా ప్రతినిధులు మరియు ఉద్యానవన శాఖాధికారులతో కలిసి ప్రస్తుత ప్రగతిని, భవిష్యత్ కార్యాచరణను చర్చించారు.

ఇది కూడ చదవండి-

నియోజకవర్గాల వారీగా రైతులకు అవసరమైన సబ్సిడీలు, విత్తనాలు మరియు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు మరియు ఇతర మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X