తెలంగాణ ప్రజలందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు : ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్ : మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దం, గంగ-జమున తహజీబ్‌కు ప్రతీక అయిన చారిత్రాత్మక ఆషాఢ బోనాల జాతర ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక ప్రకటనలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ఆత్మగా నిలిచే ఈ బోనాల పండుగ మన జానపద వైభవానికి, భక్తి శ్రద్ధలకు నిదర్శనం. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో ప్రారంభమై.. లష్కర్ మహంకాళి జాతర, పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఉత్సవాల వరకు సాగే ఈ సంబురం యావత్ తెలంగాణకు ఒక సరికొత్త పండుగ వాతావరణాన్ని, ఉత్తేజాన్ని తీసుకువస్తుంది.

Also Read-

ఆ అమ్మవారి చల్లని చూపుతో రాష్ట్రంలోని పిల్లా జెల్లా, అన్నదాతలు, శ్రామికులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మన తెలంగాణ రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జలందరూ ఈ జాతరను భక్తిశ్రద్ధలతో, అత్యంత సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆశిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X